Kids and Calcium: మీ పిల్లల్లో కాల్షియం లోపం ఉంటే వారిలో ఈ 5 లక్షణాలు కనిపిస్తాయి, వీటిని తేలికగా తీసుకోకండి
Kids and Calcium: మీ పిల్లల శరీరంలో ఈ అయిదు లక్షణాలు కనిపిస్తే తేలికగా తీసుకోకండి. అవి వారిలో ఉన్న కాల్షియం లోపాన్ని సూచిస్తుంది. కాల్షియం నిండుగా ఉండే ఆహారాన్ని వారికి తినిపించాల్సిన అవసరం ఉంది. ఎలాంటి ఆహారాలను వారికి తినిపించాలో తెలుసుకోండి.
ఎముకలు, దంతాల అభివృద్ధికి కాల్షియం ముఖ్యమైన పోషకం. కాల్షియం తీసుకోకపోతే అనేక రకాల ఆరోగ్య సమస్యలు కూడా వస్తాయి. ఎదిగే వయసులో పిల్లల ఎముకలు బలంగా ఉండాలంటే వారి ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. కాల్షియం నరాలు, కండరాలు, జీర్ణవ్యవస్థ, మూత్రపిండాలు, గుండె పనిచేసే విధానాన్ని ప్రభావితం చేస్తుంది. శరీరంలో కాల్షియం లోపం ఉన్నప్పుడు హైపోకాల్సెమియా అనే సమస్య తలెత్తుతుంది. దీని వల్ల రక్తంలో కాల్షియం చాలా తక్కువ మొత్తంలో ఉంటుంది. అటువంటి పరిస్థితిలో, మీరు మీ పిల్లల శరీరం సరిగా ఎదగదు. వారిలో కాల్షియం లోపం ఉంటే కొన్ని రకాల లక్షణాలు కనిపిస్తాయి. అందులో ముఖ్యమైన 5 లక్షణాలు ఇక్కడ ఇచ్చాము. ఇవి మీ పిల్లల్లో కనిపిస్తే వారికి కాల్షియం లోపం ఉన్నట్టే లెక్క.
కాల్షియం లోపం ఉంటే కనిపించే లక్షణాలు
- పిల్లల్లో క్యాల్షియం లోపం వల్ల దంత క్షయం, చిగుళ్ల సమస్యలు ఎక్కువగా వస్తాయి. ఎముకలు, దంతాలు బలంగా ఉండేందుకు కాల్షియం చాలా ముఖ్యం. కానీ పిల్లల శరీరంలో క్యాల్షియం స్థాయి తక్కువగా ఉంటే దంతాలలో భరించలేని నొప్పి అనిపించవచ్చు. అలాగే నోటి పరిశుభ్రతను పాటింకపోయినా పీరియాంటల్ డిసీజ్ (చిగుళ్ల వ్యాధి) వచ్చే ప్రమాదం కూడా ఉంది.
2. పిల్లల శరీరంలో కాల్షియం లోపం ఉంటే వారి చేతులు, కాళ్లలో తిమ్మిరి, జలదరింపు వంటివి వస్తాయి. ఈ కారణంగా వారు నడుస్తున్నప్పుడు లేదా కదిలేటప్పుడు కూడా తిమ్మిరిని అనుభవిస్తారు. కాల్షియం లోపం కండరాల తిమ్మిరి, నొప్పి సమస్యలను కలిగిస్తుంది.
3. పిల్లల శరీరంలో కాల్షియం తక్కువగా ఉండటం వల్ల వారు నిరంతరం నీరసంగా ఉంటారు. వారి శక్తి స్థాయిలు తక్కువగా ఉంటాయి. బద్ధకంగా, అలసట వారిలో ఎక్కువగా ఉంటుంది. వారు తగినంత నిద్రపోతున్నాకూడా వారికి నీరసంగానే ఉంటుంది.
4. పిల్లల్లో క్యాల్షియం లోపం వల్ల వారి చేతి గోళ్లు బలహీనంగా, పసుపు రంగులోకి మారి పగిలిపోవడం మొదలవుతుంది. వారి గోళ్లు పాలిపోయినట్టు కనిపిస్తాయి. చిన్న ముక్కలుగా రాలిపోతూ ఉంటుంది. ఇది కాకుండా కాల్షియం లోపం కొన్నిసార్లు వారిలో జుట్టు రాలడంతో పాటు చర్మంలో వాపుకు కారణమవుతుంది. కాబట్టి పిల్లలకు అకారణంగా జుట్టు రాలుతున్నా, చర్మం వాపు వచ్చినా కూడా క్యాల్షియం లోపం ఉందేమో చెక్ చేయండి.
5. శరీరంలో కాల్షియం తక్కువగా ఉండటం వల్ల పిల్లల్లో చదువుల పట్ల ఏకాగ్రత తగ్గుతుంది. కాల్షియం శరీరంలో తగ్గడం వల్ల హైపోకాల్సెమియా అనే సమస్య వస్తుంది. ఇది తీవ్రంగా మారితే మెదడును దెబ్బతీస్తుంది. వారిలో భ్రమలు కలగడం, జ్ఞాపకశక్తి కోల్పోవడం, మతిమరుపు, డిప్రెషన్, భ్రాంతులు కలగడం వంటి న్యూరోలాజిక్ లేదా మానసిక లక్షణాలు కలుగుతుంది.
కాల్షియం అధికంగా ఉండే ఆహారాలు
పాలు,పెరుగు పిల్లలకు ప్రతిరోజూ తినిపించాలి. అలాగే ఆకుకూరలతో వండిన ఆహారాలను తినిపించాలి. సన్ ఫ్లవర్ సీడ్స్, గుమ్మడి గింజలు,బాదం, జీడిపప్పులు, పిస్తా వంటివి తినిపించాలి. రాగులు, కొమ్ము శెనగలు, చేపలు, బీన్స్, వేరుశెగనపలుకులు వంటివి వారి ఆహారంలో ఉండేలా చూసుకోండి.