శృంగారం తర్వాత ముసుగుతన్ని పడుకుంటున్నారా? కాసేపు ఇలా చేస్తే మీ పార్ట్‌నర్ హ్యాపీగా ఫీలవుతారు!-these things you should always do after having sex ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  శృంగారం తర్వాత ముసుగుతన్ని పడుకుంటున్నారా? కాసేపు ఇలా చేస్తే మీ పార్ట్‌నర్ హ్యాపీగా ఫీలవుతారు!

శృంగారం తర్వాత ముసుగుతన్ని పడుకుంటున్నారా? కాసేపు ఇలా చేస్తే మీ పార్ట్‌నర్ హ్యాపీగా ఫీలవుతారు!

Galeti Rajendra HT Telugu
Oct 18, 2024 08:00 PM IST

శృంగారం తర్వాత చాలా మంది పార్ట్‌నర్ గురించి పట్టించుకోకుండా వెంటనే నిద్రలోకి జారుకుంటూ ఉంటారు. కానీ సంభోగం తర్వాత మీరు కొన్ని పనులు చేస్తే ఆరోగ్యంగానే కాదు ఆనందంగానూ ఉంటారు.

సంభోగం తర్వాత చేయాల్సిన పనులు
సంభోగం తర్వాత చేయాల్సిన పనులు (freepik)

శృంగారానికి ముందు భాగస్వామికి మూడ్‌ను తెప్పించేందుకు ఎలా ఫోర్ ప్లేలో చేయాలో చాలా మందికి తెలుసు. కానీ.. సంభోగం తర్వాత ఏం చేయాలో మీకు తెలుసా? ఇప్పటికీ చాలా మంది శృంగారం తర్వాత భాగస్వామి గురించి పట్టించుకోకుండా ముసుగుతన్ని పడుకునేస్తుంటారు. సంభోగం తర్వాత మీరు ఏం చేయాలి? మీ భాగస్వామితో ఎలా వ్యవహరిస్తే హ్యాపీగా ఫీలవుతారు? అనే విషయాల్ని ఇక్కడ తెలుసుకుందాం.

సంభోగం తర్వాత

శృంగారం తర్వాత మూత్రం వస్తున్నట్లు అనిపిస్తే వెంటనే బాత్రూమ్‌కి వెళ్లండి. సంభోగం తర్వాత వెంటనే మూత్ర విసర్జన చేయడం వల్ల యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశాలు తగ్గుతాయి. ఇది విచ్చలవిడి స్పెర్మ్‌లను బయటకు పంపుతుంది. అలానే గర్భం వచ్చే అవకాశాల్ని తగ్గిస్తుంది.

సంభోగం సమయంలో బ్యాక్టీరియా మూత్ర నాళంలోకి వచ్చే అవకాశం ఉన్నందున మీకు అంటువ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి వాష్‌రూమ్‌ను వెళ్లడాన్ని ఒక రొటీన్‌గా చేసుకోండి. ఒకవేళ మూత్రం పోయాలని మీకు అనిపించకపోతే ఒక గ్లాసు నీరు తాగండి. ఇది క్రిములను బయటకు పంపడానికి మీకు సహాయపడుతుంది.

సున్నితంగా శుభ్రం చేసుకోండి

సంభోగం తర్వాత మీ ప్రైవేట్ పార్ట్స్‌ను సబ్బుతో శుభ్రం చేసుకోండి. అలానే ఆ తడిని మృదువైన బట్ట లేదా టవల్‌తో తుడుచుకోండి. ఒకవేళ తేమ అలానే ఉంటే మీ నిద్రకి భంగం కలగవచ్చు. అలానే శుభ్రమైన లోదుస్తులు, బట్టలను ధరించండి. అలా చేయడం వల్ల మీరు ఇన్ఫెక్షన్‌కి దూరంగా ఉండొచ్చు.

సంభోగం తర్వాత మీ ప్రైవేట్ భాగాల చుట్టూ ఏవైనా గాయాలు, మూత్ర విసర్జన సమయంలో ఏదైనా మంట లేదా దురద అనిపిస్తే వాటిని జాగ్రత్తగా శుభ్రం చేసుకోండి. ఒకవేళ ఆ నొప్పి తీవ్రత అలానే ఉన్నా.. లేదా జ్వరం లాంటివి వచ్చినా వైద్యుడిని సంప్రదించడం ఉత్తమం.

కండోమ్‌లు వాడుతుంటే

చాలా మంది శృంగారం తర్వాత కండోమ్‌ను టాయిలెట్‌లో ఫ్లష్ చేయడానికి ప్రయత్నిస్తుంటారు. కానీ ఇది మంచి పద్ధతి కాదు. వాటిని పేపర్‌లో చుట్టి డస్ట్ బిన్‌లో వేయడం మంచిది. కుటుంబ సభ్యులకి ఇబ్బంది లేకుండా కండోమ్ చుట్టూ పేపర్ లేదా ఒక కవర్‌లో ఉంచి డస్ట్ బిన్‌లో వేయండి.

భాగస్వామితో ప్రేమగా

శృంగారం తర్వాత మీ భాగస్వామితో ప్రేమపూర్వకంగా కాసేపు మాట్లాడండి. కౌగిలించుకోవడం లేదా ముద్దు పెట్టడం లేదా జాగ్రత్తగా మీ భాగస్వామి చేయి పట్టుకుని మీ ప్రేమను వ్యక్తపరచండి. ఒకరినొకరు ప్రశంసించుకోవడం లేదా మధురానుభూతుల్ని పంచుకోవడం ద్వారా మీ బంధం మరింత బలపడుతుంది. మీరు చెప్పడమే కాదు.. మీ భాగస్వామి చెప్పేవి కూడా మీరు కాసేపు శ్రద్ధగా వినండి.

కంఫర్ట్ జోన్‌లో ఉంచండి

సంభోగం తర్వాత ఇద్దరూ కంఫర్ట్‌గా ఉన్నప్పుడు శారీరక ఆరోగ్యం, క్లోజ్‌నెస్ గురించి చర్చించుకోవచ్చు. అలానే మీ భాగస్వామి సంతృప్తిగా ఉన్నారా? లేదా అనే విషయాన్ని కూడా చర్చింవచ్చు. ఒకవేళ ఏదైనా అసంతృప్తి ఉందని వారి మాటల ద్వారా మీకు అర్థమైతే.. శృంగార జీవితాన్ని మెరుగు పరుచుకోవడానికి ఏం చేయాలో వాటిపై దృష్టి పెట్టండి.

పగలు అయితే?

రాత్రి పూట శృంగారం తర్వాత కాసేపు మాట్లాడుకుని నిద్రలోకి జారుకుంటారు. ఒకవేళ పగలు సంభోగంలో పాల్గొంటే.. ఇద్దరూ కలిసి సరదాగా సినిమా చూడటం, సంగీతం వినటం, లేదా పాత విషయాల్ని రీలాక్స్ అయ్యేలా మాట్లాడుకోండి. ఇది మీ భాగస్వామికి మిమ్మల్ని మరింత దగ్గర చేస్తుంది. శృంగారం అనేది కేవలం శరీరానికే కాదు మానసిక ఆరోగ్యానికి కూడా సంబంధించి అనేది గుర్తుంచుకోవాలి.

Whats_app_banner