First Intercourse : సంభోగం తర్వాత రక్తస్రావం సాధారణమా? నిపుణుల మాట ఏంటి?
First Intercourse : శారీరక సంబంధం ద్వారా స్త్రీ, పురుషుడు ఆనందం పొందుతారు. దీని తర్వాత ఏదైనా సమస్య ఎదుర్కొంటే దాని గురించి మౌనంగా ఉండకూడదు. ఎందుకంటే సమస్య పెరుగుతుంది. ఆ విషయాల గురించి కూడా మనసు విప్పి మాట్లాడాలి.
సెక్స్ మీ వైవాహిక జీవితాన్ని మెరుగుపరచడమే కాకుండా మీ బంధాన్ని బలపరుస్తుంది. చాలా మంది మహిళలు ఇప్పటికీ లైంగిక ఆనందాల గురించి మాట్లాడరు. అంతేకాదు శారీరక సంబంధం తర్వాత ఏదైనా సమస్య వచ్చినప్పుడు వారిలో వారే విషయాన్ని దాచిపెట్టుకుంటారు.
చాలా మంది మహిళలు సెక్స్ తర్వాత యోని రక్తస్రావం అనుభవిస్తారు. ఈ విషయంపై కొందరు గందరగోళం చెందుతారు. దీనికి కారణమేమిటి? అని చాలా మందికి తెలియదు. యోని రక్తస్రావం జరిగితే.. నిపుణుల సలహాను తీసుకోవడం మంచిది. మీకు మీరే ఏదైనా చికిత్స చేసుకుంటే మాత్రం ఇబ్బందులు ఎదురవుతాయి.
లైంగిక సంపర్కం తర్వాత యోని నుండి రక్తస్రావం జరిగే రకాన్ని పోస్ట్‌కోయిటల్ బ్లీడింగ్ అంటారు. ఈ రక్తస్రావం తేలికపాటి, కొన్నిసార్లు విపరీతంగా ఉంటుంది. దీనికి చాలా కారణాలు ఉండవచ్చు, ప్రతి ఒక్కరూ వాటి గురించి తెలుసుకోవాలి.
పీరియడ్స్ దగ్గరగా ఉన్నప్పుడు సెక్స్ చేసిన తర్వాత కూడా రక్తస్రావం చాలాసార్లు జరగవచ్చు. కాబట్టి డాక్టర్ వద్దకు వెళ్లే ముందు మీ పీరియడ్స్ డేట్‌ని చెక్ చేసుకోండి. పీరియడ్స్ దగ్గర పడనప్పుడు రక్తస్రావం అవుతుంటే డాక్టర్‌ని సంప్రదించాలి.
ఇది లైంగికంగా సంక్రమించే ఇన్ఫెక్షన్ లేదా లైంగికంగా సంక్రమించే వ్యాధి (STD) వల్ల సంభవించవచ్చు. సెక్స్ తర్వాత రక్తస్రావం ఈస్ట్ లేదా ఇతర యోని ఇన్ఫెక్షన్ల వల్ల కూడా ఇది జరగొచ్చు. ఇందులో క్లామిడియా లేదా గోనేరియా వంటి STIలు ఉంటాయి. యోని పొడిగా ఉంటే సెక్స్ సమయంలో రక్తస్రావం కలిగిస్తుంది. యోని చాలా పొడిగా ఉన్నప్పుడు, యోని ప్రవేశద్వారం వద్ద చర్మం పైకి లేస్తుంది. ఇది రక్తస్రావం కలిగిస్తుంది. లూబ్రికెంట్ వాడటం మంచిది.
మీ పీరియడ్స్ దగ్గరలో ఉన్నప్పటికీ సంభోగం తర్వాత యోని రక్తస్రావం జరగవచ్చు. ఈ సమయంలో ఈస్ట్రోజెన్ లేకపోవడం వల్ల, యోని కణజాలం పొడిగా, సన్నగా మారుతుంది. కొన్నిసార్లు మీరు గర్భవతిగా ఉన్నప్పుడు సెక్స్ చేయడం వలన రక్తస్రావం కావచ్చు. అయితే మీరు గర్భవతి అయి.., యోనిలో రక్తస్రావం కలిగి ఉంటే, క్షణం ఆలస్యం చేయకుండా వైద్య సలహా తీసుకోండి.
శృంగారంలో ఉన్నప్పుడు దంపతులిద్దరూ ప్రశాంతంగా ఉండాలి. శృంగారం హడావుడిగా జరిగినప్పటికీ, యోనిలో ఘర్షణ ఏర్పడవచ్చు. అది రక్తస్రావం కావచ్చు. కాబట్టి తొందరపడి చేయోద్దు. కొంతమంది స్త్రీలు మొదటిసారి సెక్స్ చేసిన తర్వాత రక్తస్రావం అవుతుంది. ఇది కొందరికి జరగదు. ఈ రెండు విషయాలు సాధారణమే. కొన్నిసార్లు గర్భాశయం వైద్య పరిస్థితులు కూడా దీనికి కారణం కావచ్చు.