Kiss and Bacteria: ఒక్క ముద్దు ఎన్ని రోగాలకు కారణం అవుతుందో తెలుసా? ఇది చదివితే ముద్దు పెట్టాలంటేనే భయమేస్తుంది-do you know how many diseases a single kiss can cause if you read this you will be scared to kiss ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Kiss And Bacteria: ఒక్క ముద్దు ఎన్ని రోగాలకు కారణం అవుతుందో తెలుసా? ఇది చదివితే ముద్దు పెట్టాలంటేనే భయమేస్తుంది

Kiss and Bacteria: ఒక్క ముద్దు ఎన్ని రోగాలకు కారణం అవుతుందో తెలుసా? ఇది చదివితే ముద్దు పెట్టాలంటేనే భయమేస్తుంది

Haritha Chappa HT Telugu

Kiss and Bacteria: ఒక్క ముద్దుతో 700 రకాల బ్యాక్టీరియాలను ఇచ్చి పుచ్చుకోవచ్చని తెలుసా? రోజులో తొమ్మిది సార్లు మీ జీవిత భాగస్వామికి ముద్దు పెడితే వందల బ్యాక్టీరియాలు మీ శరీరంలో చేరుతాయి.

ముద్దు వల్ల వచ్చే బ్యాక్టిరియా (pixabay)

ముద్దు పెట్టుకోవడం అనే ఊహ మానసికంగా ఉత్సాహాన్ని ఇస్తుందేమో... కానీ శారీరకంగా మాత్రం ఎన్నో వ్యాధులకు కారణం అవుతుంది. తాజా పరిశోధన ప్రకారం ఒక్క ముద్దు ద్వారా వందల రకాల బ్యాక్టీరియాలో మీ శరీరం నుంచి ఎదుటివారి శరీరంలోకి బదిలీ అవుతాయి. ఈ బ్యాక్టీరియాలు ఒక్కోసారి తీవ్రవ్యాధులకు కూడా కారణం కావచ్చు.

ముద్దు అనగానే ఎక్కడ పెట్టే ముద్దు అనే సందేహం రావచ్చు. ఇక్కడ మేము ఫ్రెంచ్ కిస్ గురించే మాట్లాడుతున్నాము. అంటే మీ పెదవులతో ఎదుటివారి పెదవులపై పెట్టే ముద్దు గురించే చెబుతున్నాము. చెంపల మీద, నుదుటిమీద పెట్టే ముద్దువల్ల ఎలాంటి నష్టం లేదు, కానీ పెదవుల నుంచి పెదవులపై పెట్టే ముద్దు మాత్రం ఎన్నో రకాల బ్యాక్టీరియాలను బదిలీ చేస్తుంది.

నెదర్లాండ్స్ ఆర్గనైజేషన్ ఫర్ అప్లైడ్ సైంటిఫిక్ రీసెర్చ్ సంస్థ ఈ పరిశోధనలు నిర్వహించింది. 21 జంటల నుండి లాలాజలం, నాలుకపై ఉన్న నమూనాలను సేకరించింది. వారిలో ఉన్న బ్యాక్టీరియాలను పరిశీలించింది. మన నోటిలో 700 కంటే ఎక్కువ రకాల బ్యాక్టీరియాలు ఉంటాయని తెలిసింది.

ఈ పరిశోధనలో జంటలు ముద్దు పెట్టుకున్న తర్వాత వారి లాలాజలంలో ఉండే బ్యాక్టీరియాలు ఒకేలా కనిపించాయి. అంటే ఒకరి నుంచి ఒకరికి బ్యాక్టీరియాని బదిలీ అయ్యాయని అర్థమవుతుంది. అందులో కొన్ని ప్రమాదకరమైన బ్యాక్టీరియాలకు ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే ఒక వ్యక్తిలో ఎలాంటి బ్యాక్టీరియా, వైరస్ చేరిందో కనిపెట్టడం కష్టం. ఆ బాక్టీరియా వల్ల కలిగే అనారోగ్యా లక్షణాలు బయటపడేవరకు ప్రమాదకరమైన బ్యాక్టీరియా గుర్తించలేము.

అందుకే ముద్దు పెట్టుకోవడానికి ముందు ప్రతి ఒక్కరూ నోటిని పరిశుభ్రంగా ఉంచుకోవడం చాలా అవసరం. వారు ఏదైనా ఆహార పదార్థాలు తిన్నా అందులోని బ్యాక్టీరియా కూడా నోట్లోని లాలాజలంలో చేరుతుంది. ఆ తర్వాత ఏ వ్యక్తినైనా ముద్దు పెట్టుకుంటే లాలాజలం ద్వారా పెదవులకు, పెదవుల ద్వారా నోటిలోనికి అది చేరుతుంది. అలాంటి బ్యాక్టీరియా చేరకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరూ ముద్దు పెట్టుకునే ముందు నోటి పరిశుభ్రతను పాటించడం మంచిది.

ముద్దు వల్ల మానసిక ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది. ముద్దును ఎదుటివారిపై ప్రేమను వ్యక్తపరచడానికి వినియోగిస్తారు. తరచూ ముద్దు పెట్టుకునేవారిలో రక్తపోటు అదుపులో ఉంటుంది. గుండె కొట్టుకునే వేగం కూడా స్థిరంగా ఉంటుంది. ముద్దు వల్ల రక్తనాళాలు విస్తరిస్తాయి. కాబట్టి రక్త ప్రసరణ సవ్యంగా సాగుతుంది. గుండె పోటు వచ్చే అవకాశం చాలా వరకు తగ్గుతుంది.

ముద్దు వల్ల శరీరంలో హ్యాపీ హార్మోన్లు విడుదలవుతాయి.ఒత్తిడి హార్మోన్ అయిన కార్టిసాల్ ఉత్పత్తిని తగ్గిస్తుంది. తరచూ ముద్దు పెట్టుకునేవారిలో తలనొప్పి, పొట్టనొప్పి వంటివి తక్కువగా వచ్చే అవకాశం ఉంది. ఒత్తిడి వల్ల కలిగే అలెర్జీలను తగ్గించేందుకు కూడా ముద్దు ఎంతో ఉపయోగపడుతుంది. అంతే కాదు మీ పిల్లల్ని, జీవిత భాగస్వామిని పదే పదే ముద్దు పెట్టుకోవడం వల్ల మీ మధ్య అనుబంధం కూడా బలపడుతుంది. ముద్దంటే కేవలం పెదవులపై పెట్టేదే కాదు, మీ ప్రేమను తెలియజేయాలంటే చెంపలపై, నుదుటిపై కూడా ముద్దు పెట్టి వ్యక్తపరచవచ్చు.