Sleeping Drinks: రాత్రిపూట నిద్రపట్టడం లేదా? పడుకునే ముందు ఈ డ్రింకులను తాగేందుకు ప్రయత్నించండి
- Sleeping Drinks: మీరు రాత్రిపూట నిద్రపోవడానికి ఇబ్బంది పడుతున్నారా? నిద్రకు గంట ముందు కొన్ని రకాల పానీయాలు ప్రత్యేకంగా తాగడం వల్ల ఎంతో ఉపయోగం ఉంటుంది. ఎలాంటి డ్రింక్స్ తాగితే నిద్రపడుతుందో తెలుసుకోండి.
- Sleeping Drinks: మీరు రాత్రిపూట నిద్రపోవడానికి ఇబ్బంది పడుతున్నారా? నిద్రకు గంట ముందు కొన్ని రకాల పానీయాలు ప్రత్యేకంగా తాగడం వల్ల ఎంతో ఉపయోగం ఉంటుంది. ఎలాంటి డ్రింక్స్ తాగితే నిద్రపడుతుందో తెలుసుకోండి.
(1 / 7)
కంటినిండా నిద్ర పొందడం చాలా ముఖ్యం. రాత్రిపూట సరైన మోతాదులో నిద్రపోతే, మీరు ఉదయం లేచి మీ పనిని సరిగా చేయలేరు. నిద్రలేమి సమస్యను పరిష్కరించుకోవాలంటే, రాత్రి పడుకునే ముందు కొన్ని పానీయాలు తాగాలి. చామంతి పూల టీ తాగడం వల్ల మీకు నిద్ర వస్తుంది. ఇది మెలనిన్ పెరిగేలా చేస్తుంది. అలాగే పాలు లేదా వేడి నీటిలో పసుపు వేసి తాగినా మంచి ఫలితం ఉంటుంది.
(2 / 7)
పసుపు కలిపిన పాలు రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడతాయి. బాదం పాలు కూడా తాగవచ్చు. ఈ పానీయాలు తాగడం ద్వారా మీ రాత్రి నిద్రను మెరుగుపరుచుకోవచ్చు.
(3 / 7)
ప్రతి రాత్రి 8 గంటలకు తగ్గకుండా నిద్రపోవాలి. రాత్రి 10 గంటల్లోపు నిద్రపోయి ఉదయం 6 గంటలకే నిద్రలేవడం అలవాటు చేసుకోవాలి. ప్రతిరోజూ ఒకే సమయానికి నిద్రపోవడం, ఒకే సమయంలో నిద్రలేవడం అవసరం. ఇరవై నిమిషాల్లో నిద్ర పట్టకపోతే లేచి రిలాక్స్ అయ్యి పడుకోవాలి. శాంతపరిచే సంగీతాన్ని వినండి. అలసటగా అనిపించినప్పుడు పడుకుంటే త్వరగా నిద్రపడుతుంది.
(4 / 7)
ఆకలితో పడుకుంటే నిద్రపట్టదు. అలాగే అతిగా తిని పడుకున్న నిద్రపట్టదు. పడుకోవడానికి రెండు గంటల ముందు ఏమీ తినవద్దు. నికోటిన్, కెఫిన్, ఃఆల్కహాల్ తీసుకునే వ్యక్తులు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇది మీ నిద్రను ప్రభావితం చేస్తుంది. ఇది రాత్రి మీ నిద్రకు భంగం కలిగిస్తుంది.
(5 / 7)
మీరు పడుకునే గది చల్లగా, నిశ్శబ్దంగా, చీకటిగా ఉండాలి. సాయంత్రం వెలుతురు ఉంటే, అది మీ నిద్రకు భంగం కలిగిస్తుంది. పడుకునే ముందు లైట్ ఎమిటింగ్ స్క్రీన్లను నివారించాలి. పడకగది నిశ్శబ్దంగా ఉండాలి. అదే నిద్రను మెరుగుపరుస్తుంది.
(6 / 7)
పగటిపూట ఎక్కువ సేపు నిద్రపోవడం వల్ల రాత్రిపూట మీ నిద్రపై ప్రభావం పడుతుంది. కాబట్టి పగటిపూట అరగంటకు మించి నిద్రపోకూడదు. రాత్రిపూట పనిచేస్తే మధ్యాహ్నం తర్వాత నిద్రపోతే ఫ్రెష్ గా నైట్ షిఫ్ట్ కు వెళ్లగలుగుతారు.
ఇతర గ్యాలరీలు