Allu Arjun:ఇన్‌స్టాగ్రామ్‌లో హ‌య్యెస్ట్ ఫాలోవ‌ర్స్ ఉన్న టాలీవుడ్ హీరో అల్లు అర్జున్ -అత‌డు ఫాలో అయ్యేది మాత్రం ఒక్క‌రినే-do you know who is the only person allu arjun following in his instagram ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Allu Arjun:ఇన్‌స్టాగ్రామ్‌లో హ‌య్యెస్ట్ ఫాలోవ‌ర్స్ ఉన్న టాలీవుడ్ హీరో అల్లు అర్జున్ -అత‌డు ఫాలో అయ్యేది మాత్రం ఒక్క‌రినే

Allu Arjun:ఇన్‌స్టాగ్రామ్‌లో హ‌య్యెస్ట్ ఫాలోవ‌ర్స్ ఉన్న టాలీవుడ్ హీరో అల్లు అర్జున్ -అత‌డు ఫాలో అయ్యేది మాత్రం ఒక్క‌రినే

Nelki Naresh Kumar HT Telugu
Dec 14, 2024 10:06 AM IST

Allu Arjun: ఇన్‌స్టాగ్రామ్‌లో హ‌య్యెస్ట్ ఫాలోవ‌ర్స్ ఉన్న టాలీవుడ్ హీరోల్లో అల్లు అర్జున్ ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్నాడు. అల్లు అర్జున్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో 28 మిలియ‌న్ల మంది ఫాలో అవుతోన్నారు. అల్లు అర్జున్ మాత్రం ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక్క‌రినే ఫాలో అవుతున్నాడు. ఆ ఒక్క‌రు ఎవ‌రంటే?

అల్లు అర్జున్
అల్లు అర్జున్

Allu Arjun: అల్లు అర్జున్ అరెస్ట్ కావ‌డంతో టాలీవుడ్‌తో పాటు దేశ‌వ్యాప్తంగా చ‌ర్చ‌నీయాంశంగా మారింది. పుష్ప 2 ప్రీమియ‌ర్ సంద‌ర్భంగా సంధ్య థియేట‌ర్ వ‌ద్ద జ‌రిగిన తొక్కిస‌లాట‌లో ఓ మ‌హిళా అభిమాని మృతి చెందింది. ఎలాంటి స‌మాచారం ఇవ్వ‌కుండా అల్లు అర్జున్ థియేట‌ర్‌కు రావ‌డం వ‌ల్లే ఈ ఘ‌ట‌న జ‌రిగిందంటూ పోలీసులు అత‌డిపై కేసు న‌మోదు చేశారు. శుక్ర‌వారం అత‌డిని అరెస్ట్ చేశారు.

రిమాండ్‌...బెయిల్‌...

నాంప‌ల్లి కోర్టు అల్లు అర్జున్‌కు ప‌ధ్నాలుగు రోజులు రిమాండ్ విధించ‌డంతో చంచ‌ల్‌గూడ జైలుకు అల్లు అర్జున్‌ను పోలీసులు త‌ర‌లించారు. హైకోర్టు మ‌ధ్యంత‌ర బెయిల్ మంజూరు చేయ‌డంతో శ‌నివారం ఉద‌యం జైలు నుంచి విడుద‌ల‌య్యాడు. తొలుత గీతా ఆర్ట్స్ చేరుకున్న అల్లు అర్జున్ అక్క‌డి నుంచి ఇంటికి వెళ్లారు.

పుష్ప‌తో హిట్‌...

ఇదిలా ఉండ‌గా పుష్ప 2తో కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు అల్లు అర్జున్‌. ఈ కేసు కార‌ణంగా స‌క్సెస్‌ను ఎంజాయ్ చేయ‌లేక‌పోతాడు. తొమ్మిది రోజుల్లోనే పుష్ప 2 మూవీ 1100 కోట్ల మైలురాయికి చేరువైంది. . సౌత్ కంటే నార్త్‌లోనే అల్లు అర్జున్ మూవీ ఎక్కువ‌గా క‌లెక్ష‌న్స్ రాబ‌డుతోంది.

హ‌య్యెస్ట్ ఫాలోవ‌ర్స్‌...

పుష్ప 2 రిలీజ్ త‌ర్వాత అల్లు అర్జున్‌కు సోష‌ల్ మీడియాలో భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది. ప్ర‌స్తుతం ఇన్‌స్టాగ్రామ్‌లో హ‌య్యెస్ట్ ఫాలోవ‌ర్స్ ఉన్న టాలీవుడ్ హీరోల్లో అల్లు అర్జున్ నంబ‌ర్ వ‌న్ ప్లేస్‌లో ఉన్నాడు. అల్లు అర్జున్‌కు ఇన్‌స్టాగ్రామ్‌లో 28 మిలియ‌న్ల‌కుపైగా ఫాలోవ‌ర్స్ ఉన్నారు. ఫాలోవ‌ర్స్ ప‌రంగా అల్లు అర్జున్ ద‌రిదాపుల్లో కూడా మిగిలిన తెలుగు హీరోలు లేక‌పోవ‌డం గ‌మ‌నార్హం.

ఒక్క‌రినే ఫాలో...

అల్లు అర్జున్‌కు 28 మిలియ‌న్ల ఫాలోవ‌ర్స్ ఉండ‌గా...అత‌డు మాత్రం ఇన్‌స్టాగ్రామ్‌లో కేవ‌లం త‌న భార్య స్నేహారెడ్డిని మాత్ర‌మే ఫాలో అవుతోన్నాడు. మెగాస్టార్ చిరంజీవి, ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌తో పాటు త‌న ఫ్యామిలీ మెంబ‌ర్స్‌ను కూడా అల్లు అర్జున్ ఫాలో కావ‌డం లేదు.

రామ్‌చ‌ర‌ణ్ సెకండ్‌

ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవ‌ర్స్ సంఖ్య‌లో అల్లు అర్జున్ త‌ర్వాత రామ్‌చ‌ర‌ణ్ సెకండ్ ప్లేస్‌లో ఉన్నాడు. రామ్‌చ‌ర‌ణ్ ఇన్‌స్టాగ్రామ్‌ను 25.4 మిలియ‌న్ల మంది ఫాలో అవుతోన్నారు. అల్లు అర్జున్‌, రామ్‌చ‌ర‌ణ్ త‌ర్వాత మూడో స్థానంలో టాలీవుడ్ యంగ్ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ నిల‌వ‌డం గ‌మ‌నార్హం. విజ‌య్‌కి ఇన్‌స్టాగ్రామ్‌లో 22 మిలియ‌న్ల మంది ఫాలోవ‌ర్స్ ఉన్నారు. 14.5 మిలియ‌న్ల‌తో మ‌హేష్‌బాబు నాలుగో స్థానంలో నిల‌వ‌గా...13 మిలియ‌న్ల‌తో ప్ర‌భాస్ ఐదో ప్లేస్‌లో ఉన్నారు. వీరి త‌ర్వాతే జూనియ‌ర్ ఎన్టీఆర్ (ఏడు మిలియ‌న్లు) ఉండ‌టం గ‌మ‌నార్హం.

Whats_app_banner