Imanvi: ఒక్క రోజులోనే ఇమాన్వీకి ల‌క్ష‌ మంది ఫాలోవ‌ర్స్ పెరిగారు - ప్ర‌భాస్ హీరోయిన్ బ్యాక్‌గ్రౌండ్ ఇదే!-image background prabhas heroine iman esmail trending on social media imanvi instagram ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Imanvi: ఒక్క రోజులోనే ఇమాన్వీకి ల‌క్ష‌ మంది ఫాలోవ‌ర్స్ పెరిగారు - ప్ర‌భాస్ హీరోయిన్ బ్యాక్‌గ్రౌండ్ ఇదే!

Imanvi: ఒక్క రోజులోనే ఇమాన్వీకి ల‌క్ష‌ మంది ఫాలోవ‌ర్స్ పెరిగారు - ప్ర‌భాస్ హీరోయిన్ బ్యాక్‌గ్రౌండ్ ఇదే!

Nelki Naresh Kumar HT Telugu
Aug 18, 2024 12:04 PM IST

Imanvi: ప్ర‌భాస్ డైరెక్ట‌ర్ హ‌ను రాఘ‌వ‌పూడి హిస్టారిక‌ల్ ల‌వ్ స్టోరీ శ‌నివారం మొద‌లైంది. ఈ మూవీలో సోష‌ల్ మీడియా సెన్సేష‌న్ ఇమాన్వీ హీరోయిన్‌గా న‌టిస్తోంది. ఓపెనింగ్ ఈవెంట్‌లో ప్ర‌భాస్‌తో ఇమాన్వీ దిగిన ఫొటోలు వైర‌ల్ కావ‌డంతో నెటిజ‌న్లు ఈ బ్యూటీ గురించి తెగ వెతుకుతున్నారు.

ఇమాన్వీ
ఇమాన్వీ

Imanvi: ప్ర‌భాస్ హీరోగా హ‌ను రాఘ‌వ‌పూడి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన హిస్టారిక‌ల్ ల‌వ్ స్టోరీ మూవీ శ‌నివారం ఆఫీషియ‌ల్‌గా లాంఛ్ అయ్యింది. ఈ మూవీలో హీరోయిన్‌గా మృణాల్ ఠాకూర్‌, అలియా భ‌ట్‌తో పాటు ప‌లువురు బాలీవుడ్‌, టాలీవుడ్ అగ్ర క‌థానాయిక‌ల పేర్లు వినిపించాయి. కానీ వారంద‌రిని కాద‌ని సోష‌ల్ మీడియా సెన్సేష‌న్ ఇమాన్వీని హీరోయిన్ సెలెక్ట్ చేసి ప్ర‌భాస్ ఫ్యాన్స్‌తో పాటు మూవీ ల‌వ‌ర్స్‌ను స‌ర్‌ప్రైజ్ చేశాడు హ‌ను రాఘ‌వ‌పూడి.

టాక్ ఆఫ్ ది ఇండ‌స్ట్రీ...

హీరోయిన్‌గా తొలి మూవీనే ప్ర‌భాస్‌తో చేసే అవ‌కాశాన్ని ద‌క్కించుకున్న ఇమాన్వీ ప్ర‌స్తుతం టాలీవుడ్ లో టాక్ ఆఫ్ ది ఇండ‌స్ట్రీగా మారింది. ఇమాన్వీ ఎవ‌రు...ఆమె బ్యాక్‌గ్రౌండ్ ఏమిట‌న్న‌ది నెటిజ‌న్లు తెగ వెతుకుతున్నారు.

ఇమాన్వీ ఇస్మాయిల్‌...

ఇమాన్వీ కుటుంబానికి సినీ నేప‌థ్యం లేదు. ఆమె అస‌లు పేరు ఇమాన్వీ ఇస్మాయిల్‌. ఇమాన్వీ గానే ఆమె అంద‌రికి తెలుసు. 1995లో ఢిల్లీలో పుట్టిన ఇమాన్వీ ఇస్మాయిల్ సోష‌ల్ మీడియాలో రీల్స్ చేస్తూ పాపుల‌ర్ అయ్యింది. ఇమాన్వీ మంచి డ్యాన్స‌ర్‌. వెస్ట్ర‌న్ మాత్ర‌మే కాదు భ‌ర‌త‌నాట్యం, కూచిపూడిలో ఆమెకు ప్ర‌వేశ‌ముంది.

విదేశాల్లో డ్యాన్సుల్లో శిక్ష‌ణ తీసుకుంద‌ట‌. సోష‌ల్ మీడియాలో తెలుగు, హిందీ, త‌మిళంతో పాటు ప‌లు భాష‌ల‌కు చెందిన సూప‌ర్ హిట్ సాంగ్స్‌కు స్టెప్పులు వేస్తూ ఆ రీల్స్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తుంది ఇమాన్వీ. మ‌హేష్‌బాబు కుర్చీ మ‌డ‌త‌పెట్టి, జైల‌ర్‌లోని నువ్ కావాల‌య్యా పాట‌ల‌కు ఇమాన్వీ వేసిన స్టెప్పులు సోష‌ల్ మీడియాలో ట్రెండింగ్ అయ్యాయి. ల‌క్ష‌ల్లో వ్యూస్‌ను సాధించిపెట్టాయి.

ఫేమ‌స్ కావ‌డానికి...

డ్యాన్స్ రీల్స్ చాలా మంది చేస్తోన్న ఇమాన్వీఎక్కువ‌గా ఫేమ‌స్ కావ‌డానికి ప‌ర్‌ఫెక్ష‌న్ చూపించ‌డ‌మే కార‌ణం. డ్యాన్స్‌మూవ్‌మెంట్స్‌కు త‌గ్గ‌ట్లుగా ఎక్స్‌ప్రెష‌న్స్ ప‌లికిస్తుంది. చాలా వీడియోల్లో క‌ళ్ల‌తోనే హావ‌భావాలు ప‌లికించిన తీరుకు నెటిజ‌న్లు ఫిదా అయ్యారు. క‌ఠిన‌మైన స్పెప్పులు కూడా ఈజీగా చేస్తుంటుంది.

ఈ డ్యాన్స్ రీల్స్‌లో ఒరిజిన‌ల్ హీరోయిన్ల‌కు ఇమాన్వీనే బాగా డ్యాన్స్ చేసిందంటూ చాలా సార్లు నెటిజ‌న్ల ప్ర‌శంస‌ల్ని అందుకున్న‌ది. ఇమాన్వీ డ్యాన్స్‌లోనే కాదు చ‌దువులోనూ దిట్టే. ఎంబీఏ పూర్తిచేసి కొన్నాళ్లు జాబ్ చేసింది. సొంతంగా ఆమెకు యూట్యూబ్ ఛానెల్ ఉంది.

ఒక్క రోజుల్లో ల‌క్ష ఫాలోవ‌ర్స్‌...

ప్ర‌భాస్ మూవీ ఓపెనింగ్ ఈవెంట్‌లో పాల్గొన‌డానికి ముందు ఇమాన్వీకి ఇన్‌స్టాగ్రామ్‌లో ఆరు ల‌క్ష‌ల ఇర‌వై వేల మంది వ‌ర‌కు ఫాలోవ‌ర్స్ ఉన్నారు. ఓపెనింగ్ ఈవెంట్‌లో ప్ర‌భాస్‌తో ఇమాన్వీ దిగిన ఫొటోలు వైర‌ల్ అయ్యాయి. దాంతో ఇమాన్వీ ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవ‌ర్స్ సంఖ్య ఒక్క రోజులోనే దాదాపు ల‌క్ష‌కుపైగా ఫాలోవ‌ర్స్ పెరిగాయి. ప్ర‌స్తుతం ఇమాన్వీకి ఏడున్న‌ర ల‌క్ష‌ల ఫాలోవ‌ర్స్ ఉన్నారు. త్వ‌ర‌లోనే ఆమె వ‌న్ మిలియ‌న్‌ను ట‌చ్ చేసేలా క‌నిపిస్తోంది.

పోరాట‌యోధుడిగా...

1940 బ్యాక్‌డ్రాప్‌లో హిస్టారిక‌ల్ ల‌వ్ స్టోరీగా హ‌ను రాఘ‌వ‌పూడి ఈ మూవీని తెర‌కెక్కిస్తోన్నారు. ఇందులో ఈ మూవీలో శ‌క్వివంతుడైన పోరాట‌యోధుడిగా ప్ర‌భాస్ క‌నిపించ‌బోతున్న‌ట్లు స‌మాచారం. ఈ సినిమాను మైత్రీ మూవీ మేక‌ర్స్ సంస్థ నిర్మిస్తోంది. బాలీవుడ్ సీనియ‌ర్ న‌టుడు మిథున్ చ‌క్ర‌వ‌ర్తితో పాటు సీనియ‌ర్ హీరోయిన్ జ‌య‌ప్ర‌ద కీల‌క పాత్ర‌ల్లో క‌నిపించ‌బోతున్నారు.

Whats_app_banner