తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Kantara Film Song Row: హీరో పృథ్వీరాజ్ కు ఊరట...ఆ కేసుపై 'స్టే' ఇచ్చిన హైకోర్టు

Kantara Film Song Row: హీరో పృథ్వీరాజ్ కు ఊరట...ఆ కేసుపై 'స్టే' ఇచ్చిన హైకోర్టు

HT Telugu Desk HT Telugu

16 February 2023, 19:14 IST

    • Kerala HC stays case against actor Prithviraj: మ‌ల‌యాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమార‌న్ కు ఊరట లభించింది. కాంతార చిత్రంలోని 'వరాహా రూపం' పాట విషయంలో నమోదైన కేసుపై స్టే విధిస్తూ కేరళ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
మ‌ల‌యాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమార‌న్
మ‌ల‌యాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమార‌న్

మ‌ల‌యాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమార‌న్

Kerala High court stays case against actor Prithviraj: మ‌ల‌యాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమార‌న్ కు ఊరట దొరికింది. కాంతార చిత్రంలోని వరాహా రూపం పాట కాపీరైట్స్ విషయంలో నమోదైన కేసుపై కేరళ హైకోర్టు స్టే విధించింది. గురువారం విచారణ జరిపిన ఉన్నత న్యాయస్థానం..ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది.

ట్రెండింగ్ వార్తలు

Romeo OTT Release Date: విజయ్ ఆంటోనీ ‘రోమియో’ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఖరారు.. ఏ ప్లాట్‍ఫామ్‍లోకి వస్తుందంటే..

Manjummel Boys OTT Release: మరికొన్ని గంటల్లో ఓటీటీలోకి మంజుమ్మల్ బాయ్స్: స్ట్రీమింగ్ వివరాలివే

Heeramandi OTT: 1920లో కరోనా వైరస్.. టీఆర్ఎస్: వెబ్ సిరీస్‍లో సంజయ్ లీలా భన్సాలీ పొరపాట్లు

Sundar C: దేశం గర్వించే చిత్రం అవుతుంది.. తెలుగు సినిమాపై తమిళ డైరెక్టర్ సుందర్ కామెంట్స్

ఈ పాట విషయంపై మాతృభూమి ప్రింటింగ్ అండ్ పబ్లిషింగ్ కంపెనీ కొజికోడ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇందులో భాగంగా పృథ్వీరాజ్ ప్రోడక్షన్ లిమిటెడ్ పై కేసును నమోదు చేశారు పోలీసులు. కేరళలో కాంతార చిత్రానికి సంబంధించి పృథ్వీరాజ్ ప్రోడక్షన్ లిమిటెడ్ డిస్ట్రిబ్యూటర్ గా ఉంది. ఫిర్యాదు అందిన మేరకు కాపీ రైట్ చట్టంలోని సెక్షన్ 63 ప్రకారం... గత నెలలో ఈ కేసును రిజిస్టర్ చేశారు. ఇందులో భాగంగా ఈ కంపెనీకి డైరెక్టర్ గా ఉన్న పృథ్వీరాజ్ సుకుమార‌న్ పై కూడా కేసు నమోదైంది.

అయితే కాంతార చిత్రంలోని వరాహా రూపం పాట వివాదాస్పదం అయిన సంగతి తెలిసిందే. ఈ పాట ట్యూన్ మలయాళ ఆల్బమ్ సాంగ్ నుంచి కాపీ కొట్టారంటూ వివాదం మొదలైంది. కాంతారాలోని వరాహ రూపం పాట తమ పాటకు కాపీకి అని కేరళకు చెందిన ప్రముఖ మ్యూజిక్‌ బ్యాండ్‌ తైక్కుడం బ్రిడ్జి ఆరోపించింది. వారాహ రూపం పాటను 'నవరసం' పేరుతో బ్యాండ్‌ తైక్కుడం మ్యూజిక్‌ బ్యాండ్‌ విడుదల చేసిందని... అయితే ఈ పాటను కాపీ కొట్టారని, కాపీరైట్ చట్ట ఉల్లంఘనకు పాల్పడ్డారని ఫిర్యాదులో పేర్కొంది మాతృభూమి ప్రింటింగ్ అండ్ పబ్లిషింగ్ కంపెనీ. అయితే పృథ్వీరాజ్ కాంతార చిత్ర నిర్మాణంలో భాగం కాకపోయినప్పటికీ... కేరళలో కాంతార చిత్రాన్ని డిస్ట్రిబ్యూట్ చేసిన కంపెనీకి డైరెక్టర్ గా ఉన్నారని ఫిర్యాదులో వివరిచింది. దీని ఆధారంగా అతనిపై కూడా కేసు నమోదు చేయాలని ప్రస్తావించింది. దీని ఆధారంగా అతడిపై కేసు నమోదైంది.

ఈ కేసుపై విచారించిన జస్టిస్ కురియన్ థామస్ ధర్మాసనం... ఇందులో పేర్కొన్న నటుడిని అనవసరంగా కేసులోకి లాగుతున్నారని అభిప్రాయపడింది. కాపీరైట్ చట్టం ఉల్లంఘన కింద నమోదైన కేసుపై స్టే విధిస్తున్నట్లు ఆదేశాలిచ్చింది.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.