Kantara Varaha Roopam Song: కాంతార నుంచి ఒళ్లు గగుర్పొడిచే ‘వరాహా రూపం’ సాంగ్ వచ్చేసింది.. ఓ లుక్కేయండి-kantara varaha roopam song released ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Kantara Varaha Roopam Song: కాంతార నుంచి ఒళ్లు గగుర్పొడిచే ‘వరాహా రూపం’ సాంగ్ వచ్చేసింది.. ఓ లుక్కేయండి

Kantara Varaha Roopam Song: కాంతార నుంచి ఒళ్లు గగుర్పొడిచే ‘వరాహా రూపం’ సాంగ్ వచ్చేసింది.. ఓ లుక్కేయండి

Maragani Govardhan HT Telugu
Oct 20, 2022 04:34 PM IST

Kantara Varaha Roopam Song: కాంతార నుంచి అదిరపోయే సాంగ్ వచ్చేసింది. క్లైమాక్స్‌లో దైవ ఆవహించిన సన్నివేశంలో వచ్చే వరాహ రూపం సాంగ్‌ను చిత్రబృందం విడుదల చేసింది. ఈ సినిమాకు విపరీతంగా రెస్పాన్స్ రావడంతో ఓ రేంజ్‌లో కలెక్షన్లు వస్తున్నాయి.

<p>కాంతారలో వరాహ రూపం సాంగ్</p>
కాంతారలో వరాహ రూపం సాంగ్

Kantara Varaha Roopam Song: కన్నడలో చిన్న సినిమాగా విడుదలై దేశవ్యాప్తంగా వసూళ్ల వర్షాన్ని కురిపిస్తోంది కాంతార చిత్రం. ఈ సినిమా తెలుగులోనూ అదిరిపోయే వసూళ్లతో అదరగొడుతోంది. సెప్టెంబరు 30న కర్ణాటకలో విడుదలైన ఈ సినిమాను అక్టోబరు 15న మిగిలన భాషల్లో విడుదల చేశారు. రిషబ్ శెట్టి హీరోగా.. ఆయన స్వీయ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకర్షిస్తోంది. ముఖ్యంగా ఈ సినిమా క్లైమాక్స్ గురించి ప్రతి ఒక్కరూ ప్రత్యేకంగా చెప్పుకుంటున్నారు. మరి ఆ క్లైమాక్స్‌లో వచ్చే సాంగ్‌ను విడుదల చేసింది చిత్రబృందం.

వరాహా రూపం.. దైవ వరిష్ఠం అంటూ సాగే ఈ పాట ఆకట్టుకుంటోంది. పతాక సన్నివేశంలో రిషభ్ శెట్టి తన నటనా విశ్వరూపాన్ని చూపించాడు. ఈ పాట చూసి ఒళ్లు గగుర్పొడచని ప్రేక్షకుడు లేడంటే అతిశయోక్తి కాదు. అలాంటి నృత్య రూపకాన్ని ఎలా తీశారో చెబుతూ లిరికల్ వీడియోను చిత్ర నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ షేర్ చేసింది. సంప్రదాయ వాయిద్యాలతో సంగీత దర్శకుడు అజనీశ్ లోక్‌నాత్ అద్భుతంగా స్వరాలు సమకూర్చారు. ఈ పాటకు పాషిరాజ్ కపూర్ సాహిత్యం అందించగా.. సాయి విఘ్నేష్ ఆలపించారు.

ఈ క్లైమాక్స్ సన్నివేశాలను కేవలం ఐదు రాత్రుల్లోనే తీశారు దర్శకుడు రిషబ్ శెట్టి. వరుసగా చిత్రీకరణ జరపడం వల్ల ఒళ్లు హూనమైనా దైవం ఆవహించిన సన్నివేశాల్లో ఏ మాత్రం అలసటి లేకుండా అతడు నటించిన విధానం ఆకట్టుకుంటుందని . కాంతార క్లైమాక్స్ కోసం తాను ఉపవాసమున్నానని, కేవలం కొబ్బరి నీళ్లను మాత్రమే తాగానని రిషబ్ చెప్పారు.

రిషబ్ శెట్టి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ఆయనే హీరోగా నటించారు. కేజీఎఫ్ లాంటి అద్భుత సినిమాను రూపొందించిన హోంబలే ఫిల్మ్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించింది. విజయ్ కిరంగదూర్ నిర్మాతగా వ్యవహరించారు. రిషభ్ శెట్టితో పాటు కిషోర్, అచ్యుత్ కుమార్, ప్రమోద్ శెట్టి, సప్తమి గౌడ తదితరులు కీలక పాత్రలు పోషించారు. అజనీశ్ లోక్‌నాథ్ సంగీత దర్శకత్వం వహించారు.

Whats_app_banner

సంబంధిత కథనం