తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Heeramandi Ott: 1920లో కరోనా వైరస్.. టీఆర్ఎస్: వెబ్ సిరీస్‍లో సంజయ్ లీలా భన్సాలీ పొరపాట్లు

Heeramandi OTT: 1920లో కరోనా వైరస్.. టీఆర్ఎస్: వెబ్ సిరీస్‍లో సంజయ్ లీలా భన్సాలీ పొరపాట్లు

04 May 2024, 17:13 IST

    • Heeramandi OTT Web Series: హీరామండి వెబ్ సిరీస్‍కు మిక్స్డ్ టాక్ వస్తోంది. భారీ బడ్జెట్‍తో స్టార్ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించిన ఈ సిరీస్‍లో కొన్ని పొరపాట్లను ప్రేక్షకులు గుర్తించారు. సోషల్ మీడియాలో వాటిని పోస్ట్ చేస్తున్నారు.
Heeramandi OTT: 1920లో కరోనా వైరస్.. టీఆర్ఎస్: వెబ్ సిరీస్‍లో సంజయ్ లీలా భన్సాలీ పొరపాట్లు
Heeramandi OTT: 1920లో కరోనా వైరస్.. టీఆర్ఎస్: వెబ్ సిరీస్‍లో సంజయ్ లీలా భన్సాలీ పొరపాట్లు

Heeramandi OTT: 1920లో కరోనా వైరస్.. టీఆర్ఎస్: వెబ్ సిరీస్‍లో సంజయ్ లీలా భన్సాలీ పొరపాట్లు

Heeramandi OTT: భారీ బడ్జెట్‍తో రూపొందిన ‘హీరామండి: ది డైమండ్‍ బజార్’ వెబ్ సిరీస్ చాలా అంచనాలతో అడుగుపెట్టింది. బాలీవుడ్ స్టార్ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ.. భారీ బడ్జెట్‍తో ప్రతిష్టాత్మకంగా ఈ సిరీస్‍ను తెరకెక్కించారు. చాలా సూపర్ హిట్ బాలీవుడ్ చిత్రాలను తెరకెక్కించిన భన్సాలీ.. తొలిసారి ఓటీటీలో వెబ్ సిరీస్ తీసుకొస్తుండటంతో ఫుల్ హైప్ వచ్చింది. మే 1వ తేదీన హీరామండి వెబ్ సిరీస్ నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్‍కు వచ్చింది. అయితే, మిక్స్డ్ టాక్ తెచ్చుకుంటున్న ఈ సిరీస్‍లో కొన్ని తప్పులను నెటిజన్లు గుర్తించారు.

ట్రెండింగ్ వార్తలు

Vijay Sethupathi: మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి కొత్త ప్రయోగం.. క్రైమ్ కామెడీ థ్రిల్లర్‌గా ఏసీఈ

NNS May 18th Episode: పుట్టింటికి అరుంధతి.. సరస్వతిని చంపేస్తున్న మనోహరి.. అందరికీ తెలియనున్న నిజం​​​!

బోల్డ్ మూవీతో హీరోగా ఎంట్రీ ఇస్తోన్న టాలీవుడ్ డైరెక్ట‌ర్ - ముగ్గురు హీరోయిన్ల‌తో రొమాన్స్‌

Kiara Advani: కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో గేమ్ చేంజర్ హీరోయిన్ డెబ్యూ ఎంట్రీ.. కియారా డ్రెస్ ప్రత్యేకతలు ఇవే!

హీరామండి వెబ్ సిరీస్‍కు అనుకున్న స్థాయిలో స్పందన రావడం లేదు. సిరీస్ అంతా కళ్లు చెదిరేలా గ్రాండ్‍గా ఉన్నా.. ఎంగేజింగ్‍‍గా, సహజంగా లేదనే కామెంట్లు వస్తున్నాయి. పీరియాడిక్ డ్రామాగా తెరకెక్కించిన ఈ సిరీస్‍లో అనవసరమైన హంగులు, ఆర్భాటాలు ఎక్కువయ్యాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో ఈ సిరీస్‍లో సోనాక్షి సిన్హా న్యూస్ ‍పేపర్ చదువుతున్న సీన్‍లో పొరపాటును నెటిజన్లు లేవనెత్తున్నారు.

అప్పుడు కరోనానా..

భారత స్వాతంత్య్రానికి ముందు 1920-1940 బ్యాక్‍డ్రాప్‍లో హీరామండి సిరీస్ సాగుతుంది. అయితే, ఈ సిరీస్‍లో ఓ సీన్‍లో సోనాక్షి సిన్హా ఉర్దూ న్యూస్ పేపర్ చదవుతారు. అయితే, అందులో కరోనా వైరస్, టీఆర్ఎస్ పార్టీ అంటూ 2022కు సంబంధించిన వార్తలు ఉన్నాయని కొందరు గుర్తించారు. దీన్ని సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.

హీరామండి సిరీస్‍లో సోనాక్షి సిన్హా చదువుతున్న న్యూస్ పేపర్లో కరోనా సహా మరికొన్ని ఇప్పటి విషయాలు ఉన్నాయని పర్వేజ్ ఆలమ్ అనే జర్నలిస్ట్ ట్వీట్ చేశారు. “నెట్‍ఫిక్స్ ఓటీటీలో సంజయ్ లీలా భన్సాలీ ఎపిక్ వెబ్ సిరీస్ హీరామండి 1920- 1940ల మధ్య భారత స్వాతంత్య్రానికి ముందు బ్రిటీష్ పాలన లాహోర్‌లో సాగుతుంది. ఫరీదన్ (సోనాక్షి సిన్హా) ఓ ఉర్దూ న్యూస్ పేపర్ (ఐదో ఎపిసోడ్) చదువుతారు. అందులోని హైడ్‍లైన్లలో ‘వరంగల్ మున్సిపల్ ఎన్నికలు: టికెట్లు ఇచ్చిన టీఆర్ఎస్’. ‘50,000 మాస్కులను పంపిణీ చేసేందుకు యూత్ కాంగ్రెస్ స్కీమ్ లాంచ్ చేసింది’. ‘కరోనాతో పోరాడేందుకు ఆత్మవిశ్వాసం సాయపడుతుంది: రోగులకు పంచాయత్ రాజ్ శాఖ మంత్రి దయాకర్ రావు సలహా’ అనే హెడ్‍లైన్లు ఉన్నాయి'" అని ఆయన రాసుకొచ్చారు. సోనాక్షి సిన్హా ఆ న్యూస్ పేపర్ చదువుతున్న ఫొటోలు కూడా పోస్ట్ చేశారు.

2022 న్యూస్‍పేపర్‌ను 1940ల్లో బాలీవుడ్ మాత్రమే ప్రింట్ చేయగలదు అంటూ ఓ నెటి‍జన్.. ఈ సిరీస్‍ను ట్రోల్ చేశారు. చాలా మంది కూడా ఈ విషయంపై ట్వీట్లు చేస్తున్నారు. 1920ల కాలంలో పేపర్ చదువుతున్న సీన్ పెట్టి.. అందులో కరోనా సహా ప్రస్తుత విషయాలు ఉన్నా చూసుకోరా అంటూ ప్రశ్నిస్తున్నారు. అప్పట్లో అలాంటి ప్రింట్ కూడా లేదని కామెంట్లు చేస్తున్నారు. 

మిశ్రమ స్పందన

హీరామండి వెబ్ సిరీస్‍కు ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన వస్తోంది. కొందరు ఈ సిరీస్‍పై నెగెటివ్‍గా స్పందిస్తుంటే.. మరికొందరు ప్రశంసిస్తున్నారు. సంజయ్‍లీలా భన్సాలీ మరోసారి తన మార్క్ చూపించారని.. డైలాగ్స్, డ్రామా బాగున్నాయని కొందరు అంటున్నారు.

హీరామండి వెబ్ సిరీస్‍లో మనీష కొయిరాలా, సోనాక్షి సిన్హా, ఆదితి రావ్ హైదరి, సంజీదా షేక్, షార్మీన్ సేగల్ ప్రధాన పాత్రలు చేశారు. ఈ సిరీస్‍కు దర్శకత్వంతో పాటు సంజయ్ లీలా భన్సాలీ నిర్మాతగా, మ్యూజిక్ డైరెక్టర్‌గా వ్యవహరించారు. సుమారు రూ.200 కోట్ల బడ్జెట్‍తో ఈ సిరీస్ రూపొందింది. నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో ఈ సిరీస్ హిందీ, తెలుగు సహా 14 భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం