Kantara Telugu Trp Rating: కాంతార తెలుగు టీఆర్‌పీ రేటింగ్‌ - టాప్ ఫైవ్‌లో రిష‌బ్‌శెట్టి మూవీ-kantara telugu trp rating rishab shetty movie breaks kgf telugu version record ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Kantara Telugu Trp Rating Rishab Shetty Movie Breaks Kgf Telugu Version Record

Kantara Telugu Trp Rating: కాంతార తెలుగు టీఆర్‌పీ రేటింగ్‌ - టాప్ ఫైవ్‌లో రిష‌బ్‌శెట్టి మూవీ

Nelki Naresh Kumar HT Telugu
Feb 04, 2023 07:53 AM IST

Kantara Telugu Trp Rating: కాంతార తెలుగు డ‌బ్బింగ్ వెర్ష‌న్ రికార్డ్ టీఆర్‌పీ రేటింగ్‌ను సొంతం చేసుకున్న‌ది. హ‌య్యెస్ట్ టీఆర్‌పీ రేటింగ్ ద‌క్కించుకున్న టాప్ ఫైవ్ తెలుగు డ‌బ్బింగ్ సినిమాల్లో ఒక‌టిగా నిలిచింది.

కాంతార
కాంతార

Kantara Telugu Trp Rating: తెలుగు డ‌బ్బింగ్ సినిమాల్లో కాంతార కొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. హ‌య్యెస్ట్ టీఆర్‌పీ రేటింగ్ రాబ‌ట్టిన తెలుగు డ‌బ్బింగ్ సినిమాల్లో ఒక‌టిగా నిలిచింది. గ‌త ఏడాది విడుద‌లైన ఈ క‌న్న‌డ చిత్రం బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. దాదాపు 16 కోట్ల వ్య‌యంతో రూపొందిన ఈ సినిమా 400 కోట్ల‌కుపైగా క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టింది.

తెలుగులో కాంతార టైటిల్‌తోనే నిర్మాత అల్లు అర‌వింద్ ఈ సినిమాను రిలీజ్ చేశారు. తెలుగు వెర్ష‌న్ కూడా యాభై కోట్ల వ‌సూళ్ల‌ను ద‌క్కించుకున్న‌ది. నిర్మాత‌ల‌కు అత్య‌ధిక లాభాల‌ను మిగిల్చిన తెలుగు డ‌బ్బింగ్ సినిమాల్లో ఒక‌టిగా కాంతార నిలిచింది. తాజాగా ఈ సినిమా బుల్లితెర‌పై రికార్డ్ టీఆర్‌పీ రేటింగ్‌ను సొంతం చేసుకున్న‌ది.

ఇటీవ‌లే స్టార్ మా ఛానెల్‌లో తెలుగు ప్రీమియ‌ర్ టెలికాస్ట్ అయ్యింది. ఈ ఫ‌స్ట్ ప్రీమియ‌ర్‌కు 12.35 టీఆర్‌పీ రేటింగ్ రావ‌డం గ‌మ‌నార్హం.హ‌య్యెస్ట్ టీఆర్‌పీ రేటింగ్ సొంతం చేసుకున్న టాప్ ఫైవ్ తెలుగు డ‌బ్బింగ్ సినిమాల్లో ఒక‌టిగా కాంతార నిలిచింది. ర‌జ‌నీకాంత్‌ రోబో, బిచ్చ‌గాడు, క‌బాలి, కాంచ‌న 3 త‌ర్వాత కాంతార నిలిచింది.

రిష‌బ్‌శెట్టి హీరోగా న‌టిస్తూ ఈ సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. త‌మ‌కు దానంగా ఇచ్చిన భూముల‌ను ఆక్ర‌మించుకున్న‌రాజ‌వంశీయుల‌పై దేవుడి స‌హాయంతో శివ అనే యువ‌కుడు ఎలాంటి పోరాటం సాగించాడ‌న్న‌దే ఈ సినిమా క‌థ‌. కాంతార సినిమాలో రియ‌లిస్టిక్ యాక్టింగ్‌తో రిష‌బ్‌శెట్టి అభిమానుల‌ను ఆక‌ట్టుకున్నాడు. క‌ర్ణాట‌క‌లోని భూత‌కోళ అనే క‌ళ‌ను క‌థ‌లో అంత‌ర్భాగం చేసిన విధానం ప్రేక్ష‌కుల్ని ఆకట్టుకున్నది.

IPL_Entry_Point

టాపిక్