Kantara Release In English: ఇంగ్లీష్‌లోకి డబ్ అవుతోన్న తొలి కన్నడ సినిమాగా కాంతార రికార్డ్
Kantara Release In English: రిషబ్ శెట్టి కాంతార సినిమాలో ఇంగ్లీష్ లాంగ్వేజ్‌లోకి డబ్అవుతోంది. ఇంగ్లీష్ వెర్షన్ ఎప్పుడు రిలీజ్ కానుందంటే...
Kantara Release In English: రిషబ్ శెట్టి హీరోగా నటించిన కాంతార సినిమా గత ఏడాది దక్షిణాది చిత్రసీమలో అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన సినిమాల్లో ఒకటిగా రికార్డ్ క్రియేట్ చేసింది. కేవలం 16 కోట్ల వ్యయంతో రూపొందిన ఈ సినిమా 400 కోట్లకుపైగా వసూళ్లను సొంతం చేసుకున్నది. కేజీఎఫ్ 2 తర్వాత కన్నడంలో హయ్యెస్ట్ కలెక్షన్స్ రాబట్టిన సినిమా కాంతార కావడం కావడం గమనార్హం.
కన్నడంతో పాటు తెలుగు, హిందీ భాషల్లో కాంతార స్ట్రెయిట్ సినిమాలకు ధీటుగా వసూళ్లను రాబట్టి కమర్షియల్ హిట్‌గా నిలిచింది తెలుగులో రెండు కోట్లతో రిలీజ్ చేస్తే యాభై కోట్లకుపైగా కలెక్షన్స్ దక్కించుకున్నది. అన్ని భాషల ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న కాంతార సినిమా త్వరలోనే ఇంగ్లీష్‌లో రిలీజ్ కానుంది. '
ఓటీటీలో లభిస్తోన్న ఆదరణను దృష్టిలో పెట్టుకొని ఈ సినిమాను ఇంగ్లీష్‌లోకి మేకర్స్ డబ్ చేయబోతున్నారు. ఇంగ్లీష్ డబ్బింగ్ వెర్షన్ నెట్‌ఫ్లిక్స్‌లో మార్చి 1 రిలీజ్ కానుంది. ఇంగ్లీష్‌లోకి డబ్ కానున్న తొలి కన్నడ సినిమాగా కాంతార రికార్డ్ క్రియేట్ చేయనుంది.
కాంతార సినిమాలో హీరోగా నటిస్తూనే ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు రిషబ్ శెట్టి. భూతకోళ అనే కళకు రివేంజ్ డ్రామాను జోడించి ఈ సినిమా రూపొందింది. తమ భూమిని ఆక్రమించుకోవడానికి ప్రయత్నించిన పెద్దలపై దేవుడి సహాయంతో శివ అనే యువకుడు ఎలాంటి పోరాటాన్ని సాగించాడన్నదే ఈ సినిమా కథ.
కాంతార సినిమాలో సప్తమి గౌడ,కిషోర్, అచ్యుత్ కుమార్ ప్రధాన పాత్రల్లో నటించారు.కాంతార సినిమాకు ప్రీక్వెల్ రూపొందించబోతున్నట్లు ఇటీవలే రిషబ్‌శెట్టి ప్రకటించాడు.