తెలుగు న్యూస్  /  Entertainment  /  Kangana To Uorfi Javed Reacts On Her Hindu And Muslim Actors Tweet

Kangana to Uorfi Javed: ఉర్ఫీ జావెద్ 'హిందూ నటులు, ముస్లిం నటులు' ట్వీట్‌పై కంగనా రియాక్షన్ ఇదీ

Hari Prasad S HT Telugu

30 January 2023, 15:38 IST

    • Kangana to Uorfi Javed: ఉర్ఫీ జావెద్ 'హిందూ నటులు, ముస్లిం నటులు' అంటూ చేసిన ట్వీట్‌పై బాలీవుడ్ నటి కంగనా రనౌట్ స్పందించింది. అందుకే దేశంలో యూనిఫాం సివిల్ కోడ్ తీసుకురావాలని డిమాండ్ చేస్తున్నట్లు చెప్పడం గమనార్హం.
కంగాన రనౌత్, ఉర్ఫీ జావెద్
కంగాన రనౌత్, ఉర్ఫీ జావెద్

కంగాన రనౌత్, ఉర్ఫీ జావెద్

Kangana to Uorfi Javed: కంగనా రనౌత్, ఉర్ఫీ జావెద్.. ఇద్దరూ ఇద్దరే. ఎప్పుడూ ఏదో ఒక వివాదంలో వార్తల్లో నిలవడం ఈ నటులకు అలవాటు. ఈ మధ్య కంగనా మరోసారి వివాదాస్పద ట్వీట్ చేసింది. పఠాన్ మూవీ గురించి స్పందిస్తూ.. ఈ సినిమా ఈ స్థాయిలో హిట్ కావడానికి దేశం ఖాన్లు, ముస్లిం నటులపై పక్షపాతం చూపడమే కారణమని చెప్పింది.

ట్రెండింగ్ వార్తలు

Weekend OTT Releases: ఈ వీకెండ్ ఓటీటీలతో ఫుల్ టైంపాస్.. అదిరిపోయే సినిమాలు, వెబ్ సిరీస్

Aarambham: ఆ సినిమాలన్నీ ఓటీటీలోకే.. సస్పెన్స్, సైన్స్ ఫిక్షన్ అన్ని జోనర్లతో ఆరంభం: నటుడు రవీంద్ర విజయ్

Suhas: నా సినిమాలు మౌత్ టాక్‌తోనే వెళ్తాయి.. సీట్ ఎడ్జ్‌లో కూర్చోబెడుతుంది.. సుహాస్ కామెంట్స్

Mahesh Babu: మ‌హేష్ బాబు రిజెక్ట్ చేసిన ల‌వ్ స్టోరీ థియేట‌ర్ల‌లో ఏడాది ఆడింది- ఆ సినిమా ఏదంటే?

అయితే ఈ ట్వీట్ తీవ్ర దుమారం రేపింది. నటుల్లోనూ హిందూ, ముస్లిం ఏంటన్న ప్రశ్న లేవనెత్తారు. తాజాగా మరో వివాదాస్పద నటి ఉర్ఫీ జావెద్ కూడా ఇలాంటి ట్వీటే చేసింది. అసలు నటుల్లో హిందూ, ముస్లిం ఏంటి? కళ మతాలుగా విడిపోలేదు. కేవలం నటులు మాత్రమే ఉంటారు అని ట్వీట్ చేసింది. దీనిపై తాజాగా సోమవారం (జనవరి 30) కంగనా స్పందించింది.

ఉర్ఫీ చేసి ట్వీట్ కే బదులిస్తూ మరో వివాదాస్పద అంశమైన యూనిఫాం సివిల్ కోడ్ ను లేవనెత్తింది. "అవును డియర్ ఉర్ఫీ. అలాంటి ప్రపంచమే ఆదర్శప్రాయమైనది. కానీ మనకు యూనిఫాం సివిల్ కోడ్ ఉన్నంత వరకూ అది సాధ్యం కాదు. రాజ్యాంగంలోనే మన దేశం విభజనకు గురైనంత వరకూ దేశం కూడా విడిపోయే ఉంటుంది. అందుకే మనం 2024 మేనిఫెస్టోలో యూనిఫాం సివిల్ కోడ్ ను చేర్చాలని నరేంద్ర మోదీని డిమాండ్ చేద్దాం. సరేనా?" అని కంగనా ట్వీట్ చేసింది.

కంగనా చేసిన ఈ ట్వీట్ కూడా ఇప్పుడు మరో వివాదానికి కారణమయ్యేలా ఉంది. 2020లో ఇలా సోషల్ మీడియా నిబంధనలు ఉల్లంఘించిన కారణంగానే కంగనా ట్విటర్ అకౌంట్ బ్లాక్ అయింది. ఈ మధ్యే ఆమె మళ్లీ ఇందులో అడుగుపెట్టింది. ఇక ఈ మధ్య పఠాన్ సినిమా ప్రొడ్యూసర్ చేసిన విశ్లేషణపై కంగనా స్పందించింది.

"మంచి విశ్లేషణ. ఈ దేశం కేవలం ఖాన్లను మాత్రమే ఇష్టపడింది. ముస్లిం నటీమణులపైనే మనసు పారేసుకుంది. అందువల్ల ఇండియాపై ద్వేషం, ఫాసిజం ఆరోపణలు చేయడం సరికాదు. భారత్ లాంటి దేశం ప్రపంచంలో లేదు" అని కంగనా ట్వీట్ చేసింది. కానీ ఇతర నటులను నిందించడానికి మతాన్ని తీసుకురావడంపై నెటిజన్లు మండిపడ్డారు.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.