తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Kangana Ranaut Chandramukhi 2: నేష‌న‌ల్ అవార్డ్... గోల్డెన్ గ్లోబ్ విన్న‌ర్స్‌తో కంగ‌నా - చంద్ర‌ముఖి -2 అప్‌డేట్ ఇదే

Kangana Ranaut Chandramukhi 2: నేష‌న‌ల్ అవార్డ్... గోల్డెన్ గ్లోబ్ విన్న‌ర్స్‌తో కంగ‌నా - చంద్ర‌ముఖి -2 అప్‌డేట్ ఇదే

30 January 2023, 8:49 IST

  • Kangana Ranaut Chandramukhi 2: చంద్ర‌ముఖి -2 సెట్స్‌లో అడుగుపెట్టింది కంగ‌నా ర‌నౌత్‌. ఈ సినిమాకు సంబంధించి కొత్త అప్‌డేట్‌ను రివీల్ చేసింది.

కంగ‌నా ర‌నౌత్‌
కంగ‌నా ర‌నౌత్‌

కంగ‌నా ర‌నౌత్‌

Kangana Ranaut Chandramukhi 2: ఇటీవ‌లే ఎమ‌ర్జెన్సీ షూటింగ్‌ను పూర్తిచేసిన కంగ‌నా ర‌నౌత్ ఒక్క రోజు కూడా గ్యాప్ తీసుకోకుండా చంద్ర‌ముఖి -2 రిహార్స‌ల్స్ మొద‌లుపెట్టింది. త‌లైవి త‌ర్వాత త‌మిళంలో కంగ‌నా ర‌నౌత్ న‌టిస్తోన్న సినిమా ఇది.

ట్రెండింగ్ వార్తలు

Guppedantha Manasu Serial: ఎండీ ప‌ద‌వికి వ‌సు రాజీనామా - రిషి ఫ్యామిలీ కోసం త్యాగం - ఎట్ట‌కేల‌కు నెర‌వేరిన శైలేంద్ర క‌ల

Brahmamudi May 4th Episode: బ్రహ్మముడి- రాజ్ బిడ్డ తల్లి పేరు మాయ- నిజం రాబట్టిన కావ్య- అత్త దగ్గర కోటి కొట్టేసిన స్వప్న

Karthika deepam 2 today: కార్తీకదీపం 2 సీరియల్..దీప, కార్తీక్ కి అక్రమ సంబంధం అంట గట్టిన నరసింహ..ప్లేటు ఫిరాయించిన అనసూయ

Aavesham OTT: అనుకున్న‌దానికంటే ముందుగానే ఓటీటీలోకి ఫ‌హాద్ ఫాజిల్ వంద కోట్ల మూవీ - స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

ర‌జ‌నీకాంత్ హీరోగా 2005లో విడుద‌లైన క‌ల్ట్ క్లాసిక్ ఫిల్మ్ చంద్ర‌ముఖికి సీక్వెల్‌గా తెర‌కెక్కుతోన్న ఈ సినిమాలో లారెన్స్ హీరోగా న‌టిస్తోన్నాడు. ఈ సీక్వెల్‌కు పి. వాసు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. చంద్ర‌ముఖి -2 క్లైమాక్స్ సాంగ్ షూట్ రిహార్స‌ల్స్ మొద‌లుపెట్టిన‌ట్లు ట్విట్ట‌ర్ ద్వారా కంగ‌నా ర‌నౌత్ తెలిపింది.

నేష‌న‌ల్ అవార్డ్ విన్న‌ర్ క‌ళ మాస్ట‌ర్‌తో క‌లిసి దిగిన ఓ ఫొటోను ట్విట్ట‌ర్‌లో పోస్ట్ చేసింది. ఈ పాట‌కు గోల్డెన్ గ్లోబ్ విన్న‌ర్ ఎంఎం కీర‌వాణి సంగీతాన్ని అందించ‌బోతున్న‌ట్లు కంగ‌నా ర‌నౌత్ తెలిపింది. చంద్ర‌ముఖి -2 సినిమాకు పి.వాసు ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్న‌ట్లు తెలిపింది. లెజెండ‌రీ టీమ్‌తో క‌లిసి ప‌నిచేయ‌డం గౌర‌వంగా భావిస్తున్న‌ట్లు చెప్పింది.

ఈ సినిమాలో టైటిల్ పాత్ర‌ను కంగ‌నా ర‌నౌత్ పోషిస్తోంది. చంద్ర‌ముఖి -2 సినిమాను లైకా ప్రొడ‌క్ష‌న్స్ సంస్థ నిర్మిస్తోంది. ప్ర‌స్తుతం బాలీవుడ్‌లో కంగ‌నా ర‌నౌత్ ఎమ‌ర్జెన్సీ సినిమా చేస్తోంది. హీరోయిన్‌గా న‌టిస్తూనే స్వీయ ద‌ర్శ‌క‌నిర్మాణంలో ఈ సినిమాను రూపొందిస్తోంది.

ఎమ‌ర్జెన్సీ సినిమాలో కంగ‌నా ర‌నౌత్ ఇందిరా గాంధీ పాత్ర‌లో న‌టించ‌నుంది. ఇండియాలో 1975 టైమ్‌లో ఎమెర్జెన్సీ విధించ‌డానికి గ‌ల కార‌ణాల్ని ఈ సినిమాలో చూపించ‌బోతున్న‌ట్లు స‌మాచారం.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.