Guppedantha Manasu Serial: ఎండీ పదవికి వసు రాజీనామా - రిషి ఫ్యామిలీ కోసం త్యాగం - ఎట్టకేలకు నెరవేరిన శైలేంద్ర కల
04 May 2024, 8:05 IST
Guppedantha Manasu Serial: కాలేజీ ఎండీ పదవికి రాజీనామా చేయబోతున్నట్లు వసుధార ప్రకటిస్తుంది. కొత్తగా ఎండీగా శైలేంద్రకు బాధ్యతల్ని అప్పగించాలని బోర్డ్ మెంబర్స్‌తోనిర్ణయిస్తారు.ఆ తర్వాత నేటి గుప్పెడంత మనసు సీరియల్‌లో ఏం జరిగిందంటే?
గుప్పెడంత మనసు సీరియల్
Guppedantha Manasu Serial: మనును జైలుకు పంపించేందుకు తాను బతికే ఉన్నా చనిపోయినట్లు శైలేంద్రతో కలిసి రాజీవ్ నాటకం ఆడుతాడు. మనుకు రాజీవ్ కనిపిస్తాడు. రాజీవ్ బతికే ఉన్నాడని మను ఎంత చెప్పిన పోలీసులు కట్టుకథగా అతడి మాటలను కొట్టిపడేస్తారు.పోలీస్ స్టేషన్‌లో ఉన్న మనును రాజీవ్ కలిసిన విషయం తెలిసి శైలేంద్ర కంగారు పడతాడు.
కొద్ది రోజులు వసుధారతో పాటు ఎవరికి కనిపించకుండా దూరంగా ఉండమని రాజీవ్‌ను రిక్వెస్ట్ చేస్తాడు. తన మరదలని చూడకుండా ఉండలేనని, ఒకవేళ తాను నిజంగా చనిపోయిన వసుధార కోసం దయ్యమై వస్తానని శైలేంద్రకు బదులిస్తాడు రాజీవ్. మను గుండెల్లో దడపుట్టించి భయపెట్టడానికే తాను పోలీస్ స్టేషన్‌కు వెళ్లానని, తనకు, తన మరదలు వసుధారకు అడ్డుగోడగా నిలిచి చిన్న చిన్న ఆనందాలు కూడా లేకుండా చేశాడని, మనును టార్చర్ పెట్టడానికే పోలీస్ స్టేషన్ వెళ్లానని రాజీవ్ అంటాడు.
శైలేంద్ర భయం...
రాజీవ్ దొరికిపోతే ఈ ప్లాన్ కూడా ఫెయిలవుతుందని శైలేంద్ర భయపడిపోతాడు. బయటకు రావొద్దని, కొన్నాళ్లు అండర్‌గ్రౌండ్‌లోనే ఉండమని రాజీవ్‌నుహెచ్చరిస్తాడు శైలేంద్ర. వసుధార చూడకుండా తాను ఉండలేనని, బయటకు రాకుండా తనను ఎవరూ అడ్డుకోలేరని శైలేంద్రకు ధీటుగా బదులిస్తాడు రాజీవ్. నువ్వు ఇంకోసారి బయట కనిపిస్తే నేనే ఏం చేస్తానో నాకు తెలియదని శైలేంద్ర వార్నింగ్ ఇస్తాడు. నన్ను పట్టుకోవడం ఎవరి వల్ల కాదని రాజీవ్ బిల్డప్ ఇస్తాడు. ఇద్దరు వాదించుకుంటారు.
వసుధార ఫోన్...
శైలేంద్ర, రాజీవ్ గొడవ ఎంతకు తేలదు. ఇంతలోనే వసుధార నుంచి శైలేంద్రకు ఫోన్ వస్తుంది. ఎక్కడున్నావని కఠినంగా శైలేంద్రను అడుగుతుంది వసుధార. నీ మాటల్లో రెస్పెక్ట్ తగ్గిందని, అందుకే తాను ఎక్కడున్నది చెప్పనని శైలేంద్ర ఆన్సర్ ఇస్తాడు. శైలేంద్ర గారు ఎక్కడున్నారని వసుధార రిక్వెస్ట్‌గా అడగటంతో రాజీవ్‌తో ఉన్న విషయం దాచిపెట్టి తాను బయట ఉన్నానని శైలేంద్ర బుకాయిస్తాడు. నువ్వు ఎక్కడున్న వెంటనే కాలేజీకి రావాలి అని శైలేంద్రకు ఆర్డర్ వేస్తుంది వసుధార. రానని బెట్టు చేయబోతాడు శైలేంద్ర. కానీ అతడి మాటల్ని పట్టించుకోకుండా నువ్వు రావాల్సిందేనని ఫోన్ కట్ చేస్తుంది వసుధార.
మనుపై మహేంద్ర ఫైర్…
వసుధార ఏం చెబుతుందో తెలుసుకోవాలని కాలేజీకి వెళతాడు శైలేంద్ర, ఎండీ రూమ్‌లో వసుధారతో మహేంద్ర మాట్లాడుతుంటాడు. వారి మాటల్ని చాటు నుంచి శైలేంద్ర వింటాడు. మను జైలుకు వెళ్లాడు కాబట్టి కాలేజీ బాధ్యతలు మీరే తీసుకోవాలని మహేంద్రను కోరుతుంది వసుధార.
కానీ అతడు మాత్రం ఈ బాధ్యతల్ని స్వీకరించనని అంటాడు. మను మర్డర్ చేస్తాడని ఊహించలేదని, రాజీవ్ దుర్మార్గుడు అయినంత మాత్రాన అతడిని చంపేయాలా అంటూ మనుపై ఫైర్ అవుతాడు మహేంద్ర. . రాజీవ్‌ను మను చంపినట్లు పోలీసుల దగ్గర పక్కా ఆధారాలు ఉన్నాయని వసుధారతో అంటాడు మహేంద్ర.
ఎండీ పదవికి రాజీనామా...
యాభై కోట్ల చెక్ ఇచ్చి కాలేజీకి మంచి చేసిన మనును కొడుకుగా దత్తత తీసుకోవాలని అనుకున్నానని, కానీ ఇంత పనిచేస్తాడని ఊహించలేదని మహేంద్ర ఆవేదనకు లోనవుతావు. ఈ సమస్యలను అన్ని తన తలకు చుట్టుకున్నాయని, ఈ ఒత్తిళ్ల మధ్య తానుఎండీ పదవి నిర్వర్తించలేనని, ఈ సీట్‌కు రాజీనామా చేయడమే కాకుండా కాలేజీకి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు మహేంద్రతో చెబుతుంది వసుధార.
రిషి అప్పగించిన బాధ్యతను వదలుకోవద్దని వసుధారను రిక్వెస్ట్ చేస్తాడు మహేంద్ర. పదవి వదులుకోవడం నాకు బాధగానే ఉందని, కానీ పరిస్థితుల తలవొగ్గక తప్పడం లేదని వసుధార బాధపడుతుంది. ఎండీ బాధ్యతల గురించి చర్చించడానికే శైలేంద్రను కాలేజీకి రమ్మన్నానని అంటుంది. వారిద్దరి మాటలు నిజమో కాదో తెల్చుకోలేకపోతాడు శైలేంద్ర.
శైలేంద్ర ఆనందం...
తన క్యాబిన్‌లోకి వచ్చిన శైలేంద్రకు తాను ఎండీ బాధ్యతల నుంచి తప్పుకుంటున్న విషయం చెబుతుంది వసుధార. సమస్యలతో తాను విసిగిపోయానని, అలసిపోయానని వసుధార అంటుంది. నువ్వు ఎండీ పదవి నుంచి తప్పుకుంటే ఆ బాధ్యత ఎవరు తీసుకుంటారని వసుధారను అడుగుతాడు శైలేంద్ర.
బాబాయ్ ఎండీగా బాధ్యతలు తీసుకుంటున్నాడా అని శైలేంద్ర అనుమానంగా తన మనసులోని మాటను బయటపెడతాడు. తనకు ఈ పదవులపై ఇష్టం లేదని, మనును జైలు నుంచి విడిపించే ప్రయత్నాల్లో ఉన్నానని శైలేంద్రతో అంటాడు మహేంద్ర. వసుధార తర్వాత కాలేజీకి కాబోయే ఎండీ ఎవరన్నది అన్నయ్యతో పాటు బోర్డ్ మెంబర్స్‌తో మాట్లాడి నిర్ణయిస్తామని మహేంద్ర అంటాడు. తాను ఎండీ కావడం ఖాయమని శైలేంద్ర ఆనందంలో మునిగిపోతాడు.
శైలేంద్ర ట్రాప్...
శైలేంద్రను ట్రాప్ చేసి అతడి ద్వారా రాజీవ్ ఆచూకీ తెలుసుకునేందుకు వసుధార, మహేంద్ర ఈ నాటకం ఆడతారు. ఎండీ పదవికి రాజీనామా చేస్తానని వసుధార చెప్పిన మాటలు నిజమో, కలో శైలేంద్రకు అర్థం కాదు. ఎండీ పదవి నుంచి వసుధార దిగిపోవడం వెనుక ఏదైన మతలబు ఉందా అని ఆలోచిస్తాడు. బోర్డ్ మీటింగ్ ఏర్పాటు చేసిన వసుధార తాను ఎండీ పదవికి రాజీనామా చేయబోతున్నట్లు ప్రకటిస్తుంది. ఆమె చెప్పిన మాటలు విని ఫణీంద్ర షాకవుతాడు. అంత పెద్ద నిర్ణయం ఎందుకు తీసుకున్నావు. ఏ కష్టం వచ్చిందని రిజైన్ చేస్తున్నావని అడుగుతాడు. ఫణీంద్ర ఎంత చెప్పిన తాను ఎండీగా కొనసాగలేనని వసుధార అంటుంది.
శైలేంద్రనే నెక్స్ట్ ఎండీ...
నువ్వు ఎండీ పదవికి రాజీనామా చేస్తే...నీ తర్వాత ఆ బాధ్యతలు ఎవరు స్వీకరిస్తారని ఫణీంద్ర అంటాడు. శైలేంద్ర పేరును బోర్డ్ మెంబర్స్ సూచిస్తారు. ఎండీ పదవికి అతడే అర్హుడని చెబుతారు. శైలేంద్రకే ఎండీ బాధ్యతలు అప్పగించాలని చెబుతారు. ఫణీంద్ర కూడా అందుకు అంగీకరిస్తాడు. అక్కడితో నేటి గుప్పెడంత మనసు సీరియల్ ముగిసింది.