Guppedantha Manasu Today Episode: వసుధారపై మనసు పడ్డ మను - శైలేంద్రకు మహేంద్ర పనిష్‌మెంట్ - రాజీవ్ చనిపోలేదా?
Guppedantha Manasu Today Episode: నేటి గుప్పెడంత మనసు సీరియల్‌లో వసుధారపై మనసు పడి మనునే రాజీవ్‌ను నిజంగానే హత్య చేసి ఉంటాడని శైలేంద్ర నిందలు వేస్తాడు. అతడి మాటలతో ఆవేశం పట్టలేకపోయిన మహేంద్ర...శైలేంద్ర చెంపపై గట్టిగా ఒక్కటిస్తాడు.
Guppedantha Manasu Today Episode: మనును జైలు నుంచి నిర్దోషిగా విడిపించడానికి ఏం చేయాలా అని వసుధార, అనుపమ, మహేంద్ర ఆలోచిస్తారు. రాజీవ్ ప్లాన్ చేసి మనును ఈ కేసులో ఇరికించాడనిఅనుమానపడతారు.
విశ్వనాథం సహాయంతో మంచి లాయర్‌ను మాట్లాడి మనును జైలు నుంచి విడిపిస్తానని ఏంజెల్ అంటుంది. మను జైలుకు వెళ్లిన విషయం ఇప్పుడే తండ్రితో చెప్పొద్దని ఏంజెల్‌తో అంటుంది అనుపమ. విశ్వనాథానికి ఈ విషయం తెలిస్తే కంగారు పడతాడని, ఆయన ఆరోగ్యం అసలే బాగాలేదని అనుపమ సలహా ఇస్తుంది.
ఏంజెల్ సలహా...
మనుతో ఒక్కసారి మాట్లాడమని అనుపమకు సలహా ఇస్తుంది ఏంజెల్. ఈ పరిస్థితుల్లో మనును తాను ఫేస్ చేయలేనని, మను ఇప్పుడు నన్ను చూస్తే అతడి బాధ రెట్టింపు అవుతుంది. తన వేదన పెరుగుతుందని అనుపమ బాధగా బదులిస్తుంది. ఏంజెల్‌తో పాటు మహేంద్ర కూడా బలవంతపెట్టడంతో మనుతో మాట్లాడటానికి అంగీకరిస్తుంది అనుపమ.
అనుపమకు మను థాంక్స్...
మనుతో మాట్లాడటానికి స్టేషన్ లోపలికి వస్తుంది అనుపమ. థాంక్స్ మేడమ్...ఇప్పటికైనా నన్ను చూడటానికి వచ్చినందుకు అని అనుపమతో అంటాడు మను. నాపైన సానుభూతితో వచ్చారా...ప్రేమతో వచ్చారా అని అడుగుతాడు.
సానుభూతితో వచ్చారు అంటే సాటి మనిషిగా అనుకుంటాను...ప్రేమతో వచ్చారంటే తల్లిగా వచ్చారని అనుకుంటానని అనుపమతో చెబుతాడు. అమ్మ అని పిలవడంలోనే నేను నా ప్రేమను చూపించగలుగుతాను. కానీ నాకు ఆ అవకాశం లేదు అని అంటాడు.
నేరం చేశానని నమ్ముతున్నారా...
నేను నిజంగానే ఈ నేరం చేశానని అనుకుంటున్నారా...రాజీవ్‌ను నేనే హత్య చేశానని నమ్ముతున్నారా అని అనుపమను ప్రశ్నిస్తాడు మను. నువ్వు ఏం తప్పు చేయవు. చేయలేవు. నువ్వు నా పెంపకం అని మనసులో అనుకుంటుంది అనుపమ. కానీ బయటకు చెప్పలేకపోతుంది.
నువ్వు గొప్ప ఆశయాలతో పెరిగావు. నీలాంటి ఉత్తముడి జీవితాన్ని తల్లి స్థానంలో ఉండి నేనే నాశనం చేశాను. చేస్తున్నాను. నిన్ను ఇబ్బంది పెడుతున్నానని మనసులో మనుకు క్షమాపణలు చెబుతుంది.
అనుపమ కన్నీళ్లు చూసి నేను మను...తాను ఏ తప్పు చేయలేదని అంటాడు. నేను మీ పెంపకంలో పెరిగానని చెబుతాడు. అమ్మ అని కాకుండా మేడమ్ అనే పిలుస్తాడు. ప్రపచంలో తాను తండ్రిపై తప్ప తనకు ఎవరికి ద్వేషం, కోపం లేవని, అతడిని ఎప్పటికీ వదిలిపెట్టనని అంటాడు. తండ్రి ఎవరో తెలుస్తుందనే తాను దత్తతను ఒప్పుకుంటున్నట్లు అనుపమతో చెబుతాడు మను. ఒకవేళ నేను ప్రాణాలు తీయాల్సివస్తే అతడి ప్రాణమే తీస్తానని అంటాడు.
ఆవేశమే దూరం చేస్తుంది...
అప్పటివరకు మౌనంగా ఉన్న అనుపమ అతడి మాటల్ని ఆపేస్తుంది. ఇదే అవేశం అందరిని నీకు భయపడేలా చేస్తుంది. ఇదే ఆవేశం నిన్ను నిజాలకు దూరం చేస్తుంది. ఈ అవేశం వల్లే మీ నాన్న గురించి తెలుసుకోలేకపోతున్నావని మనుతో అంటుంది అనుపమ.
తండ్రిపై ద్వేషం పెంచుకోవద్దని అంటుంది. నన్ను ఎంత కిందకులాగినా ఎవరిని ఏం చేయనని మాట ఇచ్చావు. తండ్రిపై కూడా అలాంటి అభిప్రాయమే నీకు ఉండాలని మనుకు చెబుతుంది. నువ్వు ఏం తప్పు చేయలేదని, రాజీవ్‌ను చంపలేదని తాను నమ్ముతున్నట్లు చెబుతుంది.
శైలేంద్రను కలిసిన మహేంద్ర...
పోలీస్ స్టేషన్ నుంచి నేరుగా శైలేంద్ర దగ్గరకు వస్తాడు మహేంద్ర. రాజీవ్‌ను చంపింది మను కాదు. నువ్వే నని శైలేంద్రతో అంటాడు మహేంద్ర. ఇదంతా నీ కుట్ర కదా...మనును జైలుకు పంపించడం నీ ప్లానే కదా అని శైలేంద్రను నిలదీస్తాడు మహేంద్ర. నన్ను ఎందుకు అనుమానిస్తున్నారు బాబాయ్ అని మహేంద్రను అడుగుతాడు శైలేంద్ర.
నువ్వే మాకు శత్రువువని, ఎండీ సీట్ కోసం మమ్మల్ని ఎన్నో కష్టాలు పెట్టావు, ఇబ్బందులకు గురిచేశావని శైలేంద్రతో అంటాడు మహేంద్ర. నేను మనును దత్తత తీసుకుంటే ఎప్పటికీ ఎండీవి కాలేవని నువ్వే రాజీవ్‌ను హత్య చేసి మనుపై ఆ నేరాన్ని నెట్టావని నాకు తెలుసునని శైలేంద్రతో అంటాడు మహేంద్ర.
వసుధార వల్లే...
వసుధార అంటే రాజీవ్‌కు ఇష్టం. వసుధారను రాజీవ్ తన సొంతం చేసుకోవాలని అనుకున్న ప్రతిసారి మనును కాపాడాడు. వసుధార విషయంలోనే జరిగిన గొడవలో రాజీవ్‌ను మను హత్య చేసి ఉంటాడని శైలేంద్ర అనుమానం వ్యక్తం చేస్తాడు. వసుధారపై మను కూడా కూడా మనసు పడి ఉంటాడని శైలేంద్ర అంటాడు. అతడి మాటలతో కోపం పట్టలేకపోయిన మహేంద్ర శైలేంద్రను గట్టిగా ఒక్కటికొడతాడు.
మహేంద్ర వార్నింగ్...
అన్నయ్య ఫణీంద్ర ముఖం చూసే నిన్ను ఇంకా ఏం చేయకుండా వదిలిపెడుతున్నానని, లేదంటే ఎప్పుడో నీ ఫొటో గొడకు తగిలించి ఉండేవాళ్లని వార్నింగ్ ఇస్తాడు. ఇంకోసారి ఇలాంటి తప్పుడు కూతలు కూస్తే ఊరుకోనని, నువ్వు ఎన్ని కుట్రలు చేసిన నువ్వు మమ్మల్ని ఏం చేయలేవని, మనును నిర్ధోషిగా నీ కళ్ల ముందు నుంచే తీసుకొస్తానని శైలేంద్రతో మహేంద్ర ఛాలెంజ్ చేస్తాడు.
మాటిచ్చిన వసుధార...
మను జైలుకు వెళ్లడం చూసి అనుపమ అధైర్యపడుతుంది. అది చూసి పెద్దమ్మ తల్లడిల్లిపోతుంది. కావాలనే ప్లాన్‌తో ఎవరో మనును ఈ కేసులో ఇరికించారని అర్థమవుతుందని, ధైర్యంగా పోరాడి ఈ కేసు నుంచి అతడిని బయటపడేలా చేయాలని అనుపమకు ధైర్యం చెబుతుంది. ఈ పోరాటంలో అనుపమకు తాను అండగా ఉంటానని వసుధార మాటిస్తుంది.
అప్పుడే అక్కడికి వచ్చిన మహేంద్ర...మనుకు జైలు నుంచి బయటకు తీసుకొచ్చే బాధ్యత నాది అని అంటాడు. మను ఎప్పుడు ఏ తప్పు చేయడు, చేయలేడు..., అతడి గురించి నాకు బాగా తెలుసునని మహేంద్ర అంటాడు. మనుతో నీ బంధం రక్త సంబంధం లాంటిదని పెద్దమ్మ అంటుంది. ఆమె మాటలతో వసుధార, అనుపమ షాకవుతారు. అక్కడితో నేటి గుప్పెడంత మనసు సీరియల్ ముగిసింది.