తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Urfi Javed Rental Issues: ముంబయిలో భయం భయంగా ఉర్ఫీ జావేద్.. ఎందుకో తెలుసా?

Urfi Javed Rental Issues: ముంబయిలో భయం భయంగా ఉర్ఫీ జావేద్.. ఎందుకో తెలుసా?

25 January 2023, 12:03 IST

    • Urfi Javed Rental Issues: బాలీవుడ్ బ్యూటీ ఉర్ఫీ జావేద్ ప్రస్తుతం భయం భయంగా బతుకుతోంది. ఆమెకు ముంబయిలో అద్దెకు ఇంటిని ఇచ్చేవారు కరవయ్యారు. తన వస్త్రధారణ కారణంగా చాలా మంది తనకు ఇంటిని కిరాయికి ఇవ్వడంలేదని ట్విటర్ వేదికగా స్పష్టం చేసింది.
ఉర్ఫీ జావెద్
ఉర్ఫీ జావెద్ (HT_PRINT)

ఉర్ఫీ జావెద్

Urfi Javed Rental Issues: అందాల ఆరబోతతో తరచూ వార్తల్లో నిలిచే తార ఉర్ఫీ జావేద్. బాలీవుడ్‌లో బుల్లితెరపై అరంగేట్రం చేసిన ఈ ముద్దుగుమ్మ ఇటీవల కాలంలో అందాల ఆరబోత చేస్తూ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా నిలుస్తోంది. కురచ దుస్తులను ధరిస్తూ అభిమానులను అలరించే ఈ ముద్దుగుమ్మ బోల్డ్ బ్యూటీగా గుర్తింపు తెచ్చుకుంది. తాజాగా ఉర్ఫీ ముంబయిలో ఇంటి సమస్యను ఎదుర్కొంటోంది. తనకు ఎవ్వరూ ఇంటిని అద్దెకు ఇవ్వడం లేదని సోషల్ మీడియా వేదికగా స్పష్టం చేసింది.

ట్రెండింగ్ వార్తలు

NNS May 17th Episode: మళ్లీ భూలోకానికి అరుంధతి.. ఈసారి యముడు కూడా.. అమర్​కి తలంటిన భాగీ.. పిల్లలను రెచ్చగొట్టిన మనోహరి

Brahmamudi May 17th Episode: బ్రహ్మముడి- అనామికకు కల్యాణ్ విడాకులు- లేచిపోదామన్న అప్పు- తాతయ్య వార్నింగ్- కావ్యకు 2 డేస్

Ntr Prashanth Neel Movie: ఎన్టీఆర్‌, ప్ర‌శాంత్ నీల్ మూవీ టైటిల్ ఇదేనా? - కేజీఎఫ్‌కు మించి యాక్ష‌న్‌…ఎలివేష‌న్స్?

Krishna mukunda murari serial:ముకుందకు మురారి సేవలు.. మీరా నెల తప్పిందన్న భవానీ, షాక్ లో కృష్ణ

తనకు ఇల్లు దొరకడం లేదని, ముస్లీం గృహ యజమానులు తన వస్త్రధారణ చూసి ఇల్లు ఇచ్చేందుకు వెనుకాడుతున్నారని, ఇదే సమయంలో హిందూ ఓవర్లు తన మతాన్ని చూసి కిరాయికి ఇల్లు ఇవ్వడం లేదని వాపోయింది.

"ముస్లీం యజమానులు నాకు అద్దెకు ఇంటిని ఇచ్చేందుకు వెనుకాడుతున్నారు. నా వస్త్రధారణ కారణంగా కిరాయికి ఇల్లు ఇవ్వడం లేదు. మరోపక్క హిందూ ఓవర్లు నా మతం కారణంగా వెనుకాడుతున్నారు. మరికొంతమందైతే రాజకీయ బెదిరింపుల కారణంగా ఇవ్వడం లేదు. ముంబయిలో అద్దెకు అపార్ట్మెంట్ దొరకడం చాలా ఇబ్బందిగా ఉంది." అని ఉర్ఫీ జావేద్ స్పష్టం చేసింది.

దీనికి తోడు తనకు వచ్చిన రాజకీయ బెదిరింపుల గురించి కొంతమంది ఆందోళన చెందుతున్నారని, ముంబయిలో అద్దెకు ఇంటిని కనుగొనడం చాలా సవాలుతో కూడుకున్న పని అని పేర్కొంది.

ఇటీవల కాలంలో ఉర్ఫీ జావేద్ డ్రెస్సింగ్‌పై విపరీతంగా విమర్శలు వస్తున్నాయి. పొట్టి దుస్తుల్లో అందాల ఆరబోత చేస్తున్న ఈ ముద్దుగుమ్మపై పలువురు బహిరంగంగానే విమర్శలు చేస్తున్నారు. ఎన్ని విమర్శలు వచ్చినా ఉర్ఫీ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. తన శరీర అందాన్ని ఎప్పుడూ దాచుకోవడానికి ప్రయత్నించలేదు. ఇదే ఆమె గురించి ఎక్కువ మంది సెర్చ్‌ చేసేలా చేసింది. అసలు ఎవరీ ఉర్ఫీ జావెద్‌ అని తెలుసుకోవడానికి చాలా మంది గూగుల్‌ వైపు చూశారు. గతేడాది ఎక్కువ మంది సెర్చ్‌ చేసిన ఏషియన్ల లిస్ట్‌లో ఉర్ఫీ 57వ స్థానంలో నిలవగా.. సెలబ్రిటీల్లో ఆమెదే టాప్‌ ప్లేస్‌.

టాపిక్

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం