తెలుగు న్యూస్  /  Entertainment  /  Jr Ntr On Rajamouli Says He Deserves All The Applause He Is Getting For Rrr

Jr NTR on Rajamouli: దీనికి నువ్వు అర్హుడివే..: రాజమౌళిపై తారక్‌ ప్రశంసలు

HT Telugu Desk HT Telugu

03 October 2022, 17:23 IST

    • Jr NTR on Rajamouli: దీనికి నువ్వు అర్హుడవే అంటూ ఆర్‌ఆర్‌ఆర్‌ మూవీ డైరెక్టర్‌ ఎస్‌ఎస్‌ రాజమౌళిపై ప్రశంసలు కురిపించాడు జూనియర్‌ ఎన్టీఆర్‌. సోమవారం (అక్టోబర్‌ 3) తన ట్విటర్‌ ద్వారా ప్రశంసలు కురిపించాడు.
ఎస్ఎస్ రాజమౌళి
ఎస్ఎస్ రాజమౌళి (twitter)

ఎస్ఎస్ రాజమౌళి

Jr NTR on Rajamouli: ఆర్ఆర్ఆర్‌ మూవీ రిలీజై ఆరు నెలలకుపైనే అయింది. ఇండియా బాక్సాఫీస్‌ రికార్డులన్నింటినీ తిరగరాస్తూ సంచలనం సృష్టించింది. ఇక ఇప్పుడు అమెరికాలో ఈ మూవీ హవా నడుస్తోంది. ఆస్కార్స్‌ కోసం గట్టిగానే ప్రయత్నిస్తున్న ఆర్‌ఆర్‌ఆర్‌ మూవీని అమెరికాలో పలుచోట్ల ప్రదర్శిస్తున్నారు ఈ మూవీ మేకర్స్‌.

ట్రెండింగ్ వార్తలు

Baahubali The Crown of Blood: మరో రూపంలో బాహుబలి వస్తోంది.. ప్రకటించిన దర్శక ధీరుడు రాజమౌళి: వివరాలివే

Siddharth Roy OTT: బోల్డ్ రొమాంటిక్ మూవీ సిద్ధార్థ్ రాయ్ ఓటీటీ రిలీజ్ డేట్ ఖరారు.. ఏ ప్లాట్‍ఫామ్‍లోకి రానుందంటే..

Pushpa 2 First Song: పుష్ప 2 ఫస్ట్ సాంగ్ రిలీజ్ టైమింగ్‍లో మార్పు.. అల్లు అర్జున్ నయా లుక్ రివీల్

Tollywood: ఆ ఒక్కటి అడక్కు, ప్రసన్న వదనం సినిమాల రన్‍టైమ్ ఇదే.. క్రిస్ప్‌గా అల్లరి నరేశ్ మూవీ

ఇందులో భాగంగా డైరెక్టర్‌ రాజమౌళి ఆ దేశమంతా తిరుగుతున్నాడు. స్పెషల్‌ స్క్రీనింగ్స్‌ను చూస్తున్నాడు. తాజాగా లాస్‌ ఏంజిల్స్‌లోని చైనీస్‌ థియేటర్‌లో ఈ ఆర్‌ఆర్‌ఆర్‌ను ప్రదర్శించారు. ఈ సినిమా చూసిన తర్వాత థియేటర్‌ అంతా స్టాండింగ్ ఒవేషన్‌ ఇచ్చింది. ప్రేక్షకులందరూ లేచి నిలబడి చప్పట్లు కొడుతుండగా.. రాజమౌళి స్క్రీన్‌ ముందుకు వచ్చి అభివాదం చేశాడు.

ఈ వీడియోను తనే ట్విటర్‌లో పోస్ట్‌ చేశాడు. "మీరు నా హీరోలు, నా సినిమా, నాపై చూపించిన ప్రేమ, ప్రశంసలు అపారమైనవి. థ్యాంక్యూ యూఎస్‌ఏ" అనే క్యాప్షన్‌తో రాజమౌళి ఈ వీడియోను షేర్‌ చేసుకున్నాడు. దీనిపై ఈ మూవీలో భీమ్‌గా నటించిన యంగ్‌ టైగర్‌ జూనియర్‌ ఎన్టీఆర్‌ స్పందించాడు. "ఈ ప్రశంసలు, ఇంకా రానున్న వాటికి నువ్వు అర్హుడివే జక్కన్న" అంటూ రాజమౌళిని ఆకాశానికెత్తాడు తారకరాముడు.

ఈ ఆర్‌ఆర్‌ఆర్‌ మూవీ ఇండియా నుంచి బెస్ట్‌ ఇంటర్నేషనల్‌ ఫీచర్‌ ఫిల్మ్‌ కేటగిరీ కింద ఆస్కార్స్‌కు నామినేట్‌ అవుతుందని భావించినా.. అది సాధ్యం కాలేదు. భారత ప్రభుత్వం ఛెల్లో షో అనే గుజరాతీ సినిమాను ఆస్కార్స్‌కు పంపించింది. దీంతో మరో మార్గంలో ఆస్కార్స్‌లోని వివిధ కేటగిరీలకు నామినేషన్‌ కోసం మేకర్స్‌ ప్రయత్నిస్తున్నారు.

ఇందులో భాగంగానే అమెరికా వ్యాప్తంగా కొన్ని నగరాల్లో సినిమా స్పెషల్‌ స్క్రీనింగ్స్ ఏర్పాటు చేశారు. వీటికి రాజమౌళి ప్రత్యక్షంగా హాజరయ్యాడు. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.1200 కోట్లకుపైనే వసూలు చేసిన విషయం తెలిసిందే. అత్యధిక వసూళ్లు సాధించి నాలుగో ఇండియన్‌ మూవీగా నిలిచింది. ఇక నెట్‌ఫ్లిక్స్‌లోకి వచ్చిన తర్వాత హాలీవుడ్‌ ప్రముఖుల దృష్టిని కూడా ఆకర్షించింది.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.