Rajamouli join hands with CAA: హాలీవుడ్ ఏజెన్సీతో చేతులు కలిపిన రాజమౌళి
Rajamouli join hands with CAA: హాలీవుడ్ ఏజెన్సీతో చేతులు కలిపాడు దర్శక ధీరుడు ఎస్‌ఎస్ రాజమౌళి. ఆర్‌ఆర్‌ఆర్ మూవీతో గ్లోబల్ లెవల్లో పేరు సంపాదించిన అతడు.. తాజా డీల్‌తో మరో అడుగు ముందుకేశాడు.
Rajamouli join hands with CAA: టాలీవుడ్ దర్శకుల్లో అసలు ఫెయిల్యూర్ అంటే తెలియని వ్యక్తి ఎస్‌ఎస్ రాజమౌళి. ఫెయిల్యూర్ కాదు కదా సినిమా సినిమాకు మరింత మెరుగవుతూ తన స్థాయిని పెంచుకుంటూ వెళ్తున్నాడు. బాహుబలి మూవీతో పాన్ ఇండియా డైరెక్టర్‌గా మారిపోయాడు. ఇక ఆర్‌ఆర్‌ఆర్‌తో అతని లెవల్ ఇండియా దాటి హాలీవుడ్‌కు చేరింది.
ఈ మూవీకి గ్లోబల్ లెవల్లో వచ్చిన పేరుతో రాజమౌళి రేంజ్ కూడా పెరిగిపోయింది. ఈ సినిమా ఏకంగా ఆస్కార్స్ రేసులో కూడా ఉండటం విశేషం. ఇండియా నుంచి ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్ కేటగిరీలో అధికారికంగా వెళ్లకపోయినా.. నేరుగా వివిధ కేటగిరీల్లో పోటీ పడే అవకాశం కూడా ఉంది. ఈ సక్సెస్‌తో తాజాగా రాజమౌళి ఓ హాలీవుడ్ ఏజెన్సీతో చేతులు కలిపే స్థాయికి చేరాడు.
అమెరికన్ ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ స్పోర్ట్స్ ఏజెన్సీ అయిన క్రియేటివ్ ఆర్టిస్ట్స్ ఏజెన్సీ (CAA)తో రాజమౌళి ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఇది లాస్ ఏంజిల్స్‌లో ఉండే సంస్థ. సినిమాలు, అడ్వర్‌టైజ్‌మెంట్లకు ఎండార్స్‌మెంట్లు, బ్రాండింగ్, మార్కెటింగ్ చేస్తుంది. డైరెక్టర్లు, యాక్టర్లను కూడా మేనేజ్ చేస్తుంది. అలాంటి సంస్థతో రాజమౌళి ఒప్పందం కుదుర్చుకోవడంతో అతని తర్వాతి సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.
రాజమౌళి తన తర్వాతి సినిమాను సూపర్ స్టార్ మహేష్ బాబుతో తీస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీ వచ్చే ఏడాది సెట్స్‌పైకి వెళ్లనుంది. ప్రస్తుతం స్క్రిప్ట్ ప్రీప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. అటు రాజమౌళి ఇప్పుడు అమెరికాలో ఉన్నాడు. తన మూవీ ఆర్ఆర్‌ఆర్ స్పెషల్ స్క్రీనింగ్స్‌లో పాల్గొంటున్నాడు. అక్కడ ఈ మూవీ డిస్ట్రిబ్యూటర్స్‌గా వ్యవహరిస్తున్న సంస్థ ఆర్‌ఆర్‌ఆర్‌ను వివిధ కేటగిరీల్లో ఆస్కార్స్ కోసం పరిశీలించేలా ప్రయత్నాలు మొదలుపెట్టింది.
నిజానికి బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్ కేటగిరీలోనే అధికారికంగా ఇండియా నుంచి ఈ సినిమా ఆస్కార్స్‌కు వెళ్తుందని అందరూ ఆశించారు. కానీ ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా మాత్రం గుజరాతీ మూవీ ఛెల్లో షోని నామినేట్ చేసింది. ఈ కేటగిరీ అవకాశం పోవడంతో ఇక నేరుగా మిగిలిన కేటగిరీల్లో పోటీ పడేందుకు అకాడెమీ పెద్దలతో సంప్రదిస్తామని కూడా ఆర్ఆర్‌ఆర్ యూఎస్ డిస్ట్రిబ్యూటర్స్ చెప్పిన విషయం తెలిసిందే.