Mahesh Babu Rest and Recharge: హాయిగా రెస్ట్ తీసుకుంటున్న మహేష్ బాబు.. ఫొటో వైరల్
Mahesh Babu Rest and Recharge: హాయిగా రెస్ట్ తీసుకుంటూ కనిపించాడు సూపర్ స్టార్ మహేష్ బాబు. రెస్ట్ అండ్ రీఛార్జ్ అంటూ అతడు తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఫొటో వైరల్ అవుతోంది.
Mahesh Babu Rest and Recharge: టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేష్ బాబు చాలా బిజీగా గడుపుతాడు. వరుస షూటింగ్‌లు లేదంటే ఫ్యామిలీతో వెకేషన్లు. అన్నీ పక్కన పెట్టి కాసేపు హాయిగా రెస్ట్ తీసుకునే అవకాశం అతనికి చాలా అరుదుగా దక్కుతుంది. అయితే చాన్నాళ్ల తర్వాత ఇప్పుడలాంటి ఖాళీయే ఈ యువరాజుకు దొరికినట్లుంది.
ట్రెండింగ్ వార్తలు
అందుకే ఇంట్లో హాయిగా సేదదీరుతూ కనిపించాడు. సోషల్ మీడియాలో తన ఫొటోలను పెద్దగా షేర్ చేసే అలవాటు లేని మహేష్.. ఇప్పుడు మాత్రం ఓ సెల్ఫీ తీసుకొని పోస్ట్ చేయడం విశేషం. ఎస్‌ఎస్‌ఎంబీ28 కోసం కొత్త లుక్‌లో కనిపిస్తున్న ఈ ప్రిన్స్.. ఈ సెల్ఫీలోనూ అదే లుక్‌లో కనిపించాడు. ఈ మధ్యే 47వ పుట్టిన రోజు జరుపుకున్న అతడు.. ఈ ఫొటోలో మాత్రం చాలా యంగ్ అండ్ హ్యాండ్సమ్‌గా కనిపించాడు.
ఈ మధ్యే ఆపిల్ రిలీజ్ చేసిన ఐఫోన్ 14 ప్రొ మ్యాక్స్ మొబైల్ నుంచి అతడు ఈ సెల్ఫీ దిగడం విశేషం. రెస్ట్ అండ్ రీఛార్జ్ అనే క్యాప్షన్‌తో ఈ ఫొటోను షేర్ చేసిన మహేష్.. #ChillNoons #iPhone14ProMax అనే హ్యాష్‌ట్యాగ్‌లను కూడా యాడ్ చేశాడు. ఈ ఫొటో అప్పుడే తెగ వైరల్ అయింది. గంటల్లోనే లక్షల సంఖ్యలో లైక్స్ వచ్చాయి.
అతని భార్య నమ్రతతోపాటు ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ కూడా ఈ ఫొటోపై కామెంట్ చేశారు. సింప్లీ లవ్ అంటూ నమ్రతా కొన్ని ఎమోజీలను పోస్ట్ చేయగా.. అటు వార్నర్ మాత్రం 'ఆన్ పాయింట్ మేట్' అంటూ కామెంట్ చేశాడు. అంటే ఎంతో స్టైలిష్‌గా ఉన్నావని చెప్పడం. ఈ సెల్ఫీలో మహేష్ బాబు లాంగ్ హెయిర్‌తోపాటు గడ్డంతో కనిపిస్తున్నాడు.
ఎస్‌ఎస్‌ఎంబీ28 కోసం మహేష్ బాబు ఈ కొత్త లుక్ కూడా ఈ మధ్య చాలా వైరల్ అయిన విషయం తెలిసిందే. అతని లుక్ తొలిసారి బయటకు రాగానే ఫ్యాన్స్‌కు తెగ నచ్చేసింది. త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో మహేష్ తన 28వ సినిమా తీస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ ఇద్దరూ కలిసి అతడు, ఖలేజాలాంటి హిట్స్ అందించగా.. ఇప్పుడు హ్యాట్రిక్‌పై కన్నేశారు. ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ 28న రిలీజ్ కానుంది.
మహేష్ బాబు ఈ మూవీ తర్వాత రాజమౌళితో సినిమా చేయనున్నాడు. వారం కిందటే ఎస్‌ఎస్‌ఎంబీ28 షూటింగ్ ప్రారంభమైంది. దీనికోసం రామోజీ ఫిల్మ్ సిటీలో ఓ భారీ సెట్ కూడా వేశారు. ఈ సెట్స్‌లోని బిహైండ్ ద సీన్ వీడియోను కూడా మేకర్స్ ఇప్పటికే షేర్ చేశారు. ఈ మూవీలో మహేష్ సరసన పూజా హెగ్డే నటిస్తోంది. హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్‌లో మూవీ తెరకెక్కుతోంది.