Chhello Show for Oscars: చెల్లో షో.. అసలేంటీ మూవీ? ఆస్కార్స్‌కు ఎలా వెళ్లింది?-chhello show for oscars as what we should know about this gujarati movie ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Chhello Show For Oscars: చెల్లో షో.. అసలేంటీ మూవీ? ఆస్కార్స్‌కు ఎలా వెళ్లింది?

Chhello Show for Oscars: చెల్లో షో.. అసలేంటీ మూవీ? ఆస్కార్స్‌కు ఎలా వెళ్లింది?

HT Telugu Desk HT Telugu
Sep 20, 2022 08:58 PM IST

Chhello Show for Oscars: చెల్లో షో.. మంగళవారం (సెప్టెంబర్‌ 20) వరకూ అసలు ఇదొక మూవీ ఉందని చాలా మందికి తెలియదు. కానీ ఇండియా నుంచి ఏకంగా ఆస్కార్స్‌కు అధికారిక ఎంట్రీగా వెళ్లి సంచలనం సృష్టించింది.

ఆస్కార్స్ కు ఇండియా నుంచి అధికారిక ఎంట్రీ లాస్ట్ ఫిల్మ్ షో లేదా చెల్లో షో
ఆస్కార్స్ కు ఇండియా నుంచి అధికారిక ఎంట్రీ లాస్ట్ ఫిల్మ్ షో లేదా చెల్లో షో

Chhello Show for Oscars: ఆస్కార్స్‌ గెలవడం కాదు కదా.. కనీసం ఈ ప్రతిష్టాత్మక అవార్డులకు నామినేట్‌ అయినా గొప్పే. అలాంటి అకాడెమీ అవార్డుల కోసం ఈసారి మన టాలీవుడ్‌ మూవీ ఆర్‌ఆర్‌ఆర్‌ రేసులో ఉందని చాలా రోజులుగా వార్తలు వస్తున్నాయి. ఆర్‌ఆర్‌ఆర్‌తోపాటు కశ్మీర్‌ ఫైల్స్‌ మూవీకి కూడా ఛాన్స్‌ ఉందని అనుకున్నారు.

కానీ అనూహ్యం చెల్లో షో అనే మూవీ ఆస్కార్స్‌కు అధికారిక ఎంట్రీగా వెళ్తోంది. ఇదొక గుజరాతీ మూవీ. దీనికే లాస్ట్‌ ఫిల్మ్‌ షోగా పేరుంది. ఆస్కార్స్‌కు బెస్ట్‌ ఇంటర్నేషనల్‌ ఫీచర్‌ ఫిల్మ్‌ కేటగిరీలో ఈ మూవీ ఎంట్రీ ఇస్తోంది. సిద్ధార్థ్‌ రాయ్‌ కపూర్‌ ప్రొడ్యూస్‌ చేసిన ఈ మూవీని పాన్‌ నలిన్‌ డైరెక్ట్‌ చేశాడు. నిజానికి ఈ చెల్లో షో ఇప్పటికే ఇంటర్నేషనల్‌ లెవల్లో కొన్ని అవార్డులు గెలుచుకుంది.

చెల్లో షో.. ఏంటీ మూవీ?

లాస్ట్‌ ఫిల్మ్‌ షో లేదా చెల్లో షో మూవీ ఒకప్పటి సినిమాకు పట్టం కడుతూ తీసిన మూవీ. ఒకరకంగా ఆటో బయోగ్రఫికల్‌ డ్రామా. ఇండియన్‌ సినిమా దశాబ్దాలుగా ఎలా మారుతూ వచ్చింది.. సెల్యూలాయిడ్‌ నుంచి డిజిటల్కు మారడం, సింగిల్‌ స్క్రీన్‌ థియేటర్లను మూసేయడంలాంటి బ్యాక్‌డ్రాప్‌లో ఈ చెల్లో షో సాగుతుంది. సినిమాపై ప్రేమతో తీసిన ఈ మూవీ ఇప్పుడు ఏకంగా ఆస్కార్స్‌కే నామినేట్‌ కావడం విశేషం.

ఈ చెల్లో షో మూవీలో భవిన్‌ రబారీ, వికాస్‌ బాటా, రిచా మీనా, భవేష్‌ శ్రీమాలి, దీపేన్‌ రావల్‌, రాహుల్‌ కోలీ నటించారు. సంసారా, వాలీ ఆఫ్‌ ఫ్లవర్స్‌, యాంగ్రీ ఇండియన్‌ గాడెసెస్‌, ఆయుర్వేద: ఆర్ట్‌ ఆఫ్‌ బీయింగ్‌లాంటి అవార్డ్‌ విన్నింగ్‌ సినిమాలను తీసిన డైరెక్టర్‌ పాన్ నలిన్‌ ఈ చెల్లో షోను డైరెక్ట్‌ చేశాడు. ట్రిబెకా ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో ఈ మూవీని తొలిసారి ప్రదర్శించారు. ఈ సినిమా అక్టోబర్‌ 14న గుజరాత్‌తోపాటు ఇండియా వ్యాప్తంగా పలు థియేటర్లలో రిలీజ్‌ కాబోతోంది. 95వ అకాడెమీ అవార్డుల వేడుక 2023, మార్చి 12న జరగనుంది.

IPL_Entry_Point

టాపిక్