India's entry for Oscars 'Chhello Show': ఆస్కార్ కు వెళ్తున్న భారతీయ సినిమా ఇదే
India's entry for Oscars 'Chhello Show': ప్రతిష్టాత్మక ఆస్కార్ పురస్కార పోటీలో భారత్ తరఫున అధికారిక ఎంట్రీగా గుజరాతీ సినిమా ‘ఛెల్లో షో’ ఎంపికైంది.
India's entry for Oscars 'Chhello Show': 2023 సంవత్సరానికి గానూ భారతీయ అధికారిక ఎంట్రీ గా ఆస్కార్ బరిలో నిలుస్తున్న సినిమా గుజరాతీ మూవీ ‘ఛెల్లో షో(Chhello Show)’.
India's entry for Oscars 'Chhello Show': గుజరాతీ మూవీ
అందరి అంచనాలను తలకిందులు చేస్తూ గుజరాతీ సినిమా ‘ఛెల్లో షో(Chhello Show)’ 95వ ఆస్కార్ అవార్డుల బరిలో నిలిచింది. 95వ అకాడమీ అవార్డుల్లో భారతీయ అధికారిక ఎంట్రీ గా ‘ఛెల్లో షో(Chhello Show) ను ఎంపిక చేసినట్లు ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా((FFI)) మంగళవారం ప్రకటించింది. ఇంగ్లీష్ లో ఈ మూవీకి "Last Film Show" అనే పేరు పెట్టారు. ఇది భారత్ లోని థీయేటర్లలో దేశవ్యాప్తంగా అక్టోబర్ 14న విడుదల కానుంది.
India's entry for Oscars 'Chhello Show': స్టోరీ ఏంటి?
ఒక 9 ఏళ్ల పిల్లవాడు సినిమాపై పెంచుకున్న ప్రేమ, సినిమా తో పాటు సాగిన ఆ పిల్లవాడి జీవితం ప్రధానంగా ఈ సినిమా రూపొందింది. ఈ సినిమాను రాయ్ కపూర్ ఫిల్మ్స్ బేనర్ పై సిద్ధార్ధ రాయ్ కపూర్ నిర్మించారు. జుగ్గాడ్ మోషన్ పిక్చర్స్, మాన్సూన్ ఫిల్మ్స్, ఛెల్లో షో ఎల్ఎల్పీ, మార్క్ డ్వాలే సహ నిర్మాతలుగా వ్యవహరించారు. ఈ మూవీకి పన్ నళిన్ దర్శకత్వం వహించారు. తన బాల్యం నాటి సొంత అనుభవాల నుంచి ఈ కథను రాసుకున్నానని పన్ నళిన్ వెల్లడించారు. సౌరాష్ట్రలోని ఒక చిన్న గ్రామంలో నివసించే 9 ఏళ్ల పిల్లవాడి జీవితంలోకి సినిమా ప్రవేశం, సినిమాతో వాడి ప్రేమ, జీవితాంతం సినిమాతో పెనవేసుకుపోయిన వాడి అనుబంధం.. మొదలైన వాటిని ఈ సినిమాలో హృద్యంగా చిత్రీకరించారు. ఈ సినిమాలో భావిన్ రబారి, భవేశ్ శ్రీమలి, రిచా మీనా, దీపేన్ రావల్, పరేశ్ మెహతా తదితరులు నటించారు.
India's entry for Oscars 'Chhello Show': ఇప్పటికే ఎన్నో పురస్కారాలు
ఈ సినిమా ఇప్పటికే ఎన్నో పురస్కారాలు సాధించింది. ట్రైబెకా ఫిల్మ్ ఫెస్టివల్ లో ఓపెనింగ్ మూవీగా ప్రదర్శితమైంది. స్పెయిన్ లో జరిగిన వాలడాలిడ్ ఫిల్మ్ ఫెస్టివల్ లో గోల్డెన్ స్పైక్ అవార్డ్ సాధించింది. గత సంవత్సరం ఆస్కార్ అవార్డుల బరిలో తమిళ సినిమా కూఝంగల్ భారతీయ అధికారిక ఎంట్రీగా అర్హత సాధించింది. ఈ సినిమా దర్శకుడు వినోద్ రాజ్ పీఎస్. 2001లో ఆమిర్ ఖాన్ సినిమా లగాన్ అస్కార్ బరిలో టాప్ ఫైవ్ లో ఒకటిగా నిల్చింది. అలాగే, 1956లో మదర్ ఇండియా, 1989లో సలాం బాంబే కూడా ఆస్కార్ టాప్ ఫైవ్ లో నిలిచాయి. 2023వ సంవత్సరానికి ఆస్కార్ అవార్డుల ప్రదాన కార్యక్రమం లాస్ ఏంజెలిస్ లో మార్చి 12న జరుగుతుంది.