తెలుగు న్యూస్  /  Entertainment  /  John Abraham Joins Ravi Teja's Pan India Film Tiger Nageswara Rao Details Inside

Ravi Teja Cinema : రవితేజ సినిమా కోసం ఇతర భాషల సూపర్ స్టార్స్.. మరి తెలుగులో ఎవరు?

Anand Sai HT Telugu

21 May 2023, 12:48 IST

    • Tiger Nageswara Rao : రవితేజ టైగర్ నాగేశ్వరరావు సినిమా హిందీ టీజర్‌కి జాన్ అబ్రహం తన గాత్రాన్ని అందించాడు. ఈ సినిమా దక్షిణాది భాషలతోపాటు హిందీలోనూ వస్తుంది. ఇతర భాషల్లోని సూపర్ స్టార్స్ ఈ సినిమాకు వాయిస్ ఓవర్ ఇచ్చారు.
టైగర్ నాగేశ్వరరావు
టైగర్ నాగేశ్వరరావు (Twitter)

టైగర్ నాగేశ్వరరావు

రవితేజ మొదటి పాన్ ఇండియన్ చిత్రం టైగర్ నాగేశ్వరరావు(Tiger Nageswara Rao)పై చాలా అంచనాలు ఉన్నాయి. సినీ అభిమానులు ఈ చిత్రం గురించి ఎదురుచూస్తున్నారు. టీజర్ మే 24 న అన్ని సౌత్ భాషలు, హిందీలో విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది. టైగర్ నాగేశ్వరరావు హిందీ టీజర్‌కి జాన్ అబ్రహం(John Abraham) తన గాత్రాన్ని అందించాడు. తమిళంలో కార్తీ, కన్నడలో శివరాజ్‌కుమార్(Shivraj Kumar), మలయాళంలో దుల్కర్ సల్మాన్ వాయిస్ ఓవర్ కూడా ఇచ్చారు.

ట్రెండింగ్ వార్తలు

Lineman OTT: ఓటీటీలోకి సడెన్‌గా వచ్చేసిన కామెడీ మూవీ.. అక్కడ స్ట్రీమింగ్.. కానీ, చిన్న ట్విస్ట్

Brahmamudi: అనామిక పేరెంట్స్‌ను బెదిరించిన కావ్య- న్యాయం చేయమంటూ నట్టింట్లో కూర్చున్న కనకం- ముకుందతోనే మురారికి బిడ్డ

Jathi Ratnalu 2: జాతి రత్నాలు 2 అప్పుడే! అప్డేట్ ఇచ్చిన చిట్టి.. ఫరియా అబ్దుల్లా కామెంట్స్ వైరల్

Premikudu Re Release: ప్రభుదేవా బ్లాక్ బస్టర్ హిట్ ప్రేమికుడు రీ రిలీజ్.. 30 ఏళ్లకు మళ్లీ.. 300కుపైగా థియేటర్లలో!

ఐదు భాషల్లో టీజర్ విడుదల కానుండగా, తమిళం, కన్నడ, మలయాళంలో కార్తీ , శివ రాజ్‌కుమార్, దుల్కర్ సల్మాన్(dulquer salmaan) వాయిస్ ఓవర్‌లు అందించినట్లు ప్రకటించారు. తెలుగు టీజర్‌కి ఎవరు వాయిస్ ఓవర్ ఇవ్వబోతున్నారు అనేది మేకర్స్ ఇంకా ప్రకటించలేదు. అయితే తెలుగు టీజర్‌కి చిరంజీవి(Chiranjeevi) తన వాయిస్‌ని ఇస్తారని అంతా అనుకుంటున్నారు. టైగర్ నాగేశ్వరరావును పరిచయం చేస్తూ.. వాయిస్ ఇవ్వాల్సి ఉంటుంది.

వంశీ డైరెక్షన్‌లో వస్తున్న ఈ మూవీని అభిషేక్ అగర్వాల్‌ ప్రొడ్యూస్‌ చేస్తున్న విషయం తెలిసిందే. భారీ బడ్జెట్‌తో వస్తున్న ఈ సినిమాలో హేమలత లవణం అనే ముఖ్యమైన పాత్రలో రేణు దేశాయ్ కనిపించబోతోంది. ఆమె క్యారెక్టర్‌కు సంబంధించిన గ్లింప్స్‌ను ఇప్పటికే మేకర్స్‌ రిలీజ్‌ చేశారు. ఈ క్యారెక్టర్‌ ఇంట్రడక్షన్‌ కోసం జీవీ ప్రకాశ్‌ ఇచ్చిన మ్యూజిక్‌ కూడా చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంది. ఈ మూవీలో రవితేజ సరసన నుపుర్‌ సనన్‌, గాయత్రి భరద్వాజ్‌ నటిస్తున్నారు.

ఈ చిత్రం 1970లలో స్టువర్ట్‌పురంలో సాహసోపేతమైన దొంగ టైగర్ నాగేశ్వరరావు బయోపిక్. నాగేశ్వరరావు ముఖ్యంగా పోలీసు కస్టడీ నుండి జారుకోవడంలో ప్రసిద్ధి. 1970లలో చెన్నై జైలు నుండి అతను తప్పించుకున్న విధానం.. అందరినీ ఆశ్యర్యపరిచింది. ఇలాంటి కథలో మాస్ మహారాజా రవితేజ సినిమా వస్తుండటంతో అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ప్రస్తుతం టైగర్ నాగేశ్వర రావు సినిమాతో రవితేజ బిజీగా ఉన్నాడు. ఆ తర్వాత కలర్ ఫొటో డైరెక్టర్ సందీప్ రాజ్ డైరెక్షన్ లో మరో సినిమా చేస్తున్నాడు. ఈ మూవీ కోసం రవితేజ ఏకంగా రూ.25 కోట్లు వసూలు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. సినిమా హిట్, ఫ్లాపులతో సంబంధం లేకుండా రవితేజ మాత్రం తన ఫీజు పెంచేస్తుండటం విశేషం.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.