Manobala Death : సినీ పరిశ్రమలో విషాదం.. కమెడియన్ మనోబాల ఇకలేరు-actor and director manobala passes away at 69 in chennai ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Actor And Director Manobala Passes Away At 69 In Chennai

Manobala Death : సినీ పరిశ్రమలో విషాదం.. కమెడియన్ మనోబాల ఇకలేరు

HT Telugu Desk HT Telugu
May 03, 2023 03:27 PM IST

Manobala Passes Away : ప్రముఖ తమిళ హాస్య నటుడు మనోబాల (69) కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు.

మనోబాల మృతి
మనోబాల మృతి

తమిళ హాస్య నటుడు మనోబాల(Manobala Death) మృతి చెందారు. కొన్ని రోజులుగా ఆయన తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. లివర్ సమస్యతో ఆయన ఆరోగ్యం క్షిణించింది. జనవరిలో యాంజియో చికిత్స చేయించుకున్నారు. అప్పటి నుంచి పలు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. బుధవారం(మే 03) మరణించారు. మనోబాల మృతి(Manobala Passes Away)తో సినీ పరిశ్రమలో విషాదం నెలకోంది.

సినిమాల్లో తనదైన ముద్రవేశారు మనోబాల. ఎన్నో హిట్ సినిమాల్లో నటించారు. వేస్ట్ పేపర్ పేరుతో యూట్యూబ్ ఛానెల్‌ను కూడా నడిపిస్తున్నారు. తమిళ చిత్రసీమలో కొన్ని ముఖ్యమైన చిత్రాలను కూడా నిర్మించారు. తమిళంలో 700కు పైగా చిత్రాల్లో క్యారెక్టర్ రోల్స్‌లో నటించారు. ఎక్కువగా హాస్య పాత్రలు చేస్తూ కనిపించారు. తన యూట్యూబ్ ఛానెల్ ద్వారా ప్రముఖులను ఇంటర్వ్యూ చేశారు.

రెండు వారాలుగా చెన్నైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందారు మనోబాల(Manobala). కానీ ఆరోగ్య పరిస్థితి విషమించి.. బుధవారం మృతి చెందారు. మనోబాల మృతితో చిత్ర పరిశ్రమలో విషాదం నెలకొంది. తమిళ సినీ పరిశ్రమలో నటుడు, దర్శకుడు, నిర్మాతగా రాణించారు. తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే. ఆయన తమిళ సినిమాలో చాలా వరకు తెలుగులో డబ్ అయ్యాయి. శివ పుత్రుడు, చంద్రముఖి చిత్రాల ద్వారా తెలుగు ప్రేక్షకులకు కూడా ఆయన తెలుసు.

పలు తెలుగు సినిమాల్లోనూ నటించారు. మహానటి, దేవదాసు, రాజ్ దూత్, వాల్తేరు వీరయ్య(Waltair Veerayya) వంటి చిత్రాల్లో నటించారు. 1970లో సినీ పరిశ్రమలో మనోబాల అడుగుపెట్టారు. 1979లో భారతీరాజ(bharathi raja) వద్ద అసిస్టెంట్ డైరెక్టర్ గా చేశారు. 1982లో అగయ గంగయ్ అనే సినిమాతో దర్శకుడిగా మారారు. ఆ తర్వాత 20కి పైగా చిత్రాలను దర్శకుడిగా తెరకెక్కించారు. మూడు చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించారు. దిగ్గజ నటులు సినిమాల్లో హాస్యనటుడిగా చేశారు. అంతేకాదు.. పలు సీరియళ్లలోనూ నటించి బుల్లితెర ప్రేక్షకులకు దగ్గరయ్యారు. చివరగా 'కొండ్రాల్ పావమ్, గోస్టీ' సినిమాల్లో నటించారు మనోబాల.

IPL_Entry_Point