Tiger Nageswara Rao Update: వైజాగ్‌లో రవితేజ.. టైగర్ నాగేశ్వరరావు కోసం భారీ సెట్
Tiger Nageswara Rao Update: మాస్ మహారాజా రవితేజ మొదటి పాన్ ఇండియా చిత్రం టైగర్ నాగేశ్వరరావు. తాజాగా ఈ సినిమా ఫైనల్ షెడ్యూల్ వైజాగ్‌లో ప్రారంభమైంది. ఇందుకోసం అక్కడ భారీ సెట్‌ను రూపొందించారు.

Tiger Nageswara Rao Update: మాస్ మహారాజా రవితేజ వరుస హిట్లతో దూసకెళ్తున్నాడు. గతేడాది డిసెంబరులో ధమాకా సినిమాతో సూపర్ సక్సెస్ అందుకున్న రవితేజ.. ఈ సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య సినిమాలో కీలక పాత్ర పోషించి మరో అదిరే విజయాన్ని సొంతం చేసుకున్నాడు. ప్రస్తుతం ఈ వేసవికి రావణాసుర చిత్రంతో ప్రేక్షకులను పలకరించనున్నారు. ఇదిలా ఉండగానే మరో సినిమాను కూడా రెడీ చేస్తున్నాడు. అదే టైగర్ నాగేశ్వరరావు. రవితేజ కెరీర్‌లో తొలి పాన్ ఇండియా చిత్రంగా ఇది తెరకెక్కుతోంది. అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ సంస్థ ఈ సినిమా నిర్మిస్తోంది. భారీ నిర్మాణ విలువలు, అత్యున్న సాంకేతిక ప్రమాణాలతో భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు.
తాజాగా ఈ సినిమాకు సంబంధించి అదిరిపోయే అప్డేట్ ఇచ్చింది చిత్రబృందం. ఈ సినిమా చివరి షెడ్యూల్‌ను శనివారం రాత్రి వైజాగ్‌లో ప్రారంభించింది. ఇందులో కొన్ని కీలక సన్నివేశాలను తెరకెక్కించనున్నారు. సినిమా కోసం స్టువర్టుపురం గ్రామాన్ని రూపొందించేందుకు 5 ఎకరాల స్థరంలో భారీ సెట్‌ను వేశారు. ఇందుకో భారీ బడ్జెట్ కూడా కేటాయించారు.
టైగర్ నాగేశ్వరరావు సినిమా ప్రారంభించినప్పటి నుంచి సర్వత్రా మూవీపై ఆసక్తి పెరిగింది. టైటిల్, ప్రీ లుక్ పోస్టర్ లాంటి వాటికి ఆడియెన్స్ నుంచి బాగా రెస్పాన్స్ వచ్చింది. టైగర్ నాగేశ్వరరావు స్టూవర్టుపురంలోని గజదొంగ జీవిత చరిత్ర ఆధారంగా రూపొందుతోంది. 1970ల నేపథ్యంలో సాగే కథ ఇది. ఈ పవర్ ఫుల్ పాత్ర పోషించేందుకు రవితేజ పూర్తిగా మేకోవర్ అయ్యారు. ఇది వరకు ఎన్నడూ చూడని విధంగా సరికొత్త బాడీ లాంగ్వేజ్, యాసతో అలరించనున్నారు. ఈ సినిమాలో రవితేజ సరసన నూపుర్ సనన్, గాయత్రి భరద్వాజ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.
వంశీ దర్శకత్వంలో అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ పతాకంపై నిర్మాత అభిషేక్ అగర్వాల్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఆర్ మదీ ఐఎస్‌సీ ఈ సినిమాకు సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నారు. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు. అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైనర్‌గా వర్క్ చేస్తున్నారు. ఈ ఏడాదే టైగర్ నాగేశ్వరరావు సినిమా ప్రేక్షకులు ముందుకు వచ్చే అవకాశముంది.
టాపిక్