తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Premikudu Re Release: ప్రభుదేవా బ్లాక్ బస్టర్ హిట్ ప్రేమికుడు రీ రిలీజ్.. 30 ఏళ్లకు మళ్లీ.. 300కుపైగా థియేటర్లలో!

Premikudu Re Release: ప్రభుదేవా బ్లాక్ బస్టర్ హిట్ ప్రేమికుడు రీ రిలీజ్.. 30 ఏళ్లకు మళ్లీ.. 300కుపైగా థియేటర్లలో!

Sanjiv Kumar HT Telugu

28 April 2024, 5:56 IST

  • Prabhudeva Premikudu Movie Re Release: ఇండియన్ మైఖేల్ జాక్సన్‌గా పేరు తెచ్చుకున్న ప్రభుదేవా నటించి భారీ బ్లాక్ బస్టర్ హిట్ అయిన సినిమా ప్రేమికుడు. సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా 30 ఏళ్లకు రీ రిలీజ్ కానుంది. పూర్తి వివరాల్లోకి వెళితే..

ప్రభుదేవా బ్లాక్ బస్టర్ హిట్ ప్రేమికుడు రీ రిలీజ్.. 30 ఏళ్లకు మళ్లీ.. 300కుపైగా థియేటర్లలో!
ప్రభుదేవా బ్లాక్ బస్టర్ హిట్ ప్రేమికుడు రీ రిలీజ్.. 30 ఏళ్లకు మళ్లీ.. 300కుపైగా థియేటర్లలో!

ప్రభుదేవా బ్లాక్ బస్టర్ హిట్ ప్రేమికుడు రీ రిలీజ్.. 30 ఏళ్లకు మళ్లీ.. 300కుపైగా థియేటర్లలో!

Shankar Premikudu Re Release: మెగా ప్రొడ్యూసర్ కే టి కుంజుమోన్ నిర్మాతగా, సెన్సేషనల్ డైరెక్టర్ ఎస్. శంకర్ దర్శకత్వంలో, ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందించిన సినిమా ప్రేమికుడు. ఇండియన్ మైఖేల్ జాక్సన్ ప్రభుదేవ, అందాల నటి నగ్మ నటించిన ఈ ప్రేమికుడు సినిమా రీ రిలీజ్ కానుంది. ప్రస్తుతం ఈ సినిమా రీ రిలీజ్ నిర్మాతలుగా రమణ, మురళీధర్ వ్యవహరిస్తున్నారు. ఈ మూవీలో దివంగత ఎస్పీ బాలసుబ్రమణ్యం, వడివేలు, రఘువరన్, గిరీష్ కర్నాడ్ ముఖ్యపాత్రలో నటించారు.

ట్రెండింగ్ వార్తలు

Sudheer Babu: సుధీర్ బాబుకు బర్త్ డే విషెస్.. హరోం హర నుంచి కొత్త సాంగ్ రిలీజ్

Aarambham OTT: ఓటీటీల్లో వెతికి మరీ చూస్తారు.. అప్పటివరకు ఆగొద్దు: ఆరంభం డైరెక్టర్ అజయ్ నాగ్

Aavesham OTT Controversy: ప్రేక్షకులను బాధపెట్టిన ఓటీటీ మూవీ ఆవేశం.. భాషను అవమానించారంటూ ఫైర్

Brahmamudi: కావ్య మాటలకు ఖంగుతిన్న మామ సుభాష్- రాజ్‌తో సవాల్- శైలేంద్రకు తండ్రి వార్నింగ్- బయటపడనున్న మీరా ప్రెగ్నెన్సీ

30 సంవత్సరాల క్రితం వచ్చిన ప్రేమికుడు సినిమా మళ్లీ మే 1న 300కు పైగా థియేటర్లలో ఘనంగా రీ రిలీజ్ అవుతోంది. బుకింగ్స్ ఓపెన్ అయి ప్రజల నుంచి అద్భుతమైన స్పందన లభిస్తోంది. గేమ్ చేంజర్ డైరెక్టర్ ఎస్. శంకర్ దర్శకత్వంలో ఇండియన్ మైఖేల్ జాక్సన్ ప్రభుదేవా, నగ్మా జంటగా 30 సంవత్సరాల క్రితం వచ్చిన ప్రేమికుడు యువతను ఆకట్టుకున్న విషయం తెలిసిందే. ఇప్పటికి కూడా ఆ సినిమాలోని పాటలు యువతనే కాకుండా అందరినీ అలరిస్తుంటాయి.

ఈ సినిమాలో ప్రభుదేవా తండ్రిగా ఎస్. పి. బాలసుబ్రమణ్యం గారు నటించడం సినిమాకే పెద్ద ప్లస్ అయింది. అందమైన ప్రేమ రాణి చెయ్యి తగిలితే పాటలో ప్రభుదేవాతో సమానంగా ఎస్పీ బాలు డాన్స్ చేయడం విశేషం. ఇక టేకిట్ ఈజీ పాలసీ, ఓ చెలియా నా ప్రియ సఖియా పాటలు ఇప్పటికీ ఎప్పటికీ ఎవర్‌గ్రీన్ సాంగ్స్. ఒక మంచి యూత్‌ఫుల్ లవ్ స్టోరీగా వచ్చిన ఈ సినిమా అప్పటి రోజుల్లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్.

ప్రేమికుడు రీ రిలీజ్‌కి సంబంధించిన వేడుక శనివారం (ఏప్రిల్ 27) చాలా ఘనంగా జరిగింది. ఈ వేడుకలో నిర్మాతలు మురళీధర్ రెడ్డి, రమణ, ప్రముఖ నిర్మాత లగడపాటి శ్రీనివాస్, శోభారాణి పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్మాతలు తమ అభిప్రాయాలను తెలిపారు.

"ప్రేమికుడు సినిమాని 30 సంవత్సరాల తర్వాత మళ్లీ సీ ఎం ఆర్ సంస్థ పైన మే 1న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నాము. బుకింగ్స్ ఓపెన్ చేసిన వెంటనే ప్రేక్షకుల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. డిస్ట్రిబ్యూటర్లు కూడా మాకు ఎంతో సపోర్ట్ చేస్తున్నారు. వారికి మా ధన్యవాదాలు. అదేవిధంగా ఈ సినిమా రిలీజ్‌కి అంగీకరించి మాకు సహకరిస్తున్న మా మెగా ప్రొడ్యూసర్ కుంజు మోహన్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము" అని నిర్మాత మురళీధర్ రెడ్డి తెలిపారు.

"మురళీధర్ రెడ్డి గారు, రమణ గారు ప్రేమికుడు సినిమాని మే 1న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నారు. డిస్ట్రిబ్యూటర్లు కూడా ఎంతో సపోర్ట్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ ప్రేమికుడు సినిమాని 4K క్వాలిటీలో విడుదల చేస్తున్నాము. ఈ సినిమాకి సంబంధించిన టీజర్, ట్రైలర్ ప్లే చేస్తున్నప్పుడు చాలా మంచి స్పందన లభించింది. ఒక మంచి లవ్ స్టోరీ అదే విధంగా పొలిటికల్ డ్రామా కూడా ఈ ప్రేమికుడు సినిమాలో ఉన్నాయి" అని శోభారాణి పేర్కొన్నారు.

"ఇందులో లెజెండరీ సింగర్ ఎస్. పి. బాలసుబ్రమణ్యం గారి నటన అదే విధంగా ఆయన చేసిన డాన్స్ సినిమాకి పెద్ద ప్లస్‌గా నిలిచాయి. అప్పుడు ఇప్పుడు ఎప్పటికీ కూడా ఈ సినిమాకి పాటలకి ఇదే స్పందన ఉంటుంది. ఈ ప్రేమికుడు సినిమా రీ రిలీజ్ కి సపోర్ట్ చేస్తున్న అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను" అని శోభారాణి వెల్లడించారు.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం