Krishna Mukunda Murari June 13th Episode: ముకుంద ప్రేమికుడు ఎవ‌రో కృష్ణ‌కు తెలిసిందా? - రేవ‌తి పూజ‌లు ఫ‌లించాయా?-krishna mukunda murari june 13th episode krishna upsets murari decision ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Krishna Mukunda Murari June 13th Episode: ముకుంద ప్రేమికుడు ఎవ‌రో కృష్ణ‌కు తెలిసిందా? - రేవ‌తి పూజ‌లు ఫ‌లించాయా?

Krishna Mukunda Murari June 13th Episode: ముకుంద ప్రేమికుడు ఎవ‌రో కృష్ణ‌కు తెలిసిందా? - రేవ‌తి పూజ‌లు ఫ‌లించాయా?

HT Telugu Desk HT Telugu
Jun 13, 2023 09:30 AM IST

Krishna Mukunda Murari June 13th Episode: కృష్ణ‌, మురారిల‌ను క‌లిపేందుకు వారిచేత ఓ హోమం జ‌రిపించాల‌ని రేవ‌తి నిర్ణ‌యించుకుంటుంది.ఆ హోమంలో భార్యాభ‌ర్త‌లుగా క‌లిసి కూర్చోవాల‌ని మురారి, కృష్ణ అనుకున్నారా? లేదా? అన్న‌ది తెలియాలంటే నేటి కృష్ణ ముకుంద మురారి సీరియ‌ల్ చూడాల్సిందే...

 కృష్ణ ముకుంద మురారి సీరియ‌ల్
కృష్ణ ముకుంద మురారి సీరియ‌ల్

Krishna Mukunda Murari June 13th Episode: త‌న తండ్రికి ఇచ్చిన మాట‌ల‌కు క‌ట్టుబ‌డి త‌న బాధ్య‌త‌ను నెర‌వేర్చ‌డానికి మురారి చేస్తోన్న త్యాగాల‌ను చూసి అత‌డిపై ప్రేమ‌ను మ‌రింత పెంచుకుంటుంది కృష్ణ‌. మ‌న‌సులో మురారిపై ప్రేమ, ఇష్టం ఉన్నా..అత‌డు మ‌రో అమ్మాయిని ప్రేమిస్తున్నాడ‌ని తెలిసి బాధ‌ప‌డుతుంటుంది.

అలేఖ్య అనుమానం…

మురారిని ముకుంద ప్రేమిస్తోన్న‌ట్లుగా మ‌ధుక‌ర్‌తో పాటు అత‌డి భార్య అలేఖ్య‌కు డౌట్ వ‌స్తుంది. ఆ విష‌యాన్ని తేల్చుకోవాల‌ని అలేఖ్య డిసైడ్ అవుతుంది. మురారినే కృష్ణ‌కు మెట్టెలు తొడిగాడా? నువ్వు అక్క‌డే ఉన్నావా? అని ముకుంద‌ను అలేఖ్య ప్ర‌శ్నిస్తుంది. అందుకు అవున‌ని ముకుంద ఆమెకు స‌మాధాన‌మిస్తుంది. వెంట‌నే నువ్వు ఎవ‌రినైపా ప్రేమించావా? అని అలేఖ్య మ‌రోసారి ముకుంద‌ను ప్ర‌శ్న అడుగుతుంది.

ఇలాగే తొంద‌ర‌ప‌డి రేవ‌తి ద‌గ్గ‌ర త‌న ప్రేమ‌తో పాటు కృష్ణ‌, మురారిల అగ్రిమెంట్ మ్యారేజీ గురించి చెప్పి ఇరుక్కుపోయిన విష‌యం ముకుంద‌కు గుర్తుకొస్తుంది. స‌మాధానం చెప్ప‌కుండా దాటాయేల‌ని ఫిక్స్ అవుతుంది. ఫోటోగ్ర‌ఫీలో డిప్లొమా, ఎంబీఏ చేశాన‌ని, చ‌దువులో ప‌డి ప్రేమించ‌డానికి టైమ్ దొర‌క‌లేద‌ని అలేఖ్య‌కు స‌మాధానం చెబుతుంది. ఇలాంటి పిచ్చి పిచ్చి ప్ర‌శ్న‌ల‌తో త‌న టైమ్ వేస్ట్ చేయ‌వ‌ద్ద‌ని అలేఖ్య‌కు క్లాస్ ఇస్తుంది ముకుంద‌.

కృష్ణ‌, మురారిల కోసం హోమం...

కృష్ణ‌, మురారిల‌కు క‌లిపేందుకు పూజ‌లు, వ్ర‌తాల్ని న‌మ్ముకుంటుంది రేవ‌తి. వారిద్ద‌రు క‌లిసి ఉండేలా ఓ హోమాన్ని జ‌రిపించాల‌ని డిసైడ్ అవుతుంది. అందుకు అవ‌స‌ర‌మైన వ‌స్తువుల్ని కృష్ణ‌, మురారిలు మాత్ర‌మే తీసుకురావాల‌ని కండీష‌న్ పెడుతుంది. అగ్రిమెంట్ మ్యారేజ్ గురించి త‌ల్లికి తెల‌వ‌డంతోనే ఇలా చేస్తుంద‌ని మురారి గ్ర‌హిస్తాడు. కానీ ఆ నిజాన్ని కృష్ణ ద‌గ్గ‌ర దాస్తాడు. కానీ కృష్ణ మాత్రం అత‌డు అబ‌ద్దం చెబుతున్నాడ‌ని ఇట్టే క‌నిపెట్టేస్తుంది. తానే నిజాన్ని ఏదో ఒక రోజు క‌నిపెడ‌తాన‌ని అంటుంది. హోమం, మెట్టెల పేరుతో రేవ‌తి వేసే స్కీమ్‌లు వెన‌కున్న అంత‌ర్యం ఏమిటో మాత్రం కృష్ణ‌కు అంతుప‌ట్ట‌దు.

మురారి అస‌హ‌నం...

హోమం పేరుతో రేవ‌తి ఇంట్లో హ‌డావిడి చేస్తుంది. కృష్ణ‌, మురారి మ‌ధ్య ఎడ‌బాటు ఉన్న‌ట్లుగా పంతులు అనుమాన‌ప‌డ‌తాడు. అత‌డి మాట‌ల‌కు మురారి చిరాకుగా ఫీల‌వుతాడు. దాంప‌త్య పాశుప‌త హోమం వ‌ల్ల ఏడు జ‌న్మ‌ల పాటు దంప‌తులు భార్యాభ‌ర్త‌లుగా క‌లిసి ఉంటార‌ని పంతులు చెబుతారు.

అత‌డి మాట‌ల‌కు ఈ జ‌న్మ‌లో మురారి త‌న భ‌ర్త అయితే చాలాని కృష్ణ కోరుకుంటుంది. పంతుల మాట నిజం కావాల‌ని మురారి దేవుడిని వేడుకుంటాడు. ఆ త‌ర్వాత కృష్ణ‌, మురారి క‌లిసి పంతులు ఆశీర్వాదం తీసుకుంటారు. క‌ల‌కాలం పిల్ల‌పాప‌ల‌తో క‌లిసి ఉండ‌మ‌ని అత‌డు దీవిస్తాడు. హోమంలో ముకుంద‌, మురారి సాన్నిహిత్యం చూసి ముకుంద మ‌న‌సు వేద‌న‌తో ర‌గిలిపోతుంది.

నిజం చెప్ప‌డం వ‌ల్లే...

హోమం, పూజ‌ల ద్వారా రోజురోజుకు కృష్ణ త‌న‌కు ద‌గ్గ‌ర‌వుతుండ‌టంతో మురారి సంతోష‌ప‌డ‌తాడు. కృష్ణ‌తో త‌న‌ది అగ్రిమెంట్ మ్యారేజీ అనే నిజం త‌ల్లితో ముకుంద చెప్ప‌డం వ‌ల్లే ఇదంతా జ‌రుగుతోంద‌ని అనుకుంటాడు. ఈ విష‌యంలో ముకుంద‌కు మ‌న‌సులోనే థాంక్స్ చెబుతాడు.

నిజం చెప్ప‌డం వ‌ల్ల మురారితో త‌న పెళ్లి జ‌రుగుతుంద‌ని ముకుంద భావించింద‌ని, కానీ త‌న త‌ల్లి మాత్రం ప్రేమించిన అమ్మాయి కంటే పెళ్లి చేసుకున్న అమ్మాయి జీవితాన్ని నిల‌బెట్ట‌డానికే ప‌రిత‌పిస్తుంద‌ని మురారి మ‌న‌సులో అనుకుంటాడు. నిజంగా నాకేం కావాలో నీకు తెలుసు అమ్మ అంటూ ఆనందంలో మునిగిపోతాడు. అగ్రిమెంట్ ముగిసేలోపు ప్రేమించిన మురారితో వీలైన‌న్ని మ‌ధుర జ్ఞాప‌కాల్ని పోగుచేసుకోవాల‌ని కృష్ణ అనుకుంటుంది. మురారి భార్య‌గా హోమంలో కూర్చునే అదృష్టం క‌లిగింద‌ని సంతోష‌ప‌డుతుంది.

భార్య‌గా కృష్ణ‌ను మురారి అంగీక‌రిస్తాడా?

మ‌రో అమ్మాయిని మ‌న‌సులో పెట్టుకొని త‌న‌ను భార్య‌గా అంగీక‌రిస్తూ మురారి హోమంలో కూర్చుంటాడా లేదా అని కృష్ణ‌ ఆలోచిస్తుంటుంది. మ‌రోవైపు మురారి కూడా అదే విష‌యాన్ని గురించి ధీర్ఘంగా ఆలోచిస్తుంటాడు. త‌న భార్య‌గా కృష్ణ హోమంలో కూర్చుంటుందా అని అనుమాన‌ప‌డ‌తాడు. కృష్ణ మ‌న‌సులో ఏముందో తెలుసుకోవ‌డానికి హోమం నుంచి త‌ప్పించుకోవ‌డానికి త‌ల‌కు దెబ్బ త‌గిలించుకోవాల‌ని అనుకుంటాడు మురారి.

కానీ మురారిని ఇబ్బంది పెట్ట‌డం ఇష్టం లేక త‌న‌కే ఆరోగ్యం బాగాలేద‌ని రేవ‌తితో అబ‌ద్ధం చెబుతాన‌ని కృష్ణ అంటుంది. మోహంలోత‌న ప‌క్క‌న భార్య‌గా కూర్చోవ‌డం కృష్ణ‌కు ఇష్టం లేద‌ని మురారి అపోహ‌ప‌డ‌తాడు. ఆ త‌ర్వాత కృష్ణ‌తో మాట్లాడాల‌ని ఆమెను వెతుక్కుంటూ మురారి వ‌స్తాడు. కానీ అక్క‌డ ముకుంద ఉంటుంది. ఆమెను చూసి మురారి కంగారుగా వెళ్లిపోవ‌డానికి సిద్ధ‌మ‌వుతాడు.

కానీ ముకుంద అత‌డిని ఆపేస్తుంది. నువ్వు ఆద‌ర్శ్‌ను పెళ్లి చేసుకోవ‌డానికి ముందు ఎవ‌రినైనా ప్రేమించావా అని ముకుంద‌ను కృష్ణ అడుగుతుంది. అందుకు అవున‌ని ముకుంద స‌మాధాన‌మిస్తుంది. తాను ప్రేమించిన వాడు ఇక్క‌డే ఉన్నాడ‌ని అంటుంది. ఆమె మాట‌ల‌తో మురారి షాక్ అవుతాడు. అక్క‌డితో నేటి కృష్ణ ముకుంద మురారి సీరియ‌ల్ ముగిసింది.

Whats_app_banner