తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Shah Rukh Khan Fan : షారూఖ్ అన్నా.. కావాలంటే ఓ వంద రూపాయలు ఎక్కువ తీసుకో

Shah Rukh Khan Fan : షారూఖ్ అన్నా.. కావాలంటే ఓ వంద రూపాయలు ఎక్కువ తీసుకో

Anand Sai HT Telugu

08 May 2023, 13:46 IST

    • Jawan Release Date : జవాన్ రిలీజ్ డేట్ వాయిదా పడిందని కొందరు అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఓ నెటిజన్ ట్విటర్‌లో షారూఖ్‌కు వెరైటీగా అభ్యర్థన చేశాడు.
షారూఖ్ ఖాన్
షారూఖ్ ఖాన్

షారూఖ్ ఖాన్

'పఠాన్' సినిమా విజయం తర్వాత నటుడు షారూఖ్ ఖాన్(Shah Rukh Khan) మళ్లీ ఫామ్‌లోకి వచ్చాడు. రాబోయే సినిమాలపై భారీ అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం షారూక్‌ 'జవాన్‌' చిత్రంతో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. విడుదల తేదీని ప్రకటిస్తూ కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. సెప్టెంబర్ 7న 'జవాన్' థియేటర్లలోకి రానుందని ప్రకటించారు.

ట్రెండింగ్ వార్తలు

The Boys 4 OTT: సూపర్ హీరోలపై సెటైరికల్‌, వయెలెంట్ సిరీస్- ఓటీటీలోకి ది బాయ్స్ 4- 6 భాషల్లో స్ట్రీమింగ్- ఎక్కడంటే?

Vijay Deverakonda: ఫ్యామిలీస్టార్ డిజాస్ట‌ర్...అయినా విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో దిల్‌రాజు మ‌రో మూవీ - ఈ సారి మాస్ క‌థ‌

Lineman OTT: ఎట్టకేలకు ఓటీటీలోకి వచ్చిన విలేజ్ కామెడీ డ్రామా.. సైలెంట్‌గా స్ట్రీమింగ్.. అంతలోనే ట్రెండింగ్.. ఎక్కడంటే?

OTT Releases: ఓటీటీలోకి ఒక్కరోజే 8 సినిమాలు- 3 మాత్రమే స్పెషల్- రెండు బోల్డ్, మరొకటి క్రైమ్ థ్రిల్లర్- ఎక్కడ చూస్తారంటే?

జవాన్‌ చిత్రానికి అట్లీ కుమార్‌(Atlee Kumar) దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రంలో షారూఖ్‌తో పాటు నయనతార, విజయ్ సేతుపతి(Vijay Sethupathi), దీపికా పదుకొణె నటిస్తున్నారు. సినిమా కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. అన్నీ అనుకున్నట్లు జరిగితే జూన్ 2న 'జవాన్' విడుదల కావాల్సింది. కానీ కొన్ని కారణాల వల్ల ఈ సినిమా రిలీజ్ డేట్ సెప్టెంబర్ 7కి వాయిదా పడింది. ఇది కొంతమంది అభిమానులను కలవరపరిచింది. విడుదల తేదీని ప్రకటించిన తర్వాత ట్విట్టర్లో అభిమానులతో షారూక్ ముచ్చటించాడు. ఈ సందర్భంగా ఓ అభిమాని విచిత్రమైన అభ్యర్థనను పెట్టాడు.

‘జవాన్‌’ విడుదల తేదీ వాయిదా పడిందని ఆవేదన చెందిన ఓ అభిమాని ట్విట్టర్‌లో షారూక్‌ ఖాన్‌ను ప్రత్యేకంగా అభ్యర్థించాడు. అన్నా.. కావాలంటే 100, 200 రూపాయలు ఎక్కువ తీసుకో.. కానీ జవాన్ సినిమాను త్వరగా విడుదల చేయాలని కోరాడు. దానికి షారూక్ ఖాన్ బదులిస్తూ.. ఓటీటీ సబ్‌స్క్రిప్షన్ కూడా ఇంత తక్కువకు లేదు. మొత్తం పిక్చర్ కావాలా? అంటూ బదులిచ్చాడు.

జవాన్ చిత్రాన్ని(Jawan Movie) షారూక్ ఖాన్ హోమ్ బ్యానర్ 'రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్' నిర్మిస్తోంది. ఈ సినిమాలో షారూక్ భార్య గౌరీ ఖాన్ పెట్టుబడి పెట్టారు. తమిళ చిత్ర పరిశ్రమలో ఎన్నో సూపర్ హిట్ సినిమాలను అందించిన అట్లీ కుమార్ తో షారూఖ్ ఖాన్ తొలిసారి చేతులు కలపడంతో సినిమాపై హైప్ బాగా పెరిగింది. ఈ సినిమా షూటింగ్ దేశంలోని వివిధ నగరాల్లో జరిగింది.

టాపిక్

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.