Shah Rukh Khan : సెల్ఫీ అడిగితే కోపమా? షారూఖ్ ఖాన్ పై ఫ్యాన్స్ ఫైర్-shah rukh khan refuses to click selfie with fan at mumbai airport pushes his hand away video goes viral ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Shah Rukh Khan Refuses To Click Selfie With Fan At Mumbai Airport Pushes His Hand Away Video Goes Viral

Shah Rukh Khan : సెల్ఫీ అడిగితే కోపమా? షారూఖ్ ఖాన్ పై ఫ్యాన్స్ ఫైర్

Anand Sai HT Telugu
May 03, 2023 12:56 PM IST

Shah Rukh Khan Shocking Reaction : ఎయిర్‌పోర్టులో ఓ అభిమానితో షారుఖ్ ప్రవర్తించిన తీరుపై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సెల్ఫీ అడిగితే అంత కోపం ఎందుకు అని ప్రశ్నిస్తున్నారు.

షారూఖ్ ఖాన్ షాకింగ్ రియాక్షన్
షారూఖ్ ఖాన్ షాకింగ్ రియాక్షన్

పఠాన్ విజయంతో షారూఖ్ ఖాన్(Shah Rukh Khan) ఫుల్ ఖుషీగా ఉన్నాడు. వరుస పరాజయాల తర్వాత షారూక్ పఠాన్ ద్వారా పెద్ద విజయాన్ని అందుకున్నాడు. పరాజయాల సుడిగుండంలో ఉన్న షారూఖ్ కొన్నాళ్లు సినిమాలు చేయడం మానేశాడు. ఇప్పుడు మళ్లీ చాలా సినిమాల్లో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం రెండు సినిమాల్లో నటిస్తున్నాడు. చాలా బిజీగా ఉండే షారూఖ్ ఖాన్ ఇటీవల ఎయిర్‌పోర్ట్‌(Air Port)లో కనిపించాడు. ఎయిర్‌పోర్టు నుంచి బయటకు వస్తున్న షారూక్‌ను చూసేందుకు అభిమానులు ఎగబడ్డారు. తమ అభిమాన నటుడితో సెల్ఫీలు దిగేందుకు ముందుకు వచ్చారు. అయితే షారూక్ ప్రవర్తించిన తీరు అభిమానులకు విసుగు తెప్పించింది.

షారూఖ్‌ ఖాన్‌ ఎయిర్‌పోర్టు నుంచి బయటకు రాగానే సెల్ఫీ దిగేందుకు ఓ అభిమాని మొబైల్‌తో వచ్చాడు. తర్వాత షారూక్ అతడిని తోసుకుంటూ ముందుకు కదిలాడు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియా(Social Media)లో వైరల్‌గా మారింది. షారూక్ తీరుపై అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. సెల్ఫీ అడిగితే అంత ఎందుకు కోపం అని ప్రశ్నిస్తున్నారు. సినిమా విడుదలకు ముందు మాత్రమే అభిమానులు కావాలా అని అడుగుతున్నారు. సెల్ఫీ ఇస్తే ఏమై ఉండేదో అంటున్నారు నెటిజన్లు. ఇలాంటి ప్రవర్తన అవసరం లేదంటున్నారు.

సెల్ఫీ అడిగిన వ్యక్తిని తోసేసి... సీరియస్‌గా స్టైలిష్ లుక్‌లో షారూక్ ఎయిర్‌పోర్టు నుంచి బయటకొచ్చాడు. బ్లాక్ అండ్ బ్లాక్ లుక్‌లో కనిపిస్తున్నాడు. ఎప్పుడూ స్టైలిష్ గా కనిపించే షారూఖ్ పఠాన్ సక్సెస్ తర్వాత మరింత స్టైలిష్ గా మారాడు. సినిమా షూటింగ్స్(Cinema Shootings) మధ్య మధ్యలో ఐపీఎల్‌తో బిజీగా ఉన్నాడు.

షారూఖ్ ఖాన్ ప్రస్తుతం ప్రముఖ దర్శకుడు రాజ్‌కుమార్ హిరానీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న డుంకీ చిత్రంలో నటిస్తున్నాడు. తాప్సీ పన్నుతో నటిస్తున్నాడు. తొలిసారిగా తాప్సీతో స్క్రీన్ షేర్ చేసుకుంటున్నాడు. ఈ సినిమాతో పాటు అట్లీ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న జవాన్(Jawan) సినిమాలో కూడా షారూఖ్ నటిస్తున్నాడు. నయనతార ఈ సినిమాలో నటిస్తోంది.

IPL_Entry_Point