తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Lineman Ott: ఎట్టకేలకు ఓటీటీలోకి వచ్చిన విలేజ్ కామెడీ డ్రామా.. సైలెంట్‌గా స్ట్రీమింగ్.. అంతలోనే ట్రెండింగ్.. ఎక్కడంటే?

Lineman OTT: ఎట్టకేలకు ఓటీటీలోకి వచ్చిన విలేజ్ కామెడీ డ్రామా.. సైలెంట్‌గా స్ట్రీమింగ్.. అంతలోనే ట్రెండింగ్.. ఎక్కడంటే?

Sanjiv Kumar HT Telugu

04 May 2024, 12:07 IST

google News
  • Lineman Movie OTT Streaming: ఓటీటీలోకి ఎప్పుడూ ఏ సినిమా ఎలా వస్తుందో చెప్పలేం. మొన్నటి వరకు కన్నడ లోకల్ ఓటీటీలో స్ట్రీమింగ్ అయిన విలేజ్ బ్యాక్ డ్రాప్ కామెడీ మూవీ ఇప్పుడు సైలెంట్‌గా తెలుగు ఓటీటీలోకి వచ్చేసింది. మరి లైన్ మ్యాన్ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ వివరాల్లోకి వెళితే..

ఎట్టకేలకు ఓటీటీలోకి వచ్చిన విలేజ్ కామెడీ డ్రామా.. సైలెంట్‌గా స్ట్రీమింగ్.. అంతలోనే ట్రెండింగ్.. ఎక్కడంటే?
ఎట్టకేలకు ఓటీటీలోకి వచ్చిన విలేజ్ కామెడీ డ్రామా.. సైలెంట్‌గా స్ట్రీమింగ్.. అంతలోనే ట్రెండింగ్.. ఎక్కడంటే?

ఎట్టకేలకు ఓటీటీలోకి వచ్చిన విలేజ్ కామెడీ డ్రామా.. సైలెంట్‌గా స్ట్రీమింగ్.. అంతలోనే ట్రెండింగ్.. ఎక్కడంటే?

Lineman OTT Release: ఇటీవల కాలంలో ఓటీటీల సంఖ్య పెరిగిపోవడంతో ఎప్పుడు ఏ సినిమా ఏ డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లోకి వస్తుందో చెప్పడం కష్టంగా మారింది. దేశవ్యాప్తంగా కొన్ని ఓటీటీ స్ట్రీమింగ్ సంస్థలు మాత్రమే ప్రత్యేక ఆదరణ పొందుతున్నాయి. వాటికే నేషనల్, ఇంటర్నేషనల్ వైడ్‌గా మంచి గుర్తింపు ఉంటోంది.

ఇవే కాకుండా కొన్ని ప్రాంతీయ ఓటీటీ సంస్థలు కూడా ఉన్నాయి. అవి కేవలం ఆ రాష్ట్రం, ప్రాంతానికి పరిమితి అవుతున్నాయి. అలా లోకల్ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో మొన్నటి వరకు తెలుగు సినిమా స్ట్రీమింగ్ అయింది. ఆ సినిమా ఇప్పుడు ఎట్టకేలకు తెలుగులో అందుబాటులో ఉండే ఓటీటీ వేదికలో సైలెంట్‌గా దర్శనం ఇచ్చింది.

ఆ సినిమా పేరే లైన్ మ్యాన్. విలేజ్ బ్యాక్ డ్రాప్ కామెడీ జోనర్‌లో లవ్ ఎంటర్టైనర్‌గా వచ్చిన ఈ సినిమా మొన్నటి వరకు కన్నడ లోకల్ ఓటీటీలో ప్రసారం అయింది. అక్కడ తెలుగు, కన్నడ భాషల్లో స్ట్రీమింగ్ అయినట్లు సమాచారం వచ్చింది. కానీ, తెలుగు నటీనటులు యాక్ట్ చేసిన ఈ సినిమా ఇక్కడి ఓటీటీలోకి రాకుండా కన్నడ డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లోకి వెళ్లడం ఒకింత ఆశ్చర్యానికి గురి చేసింది.

అయితే, ఎట్టకేలకు లైన్ మ్యాన్ మూవీ సైలెంట్‌గా అమెజాన్ ప్రైమ్ ఓటీటీలోకి వచ్చేసింది. తెలుగు, కన్నడ భాషల్లో బైలింగువల్‌గా తెరకెక్కిన లైన్ మ్యాన్ సినిమా సడెన్‌గా అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. మే 3 నుంచి అమెజాన్ ప్రైమ్ ఈ సినిమాను ప్రసారం చేస్తున్నట్లు తెలుస్తోంది.

ప్రమోషన్స్ బాగానే చేసినప్పటికీ లైన్ మ్యాన్ సినిమాను థియేటర్లలో చూసేందుకు ప్రేక్షకులు అంతగా ఆసక్తి చూపలేదు. కానీ, ఓటీటీలోకి వస్తే మాత్రం అన్ని రకాల సినిమాలను చూసేందుకు ఇష్టపడుతున్నారు. ఈ క్రమంలోనే లైన్ మ్యాన్ ఓటీటీ స్ట్రీమింగ్ ఇంట్రెస్టింగ్‌గా మారింది. కాబట్టి థియేటర్లలో మిస్ అయిన వాళ్లు ఇప్పుడు లైన్ మ్యాన్ సినిమాను అమెజాన్ ప్రైమ్‌లో ఎంచక్కా ఫ్యామిలీతోపాటు వీక్షించవచ్చు.

లైన్ మ్యాన్ సినిమాలో హీరోగా త్రిగుణ్ అలియాస్ అదిత్ అరుణ్ నటించాడు. సినిమాల్లో సైడ్ రోల్స్ చేస్తూ పాపులర్ అయిన అదిత్ అరుణ్ హీరోగా మారి తన టాలెంట్ నిరూపించుకునేందుకు తహతహలాడుతున్నాడు. త్రిగుణ్ అని పేరు మార్చుకుని చీకటి గదిలో చితక్కొట్టుడు, ప్రేమదేశం, డియర్ మేఘ, 24 కిస్సెస్‌తోపాటు పలు తెలుగు సినిమాల్లో హీరోగా అలరించాడు.

త్రిగుణ్ కన్నడ నాట డెబ్యూతో ఎంట్రీ ఇచ్చిన సినిమానే లైన్ మ్యాన్. చందకావడి అనే ఓ విలేజ్‌లో కరెంట్ తీసేయడం, జాతర వంటి కాన్సెప్ట్‌తో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పెద్దగా ఆదరణ పొందలేదు. కానీ, ఇప్పుడు ఓటీటీలోకి వచ్చిన ఈ సినిమా మంచి రెస్పాన్సే తెచ్చుకుంటోంది. అమెజాన్ ప్రైమ్‌‌తోపాటు ఇండియాలో 8వ స్థానంలో ట్రెండింగ్‌లో దూసుకుపోతోంది.

ఇలా సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చిందో లేదో లైన్ మ్యాన్ మూవీ 8వ స్థానంలో ట్రెండింగ్ అవడం విశేషంగా మారింది. లైన్ మ్యాన్ సినిమాకు వి రఘుశాస్త్రి దర్శకత్వం వహించారు. కాగా లైన్ మ్యాన్ మూవీలో కాజల్ కుందర్ హీరోయిన్‌గా నటిస్తే.. బి. జయశ్రీ కీలక పాత్ర పోషించారు. వీరితోపాటు హరిణి శ్రీకాంత్, నివిక్ష నాయుడు, సుజయ్ శాస్త్రి, అపూర్వ శ్రీ ఇతరులు ముఖ్య పాత్రలు పోషించారు.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం