OTT: ఓటీటీలో 25 లక్షల మంది మెచ్చిన కామెడీ సినిమా.. ఎక్కడ చూస్తారంటే?-my dear donga watched 25 lakh people in aha ott my dear donga ott streaming now my dear donga ott response ott movies ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ott: ఓటీటీలో 25 లక్షల మంది మెచ్చిన కామెడీ సినిమా.. ఎక్కడ చూస్తారంటే?

OTT: ఓటీటీలో 25 లక్షల మంది మెచ్చిన కామెడీ సినిమా.. ఎక్కడ చూస్తారంటే?

Sanjiv Kumar HT Telugu
May 04, 2024 09:32 AM IST

My Dear Donga Returns OTT: ఇటీవల ఓటీటీలో నేరుగా విడుదలై మంచి రెస్పాన్స్ తెచ్చుకున్న కామెడీ సినిమా మై డియర్ దొంగ. ఈ సినిమాకు వస్తున్న రెస్పాన్స్, దీని సీక్వెల్ మై డియర్ దొంగ రిటర్న్స్ తదితర విశేషాలను సినిమా యూనిట్ తాజాగా పంచుకుంది.

ఓటీటీలో 25 లక్షల మంది మెచ్చిన కామెడీ సినిమా.. ఎక్కడ చూస్తారంటే?
ఓటీటీలో 25 లక్షల మంది మెచ్చిన కామెడీ సినిమా.. ఎక్కడ చూస్తారంటే?

My Dear Donga OTT Views: సక్సెస్‌ఫుల్ చిత్రాలతో అలరిస్తున్న అభినవ్ గోమఠం టైటిల్ పాత్రలో నటించిన చిత్రం మై డియర్ దొంగ. శాలినీ కొండెపూడి, దివ్య శ్రీపాద, నిఖిల్ గాజుల, వంశీధర్ గౌడ్, శశాంక్ మండూరి కీలక పాత్రలు పోషించిన ఈ సినిమాకు బీఎస్ సర్వజ్ఞ కుమార్ దర్శకత్వం వహించారు.

క్యామ్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై గోజల మహేశ్వర్‌రెడ్డి నిర్మించిన మై డియర్ దొంగ చిత్రం ప్రముఖ తెలుగు ఓటీటీ మాధ్యమంఆహాలో విడుదలై ఘన విజయం సాధించింది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ సక్సెస్ మీట్ నిర్వహించింది. ఈ సందర్భంగా మై డియర్ దొంగ వ్యూస్, సీక్వెల్ మై డియర్ దొంగ రిటర్న్స్ తదితర ఆసక్తికర విశేషాలను తెలిపారు.

"మై డియర్ దొంగపై మొదటి నుంచి చాలా నమ్మకంగా ఉన్నాం. మా నమ్మకం నిజమైయింది. సినిమా చూసిన వారంతా గొప్ప అభినందిస్తున్నారు. చాలా ఎంజాయ్ చేస్తున్నారు. ముఖ్యంగా అభినవ్ గోమఠం నటనని ఆస్వాదిస్తున్నారు. పరిశ్రమ నుంచి కూడా చాలా మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇంకా సినిమా చూడని ప్రేక్షకులు తప్పకుండా చూడండి. పాజిటివిటీని స్ప్రెడ్ చేయండి" అని నిర్మాత మహేశ్వర్ రెడ్డి కోరారు.

"ఇది నా ఫస్ట్ రిలీజ్. సినిమాకి వచ్చిన రెస్పాన్స్ చాలా ఆనందాన్ని ఇచ్చింది. అభినవ్, శాలినితో వర్క్ చేయడం చాలా అనందంగా ఉంది. ఈ సినిమా నాకు మర్చిపోలేని అనుభూతిని ఇచ్చింది" అని యాక్టర్ నిఖిల్ తెలిపాడు. అన్నారు. "ఈ సినిమా కంటెంట్ చాలా వైరల్ అయింది. ఇందులో ఈ సినిమాకి వచ్చిన రెస్పాన్స్ చాలా ఆనందాన్ని ఇచ్చింది. ఈ సినిమాని ఆదరించిన అందరికీ ధన్యవాదాలు" అని నటి స్నేహల్ చెప్పుకొచ్చింది.

"మై డియర్ దొంగకి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. ప్రేక్షకుల మనసులో మంచి స్థానం సంపాదించుకుంది. ఇది బిగ్ స్మాల్ ఫిల్మ్. ఇప్పటివరకూ 25 లక్షల మంది చూశారు. ఈ సినిమాకి వచ్చిన రెస్పాన్స్ చాలా ఆనందాన్ని ఇచ్చింది. మై డియర్ దొంగ రిటర్న్స్ కోసం ఎదురుచుస్తున్నాం" అని ఆహా మార్కెటింగ్ హెడ్ రాజశేఖర్ అన్నారు.

"ఆహాలో కంటెంట్‌ని ఆదరిస్తున్న ప్రేక్షకులకు ధన్యవాదాలు. మైడియర్ దొంగ చాలా మంచి టీం వర్క్‌తో పాషన్‌తో చేయడం జరిగింది. అభినవ్, శాలిని, టీం అంతా అద్భుతంగా చేశారు. మై డియర్ దొంగ విడుదలైనపటి నుంచి ఇప్పటివరకూ టాప్ ట్రెండింగ్‌లో నడుస్తోంది. మీ అందరి సపోర్ట్ ఇలానే ఉండాలి" అని ఆహా టీం నుంచి శ్రావణి కోరారు.

"ఈ సినిమా మా అందరికీ గొప్ప అవకాశాలు తెచ్చిపెట్టింది. అభినవ్ గారు చాలా సపోర్ట్ చేశారు. ప్రొడక్షన్ డిజైన్ ఝాన్సీ గారు చాలా మంచి లుక్ తీసుకొచ్చారు. అజయ్ అర్సాడా మ్యూజిక్‌తో సినిమాని ఎలివేట్ చేసుకుంటూ వచ్చారు. శాలిని మంచి రచయిత, నటి. వీరందరితో కలసి మళ్లీ వర్క్ చేయాలని ఉంది" అని డైరెక్టర్ బీఎస్ సర్వజ్ఞ కుమార్ చెప్పుకొచ్చారు.

"ఈ సినిమాకి ఇంత మంచి విజయాన్ని ఇచ్చిన ప్రేక్షకులు ధన్యవాదాలు. నాకు ఈ పాత్ర ఇచ్చిన శాలినికి ధన్యవాదాలు. టీం అందరికీ అభినందనలు" అని డైరెక్టర్ అండ్ యాక్టర్ వంశీధర్ గౌడ్ తెలిపారు.

Whats_app_banner