My dear donga ott release date: మై డియర్ దొంగ ఓటీటీ రిలీజ్ డేట్ ఇదే.. ఎందులో చూడాలంటే?-my dear donga ott release date aha ott to stream the movie from april 19th abhinav gomatam movie ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  My Dear Donga Ott Release Date: మై డియర్ దొంగ ఓటీటీ రిలీజ్ డేట్ ఇదే.. ఎందులో చూడాలంటే?

My dear donga ott release date: మై డియర్ దొంగ ఓటీటీ రిలీజ్ డేట్ ఇదే.. ఎందులో చూడాలంటే?

Hari Prasad S HT Telugu
Apr 04, 2024 10:59 PM IST

My dear donga ott release date: అభినవ్ గోమటం నటించిన మూవీ మై డియర్ దొంగ నేరుగా ఓటీటీలోకి వచ్చేస్తోంది. ఈ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ ను గురువారం (ఏప్రిల్ 4) అనౌన్స్ చేశారు.

మై డియర్ దొంగ ఓటీటీ రిలీజ్ డేట్ ఇదే.. ఎందులో చూడాలంటే?
మై డియర్ దొంగ ఓటీటీ రిలీజ్ డేట్ ఇదే.. ఎందులో చూడాలంటే?

My dear donga ott release date: ఓటీటీలోకి నేరుగా మరో కామెడీ మూవీ వస్తోంది. అభినవ్ గోమటం, షాలిని, దివ్య శ్రీపాద నటించిన మై డియర్ దొంగ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ ను ఆహా ఓటీటీ గురువారం (ఏప్రిల్ 4) అనౌన్స్ చేసింది. ఈ మూవీ ఆహా ఒరిజినల్ గా వస్తోంది. బీఎస్ సర్వజ్ఞ కుమార్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాను ఆహా, క్యామ్ ఎంటర్‌టైన్మెంట్ సంయుక్తంగా నిర్మించాయి.

yearly horoscope entry point

మై డియర్ దొంగ ఓటీటీ రిలీజ్ డేట్

మై డియర్ దొంగ మూవీ ఆహా ఓటీటీలో ఏప్రిల్ 19 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని ఆ ఓటీటీ సోషల్ మీడియా ఎక్స్ ద్వారా వెల్లడించింది. "ఎక్కడి దొంగలు అక్కడే ఉండండి.. ఎందుకంటే అసలైన దొంగ ఏప్రిల్ 19న వస్తున్నాడు" అనే క్యాప్షన్ తో ఈ మూవీ స్ట్రీమింగ్ డేట్ ను అనౌన్స్ చేసింది. ఈ సినిమాకు ఇందులోని నటి షాలినీయే స్క్రిప్ట్ అందించడం విశేషం.

గత నెలలోనే మై డియర్ దొంగ టీజర్ రిలీజైంది. ఈ టీజ‌ర్‌లో త‌న కామెడీ టైమింగ్‌తో అభిన‌వ్ గోమ‌టం ఆక‌ట్టుకుంటున్నాడు. ఓ అమ్మాయి ఇంట్లోకి దొంగ‌త‌నం చేయ‌డానికి వ‌చ్చిన యువ‌కుడు అనుకోని ప‌రిస్థితుల్లో అక్క‌డే బందీగా చిక్కుకుపోతే ఏం జ‌రిగింది? దొంగ‌కు, యువ‌తికి మ‌ధ్య ఏర్ప‌డిన స్నేహం ఎలాంటి మ‌లుపులు తిరిగింది అనే అంశాల‌తో టీజ‌ర్ ఫ‌న్నీగా ఉంది. దొంగ‌ను దొంగ‌ అన‌క‌పోతే సందీప్ రెడ్డి వంగా అన‌లా అనే డైలాగ్ టీజ‌ర్‌కు హైలైట్‌గా ఉంది.

ఇదొక రొమాంటిక్ కామెడీ మూవీ. నిజానికి గత నెలలోనే ఈ సినిమా ఓటీటీలోకి వస్తుందని భావించారు. కానీ ఆహా ఓటీటీ మాత్రం ఈ నెల 19న మూవీని స్ట్రీమింగ్ చేయబోతోంది. కామెడీతో పాటు ఈ సినిమాలో అంత‌ర్లీనంగా స్త్రీ సాధికార‌త‌ను తెలియ‌జేసే మంచి మెసేజ్ ఉంటుంద‌ని స‌మాచారం.

సుమంత్ హీరోగా న‌టించిన మ‌ళ్లీరావా మూవీతో న‌టుడిగా మంచి పేరు తెచ్చుకున్నాడు అభిన‌వ్ గోమ‌టం. త‌రుణ్ భాస్క‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఈ న‌గ‌రానికి ఏమైంది సినిమాలో కౌశిక్ పాత్ర‌లో తెలుగు ప్రేక్ష‌కుల్ని త‌న కామెడీతో అల‌రించాడు. విరూపాక్ష‌, మిస్ శెట్టి మిస్ట‌ర్ పొలిశెట్టితో తెలుగులో ప‌లు బ్లాక్‌బ‌స్ట‌ర్ మూవీస్‌లో క‌మెడియ‌న్‌గా క‌నిపించాడు. మ‌స్తు షేడ్స్ ఉన్నాయ్ రా మూవీలో హీరోగా అభిన‌వ్ యాక్టింగ్‌, కామెడీ బాగున్నాయ‌నే ప్ర‌శంస‌లు వచ్చాయి.

ఆహా ఓటీటీ మూవీస్

ఆహా ఓటీటీలో ఈ మధ్య ఇంట్రెస్టింగ్ సినిమాలు వచ్చాయి. అంబాజీపేట మ్యారేజీ బ్యాండుతోపాటు ఈ మధ్యే సుందరం మాస్టర్ సినిమా కూడా స్ట్రీమింగ్ అవుతోంది. అంటు కిస్మత్ అనే మరో కామెడీ కూడా అడుగు పెట్టింది. ఇక త్వరలోనే ప్రేమలు తెలుగు వెర్షన్ కూడా ఇందులోనే రానున్నట్లు సమాచారం.

దీంతో వరుస కామెడీ సినిమాలతో ఆహా ఓటీటీ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఇక ఈ మధ్య మిక్సప్ పేరుతో మరో బోల్డ్ సినిమాను కూడా ఆహా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చిన విషయం తెలిసిందే.

Whats_app_banner