Masthu Shades Unnai Ra OTT: ఓటీటీలోకి అభిన‌వ్ గోమ‌టం లేటెస్ట్ టాలీవుడ్ కామెడీ మూవీ - రిలీజ్ ఎప్పుడంటే?-abhinav gomatam masthu shades unnai ra ott streaming date and platform locked amazon prime video ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Abhinav Gomatam Masthu Shades Unnai Ra Ott Streaming Date And Platform Locked Amazon Prime Video

Masthu Shades Unnai Ra OTT: ఓటీటీలోకి అభిన‌వ్ గోమ‌టం లేటెస్ట్ టాలీవుడ్ కామెడీ మూవీ - రిలీజ్ ఎప్పుడంటే?

Nelki Naresh Kumar HT Telugu
Mar 28, 2024 06:01 AM IST

Masthu Shades Unnai Ra OTT: అభిన‌వ్ గోమ‌టం హీరోగా ఎంట్రీ ఇచ్చిన మ‌స్తు షేడ్స్ ఉన్నాయ్ రా మూవీ ఓటీటీలోకి వ‌చ్చేస్తోంది. అమెజాన్ ప్రైమ్‌లో మార్చి 29 నుంచి ఈ మూవీ స్ట్రీమింగ్ కాబోతోంది.

మ‌స్తు షేడ్స్ ఉన్నాయ్ రా  ఓటీటీ రిలీజ్ డేట్
మ‌స్తు షేడ్స్ ఉన్నాయ్ రా ఓటీటీ రిలీజ్ డేట్

Masthu Shades Unnai Ra OTT: ఈ న‌గ‌రానికి ఏమైంది ఫేమ్‌, టాలీవుడ్ క‌మెడియ‌న్ అభిన‌వ్ గోమ‌టం మ‌స్తు షేడ్స్ ఉన్నాయ్ రా మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఫిబ్ర‌వ‌రి 23న థియేట‌ర్ల‌లో రిలీజైన ఈ మూవీ డీసెంట్ టాక్‌ను సొంతం చేసుకున్న‌ది. అభిన‌వ్ కామెడీ టైమింగ్‌కు ప్ర‌శంస‌లు ద‌క్కాయి. ఔట్ అండ్ ఔట్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెర‌కెక్కిన ఈ సినిమాకు తిరుప‌తి రావు ఇండ్ల ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు.

అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో...

థియేట‌ర్ల‌లో విడుద‌లైన నెల త‌ర్వాత ఈ కామెడీ మూవీ ఓటీటీలోకి వ‌చ్చేస్తోంది. మ‌స్తు షేడ్స్ ఉన్నాయ్ రా అమెజాన్ ప్రైమ్‌లో మార్చి 29 నుంచి స్ట్రీమింగ్ కాబోతోంది. మ‌స్తు షేడ్స్ ఉన్నాయ్ రాలో డైరెక్ట‌ర్ త‌రుణ్ భాస్క‌ర్‌తో పాటు అలీరెజా కీల‌క పాత్ర‌లు పోషించారు. వైశాలి రాజ్ హీరోయిన్‌గా న‌టించింది.

కామెడీకి మెసేజ్‌...

కామెడీకి అంత‌ర్లీనంగా ఓ మెసేజ్‌ను జోడిస్తూ ద‌ర్శ‌కుడు తిరుప‌తిరావు మ‌స్తు షేడ్స్ ఉన్నాయ్ రా మూవీని తెర‌కెక్కించాడు. మ‌నోహ‌ర్ అలియాస్ మ‌ను ఓ పెయింట‌ర్‌. పెయింటింగ్ కు అంత‌గా ఆదాయం లేక‌పోయినా ఆ క‌ళ‌నే న‌మ్ముకొని జీవిస్తుంటాడు. మ‌నుకు ఆదాయం అంతంత మాత్రంగానే కావ‌డంతో పిల్ల‌ను ఇవ్వ‌డానికి ఎవ‌రూ ముందుకు రారు.

ఒక సంబంధం సెటిలైనా పెళ్లికి ముందు రోజే ఆ అమ్మాయి త‌న ప్రియుడిలో లేచిపోతుంది. దాంతో ఊర్లోనే ఫ్లెక్సీ ప్రింటింగ్ బిజినెస్ పెట్టి బాగా డ‌బ్బు సంపాదించాల‌ని మ‌ను అనుకుంటాడు. అప్పు చేసి పెట్టిన ఆ బిజినెస్ మ‌ధ్య‌లోనే ఎందుకు ఆగిపోయింది? ఈ క్ర‌మంలో మ‌ను ఎదుర్కొన్న స‌మ‌స్య‌లు ఏమిటి? మ‌ను జీవితంలోకి వ‌చ్చిన ఉమాదేవి ఎవ‌రు అన్న‌దే మ‌స్తు షేడ్స్ ఉన్నాయ్ రా మూవీ క‌థ‌.

నాలుగు కోట్ల క‌లెక్ష‌న్స్‌...

ఈ చిన్న సినిమా ఫ‌స్ట్ డేనే 1.6 కోట్ల వ‌సూళ్ల‌ను రాబ‌ట్టింది. ఓవ‌రాల్‌తో థియేట్రిక‌ల్ ర‌న్‌లో మ‌స్తు షేడ్స్ ఉన్నాయ్ రా నాలుగు కోట్ల‌కుపైనే కలెక్షన్స్ దక్కించుకున్నట్లు చెబుతోన్నారు. ఈ న‌గ‌రానికి ఏమైంది సినిమాలో అభిన‌వ్ గోమ‌టం మ‌స్తు షేడ్స్ ఉన్నాయ్ రా నీలో అంటూ ఓ డైలాగ్ చెబుతాడు. ఆ డైలాగ్‌నే ఈ మూవీకి టైటిల్ ఫిక్స్ చేసి సినిమాను తెర‌కెక్కించారు

మ‌ళ్లీ రావాతో ఫేమ‌స్‌...

మ‌ళ్లీ రావాతో తెలుగు ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌య‌మ‌య్యాడు అభిన‌వ్ గోమ‌టం. ఈ సినిమాలో సుమంత్ స్నేహితుడిగా చ‌క్క‌టి న‌ట‌న‌ను క‌న‌బ‌రిచాడు. త‌రుణ్ భాస్క‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఈ న‌గ‌రానికి ఏమైంది లో త‌న కామెడీ టైమింగ్‌తో అభిమానుల‌ను న‌వ్వించాడు. హాస్య‌న‌టుడిగా మీకు మాత్ర‌మే చెప్తా, రంగ్‌దే, శ్యామ్ సింగ‌రాయ్‌, విరూపాక్ష‌, మిస్ శెట్టి మిస్ట‌ర్ పొలిశెట్టితో పాటు చాలా సినిమాలు చేశాడు.

మై డియ‌ర్ దొంగ‌...

సేవ్ ది టైగ‌ర్స్ వెబ్‌సిరీస్‌తో ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చాడు అభిన‌వ్ గోమ‌టం, భార్య‌పై ఆధార‌ప‌డి బ‌తికే సోమ‌రిపోతు భ‌ర్త‌గా ఈ సిరీస్‌లో హిలేరియ‌స్‌గా అత‌డి కామెడీ వ‌ర్క‌వుట్ అయ్యింది.

అభిన‌వ్ గోమ‌టం హీరోగా న‌టిస్తోన్న మ‌రో మూవీ మై డియ‌ర్ దొంగ కూడా రిలీజ్‌కు సిద్ధ‌మైంది. థియేట‌ర్ల‌ను స్కిప్ చేస్తూ ఈ మూవీ డైరెక్ట్‌గా ఓటీటీలో రిలీజ్ కాబోతోంది. ఆహా ఓటీటీ ద్వారా ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తోంది.

WhatsApp channel