Bhoothaddam Bhaskar Narayana: ఓటీటీలోకి వచ్చేసిన టాలీవుడ్ సీరియల్ కిల్లర్ మూవీ - స్ట్రీమింగ్ ఎందులో అంటే?
Bhoothaddam Bhaskar Narayana OTT: భూతద్ధం భాస్కర్ నారాయణ మూవీ థియేటర్లలో రిలీజైన 20 రోజుల్లోనే ఓటీటీలోకి వచ్చేసింది. శుక్రవారం ఆహా ఓటీటీలో ఈ మూవీ రిలీజైంది.
Bhoothaddam Bhaskar Narayana OTT: భూతద్దం భాస్కర్ నారాయణ మూవీ థియేటర్లలో విడుదలైన ఇరవై రోజుల్లోనే ఓటీటీలోకి వచ్చేసింది. శుక్రవారం నుంచి ఆహా ఓటీటీలో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. సైకో కిల్లర్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందిన ఈ సినిమాలో శివ కందుకూరి హీరోగా నటించాడు. పురుషోత్తం రాజ్ దర్శకత్వం వహించాడు. మార్చి 1న థియేటర్లలో ఈ మూవీ రిలీజైంది. రిలీజ్‌కు ముందే ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులను ఆహా ఓటీటీ సొంతం చేసుకున్నది. తమిళంలో కూడా ఈ మూవీ స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం.
డిటెక్టివ్‌గా...
సీరియల్ కిల్లర్ కథకు పురాణాల్ని జోడించి దర్శకుడు పురుషోత్తం రాజ్ భూతద్ధం భాస్కర్ నారాయణ సినిమాను తెరకెక్కించాడు. ఈ సినిమాలో శివ కందుకూరి డిటెక్టివ్‌గా నటించాడు. రాశీసింగ్ హీరోయిన్‌గా నటించింది.
భూతద్ధం భాస్కర్ నారాయణ కథ ఇదే...
దిష్టిబొమ్మ హత్య కేసు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారుతుంది. మహిళల్ని హత్య చేస్తోన్న సైకో వారి తలల స్థానంలో దిష్టిబొమ్మలను పెడుతుంటాడు. 17 మంది అమ్మాయిలు చనిపోయిన ఒక్క క్లూ కూడా పోలీసులు సంపాదించలేకపోతారు. కర్ణాటక , ఆంధ్రప్రదేశ్ సరిహద్దు ప్రాంతంలో ఈ దిష్టి బొమ్మ హత్యలు ఎక్కువగా జరుగుతుంటాయి.
ఈ సీరియల్ కిల్లర్‌ను పట్టుకోవడానికి డిటెక్టివ్ భాస్కర్ నారాయణ (శివ కందుకూరి) రంగంలోకి దిగుతాడు. ఆ సీరియల్ కిల్లర్ ఎవరు?నర బలుల పేరుతో అమ్మాయిలను ఆ కిల్లర్ హతమార్చడానికి కారణం ఏమిటి? కిల్లర్ మిస్టరీని సాల్వ్ చేయడంలో లక్ష్మి (రాశీ సింగ్) అనే జర్నలిస్ట్ భాస్కర్ నారాయణకు ఎలా అండగా నిలిచింది? అన్నదే భూతద్ధం భాస్కర్ నారాయణ మూవీ కథ.
కాన్సెప్ట్ బాగుంది కానీ...
సినిమా కాన్సెప్ట్ బాగున్నా కథాగమనం నిదానంగా సాగడం ఈ సినిమాకు మైనస్ అయ్యింది. ఫస్ట్ హాఫ్‌లో పెద్దగా ట్విస్ట్‌లు రాసుకోలేదు దర్శకుడు. వాటివల్ల సినిమా ఆశించిన స్థాయిలో విజయాన్ని సాధించలేకపోయింది. థియేట్రికల్ రిలీజ్‌లో భూతద్ధం భాస్కర్ నారాయణ మూవీ మోస్తారు వసూళ్లను రాబట్టంది. హీరోగా మాత్రం శివ కందుకూరికి ఈ మూవీ మంచి పేరు తెచ్చిపెట్టింది. దర్శకుడిగా పురుషోత్తం రాజ్‌కు ఇదే మొదటి సినిమా. భూతద్ధం భాస్కర్ నారాయణలో దేవిప్రసాద్, అరుణ్, షఫీ, శివన్నారాయణ కీలక పాత్రలు పోషించారు.
నాలుగో మూవీ...
చూసీ చూడంగానే మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు శివ కందుకూరి. గమనం, మను చరిత్ర సినిమాల్లో మాస్ పాత్రల్లో కనిపించాడు. హీరో నాని ప్రొడ్యూస్ చేసిన మీట్‌క్యూట్ వెబ్‌సిరీస్‌లో ప్రధాన పాత్రధారుల్లో ఒకరిగా శివ కందుకూరి కనిపించాడు. భూతద్ధం భాస్కర్ నారాయణ హీరోగా అతడి నాలుగో మూవీ. తెలుగులో కమర్షియల్ సక్సెస్ కోసం శివ కందుకూరి ఎదురుచూస్తున్నాడు. ప్రస్తుతం తెలుగులో ఓ రెండు సినిమాలు చేస్తున్నాడు. రాశిసింగ్ కూడా జయాపజయాలకు అతీతంగా తెలుగులో చక్కటి అవకాశాలను సొంతం చేసుకుంటోంది. భూతద్ధం భాస్కర్ నారాయణ కంటే ముందు తెలుగులో శశి, ప్రేమ్‌కుమార్‌తో పాటు మరికొన్ని సినిమాలు చేసింది.