Bhoothaddam Bhaskar Narayana Review: భూతద్ధం భాస్కర్ నారాయణ రివ్యూ - శివ కందుకూరి సైకో కిల్లర్ మూవీ ఎలా ఉందంటే?
Bhoothaddam Bhaskar Narayana Review: శివ కందుకూరి హీరోగా క్రైమ్ థ్రిల్లర్ కథతో తెరకెక్కిన భూతద్ధం భాస్కర్ నారాయణ మూవీ ఈ శుక్రవారం థియేటర్ల ద్వారా ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సినిమాకు పురుషోత్తం రాజ్ దర్శకత్వం వహించాడు.
Bhoothaddam Bhaskar Narayana Review: శివ కందుకూరి, రాశీసింగ్ జంటగా నటించిన భూతద్ధం భాస్కర్ నారాయణ మూవీ శుక్రవారం థియేటర్లలో రిలీజైంది. ఈ సినిమాకు పురుషోత్తం రాజ్ దర్శకత్వం వహించాడు. క్రైమ్ థ్రిల్లర్ జోనర్‌లో రూపొందిన ఈ మూవీ ఎలా ఉందంటే...

దిష్టి బొమ్మల హత్యలు...
దిష్టిబొమ్మ హత్య కేసులు పోలీసులకు ఛాలెంజింగ్‌గా మారుతుంది. మహిళల హత్య చేస్తోన్న సైకో వారి తలల స్థానంలో దిష్టిబొమ్మలను పెడుతుంటాడు. 17 మంది అమ్మాయిలు చనిపోయిన ఒక్క క్లూ కూడా పోలీసులు సంపాదించలేకపోతారు. కర్ణాటక , ఆంధ్రప్రదేశ్ సరిహద్దు ప్రాంతంలో ఈ హత్యలు ఎక్కువగా జరుగుతుంటాయి. ఈ సీరియల్ కిల్లర్‌ను పట్టుకోవడానికి డిటెక్టివ్ భాస్కర్ నారాయణ (శివ కందుకూరి) రంగంలోకి దిగుతాడు. ఆ సైకో కిల్లర్ ఎవరు? అమ్మాయిలనే ఓ కిల్లర్ ఎందుకు హత్యలు చేస్తున్నాడు? ఈ కేసును సాల్వ్ చేయడంలో లక్ష్మి (రాశీ సింగ్) అనే జర్నలిస్ట్ భాస్కర్ నారాయణకు ఎలా అండగా నిలిచింది? అన్నదే ఈ మూవీ కథ.
సైకో కిల్లర్ కథ...
క్రైమ్ థ్రిల్లర్ కథకు డివోషనల్ పాయింట్ టచ్ చేస్తూ దర్శకుడు పురుషోత్తం రాజ్ భూతద్ధం భాస్కర్ నారాయణ మూవీని తెరకెక్కించాడు. సైకో కిల్లర్ కథల్లో హంతుకుడు ఎవరు అన్నది చివరి వరకు రివీల్ కాకుండా స్క్రీన్‌ప్లే రాసుకోవడం ముఖ్యం. విలన్ విషయంలో ట్విస్ట్ ఎంత స్ట్రాంగ్‌గా ఉంటే ఈ సినిమాలు అంతగా ప్రేక్షకుల్ని మెప్పిస్తాయి. భూతద్ధం భాస్కర్ నారాయణ సినిమా విషయంలో దర్శకుడు కొంత వరకు సక్సెస్ అయ్యాడు. క్రైమ్ థ్రిల్లర్ కథకు పురాణాలతో ముడిపెట్టడం బాగుంది. ఈ దిష్టి బొమ్మ హత్యలు నరబలులు అంటూ హీరో రివీల్ చేసే మలుపు ఆసక్తిని పంచుతుంది.
డిటెక్టివ్ హడావిడి...
చిన్నతనం నుంచి డిటెక్టివ్ కావాలనే తపించే హీరో చైల్డ్ వుడ్ ఎపిసోడ్స్ తోనే భూతద్ధం భాస్కర్ నారాయణ మూవీ మొదలవుతుంది. థ్రిల్లర్ స్టోరీలో తండ్రీ కొడుకుల డ్రామాతో దర్శకుడు ఫస్ట్ హాఫ్‌లో కొన్ని చోట్ల నవ్వించాడు. తనను డిటెక్టివ్‌గా జనాలు నమ్మకం కోసం శివ కందుకూరి చేసే హడావిడి వర్కవుట్ అయ్యింది.
సీరియల్ కిల్లింగ్స్ తెరపైకి వచ్చిన తర్వాత అసలు కథ మొదలవుతుంది. ఎలాంటి క్లూ లేని ఈ కేసులో ఒక్కో ఆధారాన్ని భాస్కర్ నారాయణ ఛేదించుకుంటూవెళ్లడం, చివరకు హంతకుడు ఎవరు అన్నది కనిపెట్టే సీన్స్ గ్రిప్పింగ్‌గా అనిపిస్తాయి. క్షీరసాగరమథనం బ్యాక్‌డ్రాప్‌లో వచ్చే పురాణాల స్టోరీ, మహా యాగం ఎపిసోడ్ రాసుకున్న విధానం బాగుంది.
ఫస్ట్ హాఫ్ మైనస్...
ఫస్ట్ హాఫ్ సినిమాకు మైనస్‌గా అనిపిస్తుంది. అసలు కథలోని వెళ్లడానికి దర్శకుడు చాలా టైమ్ తీసుకున్నాడు. ఆ సీన్స్ మొత్తం రొటీన్‌గా నడిపించాడు. సీరియల్ కిల్లర్ బ్యాక్ డ్రాప్ మరికొంత బలంగా రాసుకుంటే బాగుండేది.
శివ కందుకూరి నాచుల్ యాక్టింగ్…
డిటెక్టివ్ భాస్కర్ నారాయణ శివ కందుకూరి నటన బాగుంది. గత సినిమాలతో పోలిస్తే నటుడిగా పరిణితి కనబరిచాడు. నాచురల్ యాక్టింగ్ తో పర్వాలేదనిపించాడు. రిపోర్టర్ లక్ష్మీ పాత్రలో చేసిన రాశి సింగ్ కనిపించింది. పాత్ర నిడివి తక్కువే అయినా ఉన్నంతంలో మెప్పించింది. శ్రీచరణ్ పాకాల నేపధ్య సంగీతం ఈ సినిమాకు ప్లస్ పాయింట్‌గా నిలిచింది.
క్రైమ్ థ్రిల్లర్ జోనర్‌లో..
భూతద్ధం భాస్కర్ నారాయణ క్రైమ్ థ్రిల్లర్ జోనర్ సినిమాలను ఇష్టపడే ఆడియెన్స్‌ను మెప్పిస్తుంది. చిన్న సినిమా నిర్మాణ విలువలు బాగున్నాయి.
రేటింగ్: 2.75/5
టాపిక్