My Dear Donga OTT Streaming: ఓటీటీలోకి ఈ నగరానికి ఏమైంది కమెడియన్ మూవీ - మై డియర్ దొంగ స్ట్రీమింగ్ ఎందులో అంటే?
My Dear Donga OTT Streaming: ఈ నగరానికి ఏమైంది ఫేమ్ అభినవ్ గోమటం ప్రధాన పాత్రలో నటిస్తోన్న మై డియర్ దొంగ మూవీ డైరెక్ట్‌గా ఓటీటీలో రిలీజ్ కాబోతోంది. ఆహా ద్వారా ఓటీటీ ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తోంది.
My Dear Donga OTT Streaming: ఈ నగరానికి ఏమైంది ఫేమ్ అభినవ్ గోమటం హీరోగా నటిస్తోన్న మై డియర్ దొంగ మూవీ డైరెక్ట్‌గా ఓటీటీలో రిలీజ్ అవుతోంది. రొమాంటిక్ ఎంటర్‌టైనర్ మూవీ ఆహా ఓటీటీలో రిలీజ్ కాబోతోంది. ఇందులో అభినవ్ గోమటంతో పాటు శాలిని కొండెపూడి హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు.
మై డియర్ దొంగ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను ఆహా ఓటీటీ ట్విట్టర్‌లో షేర్ చేసింది. అడవి దొంగ విన్నారు. టక్కరి దొంగ విన్నారు. జేబు దొంగ విన్నారు. కానీ మై డియర్ దొంగ ఎవరో తెలియాలంటే త్వరలో ఆహా ఓటీటీలో చూడాల్సిందే అంటూ ఈ పోస్టర్ క్యాప్షన్ జోడించారు.ఈ పోస్టర్‌లో డోర్ చాటుకూ దాక్కొని అభినవ్ గోమఠం కనిపిస్తున్నాడు. శాలిని దేనినో చూసి షాక్ అవుతోన్నట్లుగా పోస్టర్‌లో కనిపిస్తోంది. త్వరలో ఈ మూవీ స్ట్రీమింగ్ ఉంటుందని ఆహా ప్రకటించింది.
ఈ జనవరి నెలాఖరున మై డియర్ దొంగ ఓటీటీ ఆడియెన్స్ ముందుకు వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. త్వరలోనే రిలీజ్ డేట్‌ను అఫీషియల్‌గా అనౌన్స్ చేయబోతున్నట్లు తెలిసింది.
అన్నపూర్ణ స్టూడియోస్...
మై డియర్ దొంగ మూవీకి సర్వజ్ఞ కుమార్ దర్శకత్వం వహిస్తున్నాడు. అన్నపూర్ణ స్టూడియోస్ సంస్థ ప్రజెంటర్‌గా వ్యవహరిస్తోన్న ఈ సినిమాను మహేశ్వర్ రెడ్డి నిర్మించాడు. మై డియర్ దొంగలో హీరోయిన్‌గా నటిస్తూనే ఈ సినిమాకు రైటర్‌గా వ్యవహరించింది శాలిని కొండెపూడి. అజయ్ అరసాడా మ్యూజిక్ అందించాడు. డైరెక్ట్‌గా ఆహా ఒరిజినల్ మూవీగానే మై డియర్ దొంగను రూపొందించినట్లు సమాచారం. ఇందులో అభినవ్, శాలిని పాత్రలు వినోదాత్మకంగా సాగుతాయని యూనిట్ చెబుతోన్నారు.
మళ్లీరావాతో...
మళ్లీరావాతో అభినవ్ గోమటం టాలీవుడ్‌లో ఫేమస్ అయ్యాడు. ఇందులో సుమంత్ స్నేహితుడిగా అతడి నటనకు మంచి మార్కులు పడ్డాయి. తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో రూపొందిన ఈ నగరానికి ఏమైంది సినిమాలో కౌశిక్ పాత్రలో అభినవ్ తన కామెడీ టైమింగ్‌తో ఆకట్టుకున్నాడు. హిలేరియస్‌గా అతడి క్యారెక్టర్ నవ్వించింది. కమెడియన్‌గా ఈ నగరానికి ఏమైంది అభినవ్‌కు మంచి పేరు తెచ్చిపెట్టిన ఆశించిన మేర అవకాశాలు మాత్రం దక్కలేదు, మీకు మాత్రమే చెప్తా, శ్యామ్ సింగరాయ్‌తో పాటు పలు సినిమాలు చేశాడు.
గత ఏడాది బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన విరూపాక్షలో కూడా హీరో సాయిధరమ్‌తేజ్ స్నేహితుడిగా అభినవ్ కనిపించాడు. సేవ్ ది టైగర్స్ సిరీస్‌తో ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చాడు. మహి వి రాఘవ్ క్రియేటర్‌గా వ్యవహరించిన ఈ సిరీస్‌కు సెకండ్ సీజన్ కూడా రాబోతోంది.
చూసీ చూడంగానే మూవీతో...
మరోవైపు చూసీ చూడంగానే సినిమాతో హీరోయిన్‌గా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది శాలిని కొండెపూడి. జయమ్మ పంచాయతీలో నటించింది. మై డియర్ దొంగతోనే ఆమె రైటర్‌గా మారింది. అల్లుడు గారు అనే వెబ్‌సిరీస్‌లో నటించింది.