Masthu Shades Unnai Ra: ఒత్తిడి ఉండేదన్న కమెడియన్ అభినవ్ గోమఠం.. కన్నీళ్లు పెట్టుకున్న నిర్మాత-masthu shades unnai ra producer emotional at success meet and abhinav gomatam speech ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Masthu Shades Unnai Ra: ఒత్తిడి ఉండేదన్న కమెడియన్ అభినవ్ గోమఠం.. కన్నీళ్లు పెట్టుకున్న నిర్మాత

Masthu Shades Unnai Ra: ఒత్తిడి ఉండేదన్న కమెడియన్ అభినవ్ గోమఠం.. కన్నీళ్లు పెట్టుకున్న నిర్మాత

Sanjiv Kumar HT Telugu
Feb 26, 2024 12:07 PM IST

Masthu Shades Unnai Ra Producer Emotional: కమెడియన్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అభినవ్ గోమఠం హీరోగా నటించిన సినిమా మస్తు షేడ్స్ ఉన్నాయ్‌ రా. తాజాగా మస్తు షేడ్స్ ఉన్నాయ్‌ రా సక్సెస్ మీట్ జరిగింది. ఈ కార్యక్రమంలో మూవీ నిర్మాత భవానీ కాసుల కన్నీళ్లు పెట్టుకున్నారు.

ఒత్తిడి ఉండేదన్న కమెడియన్ అభినవ్ గోమఠం.. కన్నీళ్లు పెట్టుకున్న నిర్మాత
ఒత్తిడి ఉండేదన్న కమెడియన్ అభినవ్ గోమఠం.. కన్నీళ్లు పెట్టుకున్న నిర్మాత

Abhinav Gomatam: ఈ న‌గ‌రానికి ఏమైంది, మీకు మాత్ర‌మే చెబుతా సినిమాల్లో సేవ్ ది టైగ‌ర్స్ వెబ్ సిరీస్‌లో క‌మెడియ‌న్‌గా పాపులారిటీ సంపాందించుకుని, త‌న‌కంటూ ఓ మార్క్‌ను క్రియేట్ చేసుకున్న న‌టుడు అభిన‌వ్ గోమ‌ఠం. అయితే, ఈ న‌గ‌రానికి ఏమైంది సినిమాలో అభినవ్ గోమఠం చెప్పిన మస్తు షేడ్స్ ఉన్నాయ్ రా.. అబ్బా.. అనే డైలాగ్ ఎంత పాపులర్ అయిందో తెలిసిందే. దానిపై సోషల్ మీడియాలో మీమ్స్ కూడా వస్తుంటాయి. అదే డైలాగ్‌ను మన ఫ్రెండ్స్‌కు కూడా వాడుతుంటాం.

అలాంటి పాపుల‌ర్ డైలాగ్‌తో అభినవ్ గోమఠం హీరోగా రూపొందిన సినిమానే మ‌స్తు షేడ్స్ ఉన్నాయ్ రా. ఇందులో అభినవ్ గోమఠంకు జోడీగా వైశాలి రాజ్ హీరోయిన్‌‌గా నటించింది. సినిమాను కాసుల క్రియేటివ్ వ‌ర్క్స్ ప‌తాక‌ంపై భ‌వాని కాసుల‌, ఆరెమ్ రెడ్డి, వి. ప్ర‌శాంత్‌ నిర్మించారు. మస్తు షేడ్స్ ఉన్నాయ్ రా సినిమాకు తిరుప‌తి రావు ఇండ్ల ద‌ర్శ‌క‌త్వం వహించారు. ఈ సినిమా ఇటీవల ఫిబ్ర‌వ‌రి 23న ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుద‌ల అయింది.

క్లీన్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా మస్తు షేడ్స్ ఉన్నాయ్ రా మూవీ ప్రేక్ష‌కుల ఆద‌ర‌ణ‌తో విజ‌యంవంత‌గా ప్ర‌దర్శింప‌బ‌డుతోంది. ఈ సంద‌ర్భంగా చిత్ర యూనిట్ ఆదివారం (ఫిబ్రవరి 25) థ్యాంక్స్ మీట్‌ను ఏర్పాటు చేసింది. చిన్న సినిమా విడుద‌ల కావాలంటే నేడు ఎంతో క‌ష్టమ‌ని, ఈ సినిమా గురించి ఎన్నో అటుపోటులు ఎదుర్కొన్నాన‌ని, నేడు సినిమా విడుద‌లై ప్రేక్ష‌కుల ఆద‌ర‌ణంతో విజ‌యవంతంగా ప్ర‌దర్శింప‌బ‌డుతోంద‌ని, ఇందుకు స‌హ‌క‌రించిన ప్ర‌తి ఒక్క‌రికి నా ధ‌న్య‌వాదాలు అంటూ క‌న్నీటి ప‌ర్యంత‌మయ్యారు నిర్మాత భ‌వాని కాసుల‌.

"మా చిన్న సినిమాకు మీడియా అందిస్తున్న స‌హ‌కారం మ‌రువ‌లేనిది. వాళ్లు భుజాల‌పై మా సినిమాను మోస్తున్నారు. రోజు రోజుకు సినిమా ప‌ట్ల ప్రేక్ష‌కుల ఆద‌ర‌ణ పెరుగుతుంది. త‌ప్ప‌కుండా మా సినిమాను అంద‌రూ చూసి ఎంక‌రైజ్ చేయాల‌ని కోరుకుంటున్నాను" అని డైరెక్టర్ తిరుపతి రావు ఇండ్ల తెలిపారు. "సినిమా విడుద‌ల వ‌ర‌కు ఎంతో ఒత్తిడి ఉండేది. ఫైన‌ల్‌గా సినిమా ప‌ట్ల ప్రేక్ష‌కుల స్పంద‌న చూసి రిలాక్స్ అయ్యాను" అని హీరో, కమెడియన్ అభిన‌వ్ గోమ‌ఠం తెలిపాడు.

హీరో అభిన‌వ్ గోమ‌ఠం ఇంకా మాట్లాడుతూ "నిర్మాత భ‌వాని గారు ఈ సినిమా కోసం ఎంతో క‌ష్ట‌ప‌డ్డారు. అంద‌రి శ్ర‌మ‌కు త‌గిన ప్ర‌తిఫ‌లం లభించింది" అని చెప్పుకొచ్చాడు. ఈ మస్తు షేడ్స్ ఉన్నాయ్ రా థ్యాంక్స్ మీట్‌ స‌మావేశంలో హీరోయిన్ వైశాలి, ర‌చ‌యిత రాధాక్రిష్ణ‌, న‌టులు రోహ‌న్‌ రాయ్‌, మెయిన్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

ఇదిలా ఉంటే మస్తు షేడ్స్ ఉన్నాయ్ రా సినిమాకు విడుదల కంటే ముందు ప్రమోషన్స్ బాగానే నిర్వహించారు. మస్తు షేడ్స్ ఉన్నాయ్ రా మూవీ ట్రైలర్‌ను హీరో నిఖిల్ లాంచ్ చేశాడు. ఆ సమయంలో అభినవ్ గోమఠం చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి. "ఇలాంటి వేడుక‌ల‌కు చాలా సార్లు వ‌చ్చాను. కానీ, ఇప్పుడు ఇది నా వేడుక కాస్త ఒత్తిడిగా ఉంది. ఇది నా లైఫ్‌లో స్పెష‌ల్ మూమెంట్ ఇది. ఈ చిత్ర ద‌ర్శ‌కుడు తిరుప‌తి రావు నాకు ఈ అవ‌కాశం ఇచ్చినందుకు థ్యాంక్స్‌" అని అభినవ్ గోమఠం అన్నాడు.

"నాకు హీరోగా చాలా ఆఫ‌ర్లు వచ్చాయి. కానీ, నాకు త‌గ్గ క‌థ కోసం ఎదురుచూసి ఈ సినిమాను ఎంచుకున్నాను. పాన్ ఇండియా స్టార్ నిఖిల్ నాకు మంచి స్నేహితుడు. ఈ న‌గ‌రానికి ఏమైంది చిత్రంలో నా పాత్ర చూసి నిఖిల్ నాకు ఫోన్ చేసి త‌న సినిమాలో ఆఫ‌ర్ ఇచ్చాడు. నిఖిల్‌తో క‌లిసి స్పై చిత్రంలో క‌లిసి న‌టించాను. ఆ చిత్రం షూటింగ్‌లో నిఖిల్ నాకు క్లోజ్ అయ్యాడు. ఆయ‌న ఈ చిత్రం ట్రైల‌ర్ విడుద‌ల చేయడం ఆనందంగా ఉంది" అని అభినవ్ గోమఠం చెప్పుకొచ్చాడు.

WhatsApp channel