The Village Web Series Review: ది విలేజ్ వెబ్ సిరీస్ రివ్యూ - ఆర్య హాలీవుడ్ ఫ్రీమేక్ సిరీస్ ఎలా ఉందంటే?
The Village Web Series Review: కోలీవుడ్ హీరో ఆర్య తొలి వెబ్‌సిరీస్ ది విలేజ్ అమెజాన్ ప్రైమ్ వీడియో ద్వారా ఓటీటీ ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ హారర్ థ్రిల్లర్ వెబ్‌సిరీస్‌కు మిలింద్ రావ్ దర్శకత్వం వహించాడు. ఈ సిరీస్ ఎలా ఉందంటే?
The Village Web Series Review: కోలీవుడ్ హీరో ఆర్య ఓటీటీలోకి అరంగేట్రం చేస్తూ నటించిన ఫస్ట్ వెబ్‌సిరీస్ ది విలేజ్. హారర్ థ్రిల్లర్ కథాంశంతో రూపొందిన ఈ వెబ్‌సిరీస్‌కు గృహం సినిమా ఫేమ్ మిలింద్‌రావ్ దర్శకత్వం వహించాడు. దివ్య పిల్లై , ఆడుకాలం నరేన్ కీలక పాత్రలు పోషించారు. అమెజాన్ ప్రైమ్‌లో తమిళం, తెలుగు భాషల్లో ఈ సిరీస్ రిలీజైంది. ఆర్య డెబ్యూ వెబ్‌సిరీస్ ఎలా ఉంది? ఈ సిరీస్‌తో డైరెక్టర్ మిలింద్ రావ్ ఆడియెన్స్‌ను భయపెట్టాడా? లేదా? అన్నది తెలియాలంటే కథలోని వెళ్లాల్సిందే.,.
కట్టియాల్ కథ....
కట్టియాల్ అనే ఊరు సునామీ తాకిడి కారణంగా నిర్మానుష్యంగా మారిపోతుంది. ఆ ఊరిలో ఉన్నపాత కెమికల్ ఫ్యాక్టరీలో దయ్యాలు ఉన్నాయనే కథలు ప్రచారంలో ఉంటాయి. ఆ ఫ్యాక్టరీ వైపు వెళ్లిన వాళ్లు ఎవరూ తిరిగి వచ్చిన దాఖలాలు ఉండవు. డాక్టర్ గౌతమ్ (ఆర్య) అతడి భార్య నేహా (దివ్యా పిళ్లై), కూతురు మాయతో కలిసి అనుకోకుండా ఆ ఫ్యాక్టరీ వైపు వస్తాడు.
ఫ్యాక్టరీ ముందు కారు టైర్ పంక్ఛర్ కావడంతో నేహా, మాయలను కారులోనే ఉంచి సహాయం కోసం పక్కనే ఉన్న మరో ఊరికి వస్తాడు గౌతమ్. అతడు తిరిగివచ్చేసరికి నేహా, మాయ కనిపించకుండాపోతారు. వారిని వెతకడానికి కట్టియాల్ ఊరిలోకి గౌతమ్ వెళతాడు.
అతడికి తోడుగా కట్టియాల్ ఊరుతో సంబంధం ఉన్న శక్తి (ఆడుకాలం నరేన్), కరుణాకర్(ముత్తుకుమార్), పీటర్(జార్ట్ మరియన్) అనే ముగ్గురు వ్యక్తులు వస్తారు. మరోవైపు కట్టియాల్‌లోని కెమికల్ ఫ్యాక్టరీలో ఉన్న ఇరవై ఏళ్ల క్రితం దాచిపెట్టిన ఓ శాంపిల్స్ కోసం తన అనుచరుడు జగన్‌తో (తలైవాసల్ విజయ్) పాటు ఫర్హాన్ (జాన్ కొక్కెన్) అనే ప్రైవేట్ సెక్యూరిటీ టీమ్ అక్కడికి పంపిస్తాడు ఫ్యాక్టరీ ఓనర్ ప్రకాష్. నేహా, మాయ అదృశ్యం కావడానికి కారణం ఏమిటి?
నిజంగానే ఆ ఫ్యాక్టరీలో దయ్యాలు ఉన్నాయా? కట్టియాల్‌లో అడుగుపెట్టిన గౌతమ్, శక్తి, కరుణాకరణ్, పీటర్ ప్రాణాలను కాపాడుకోవడానికి అక్కడి వింత ఆకారాలతో ఎలాంటి పోరాటం చేశారు? ఆ వింత ఆకారాలకు గౌతమ్‌తో వచ్చిన శక్తి, కరుణాకర్‌లకు ఉన్న సంబంధం ఏమిటి? శాంపిల్స్ కోసం ఫ్యాక్టరీలో అడుగుపెట్టిన ఫర్హాన్ అండ్ గ్యాంగ్‌కు ఎలాంటి భయానక అనుభవాలు ఎదురయ్యాయి? కట్టియాల్ ఊరు ప్రజలు వింత ఆకారాలతో మారడానికి , ఆ ఫ్యాక్టరీలో ప్రకాష్ తండ్రి జీఎస్ఆర్ (జయప్రకాష్) జరిపిన పరిశోధనలకు ఉన్న సంబంధం ఏమిటి? అన్నదే(The Village Web Series Review) ఈ సిరీస్ కథ.
హాలీవుడ్ ఫ్రీమేక్...
హాలీవుడ్‌లో వచ్చిన హిల్ హావ్ ఐస్, రాంగ్‌టర్న్ లాంటి సినిమాల స్ఫూర్తితో దర్శకుడు ది విలేజ్ కథను రాసుకున్నాడు. ఒక రకంగా ఆ సినిమాలకు ఫ్రీమేక్‌గా ఈ సిరీస్‌ను చెప్పవచ్చు. ఆ హారర్ పాయింట్‌కు మనవైన భావోద్వేగాలు జోడించి ది విలేజ్ సిరీస్‌ను తెరకెక్కించాడు. మొత్తం ఆరు ఎపిసోడ్స్‌తో ఈ సిరీస్(The Village Web Series Review) సాగుతుంది.
స్ట్రెయిన్ నరేషన్‌లో కాకుండా నాన్ లీనియర్ స్క్రీన్‌ప్లే టెక్నిక్‌తో కథను నడిపించాడు. ప్రజెంట్, ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్స్‌తో ఆడియెన్స్‌లో క్యూరియాసిటీని రేకెత్తించాలని అనుకున్నాడు. కథలో గ్రాఫిక్స్‌కు ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తూ హాలీవుడ్ సిరీస్ ఫీల్‌ను ప్రేక్షకులకు అందివ్వాలని దర్శకుడు ప్రయత్నించాడు.
ఫస్ట్ సీన్ గూస్‌బంప్స్...
ఆ ఫ్యాక్టరీ వైపు వచ్చిన కొంతమంది ప్రయాణికులు వింత ఆకారాల చేతిలో దారుణంగా హత్యకు గురయ్యే సీన్‌తోనే సిరీస్(The Village Web Series Review) గూస్‌బంప్స్ ఫీలింగ్ కలిగిస్తుంది. ఆ ఇంటెన్సిటీ, థ్రిల్లింగ్‌ను అసలు కథ ప్రారంభమైన కొద్ది సేపటికే మాయం అవుతుంది. గౌతమ్,, నేహా కట్టియాల్ వైపు వచ్చి చిక్కుల్లో పడటం, వారికి సహాయం చేయడానికి శక్తి, కరుణాకరణ్, పీటర్ వచ్చినట్లుగా కథను మొదలుపెట్టాడు డైరెక్టర్.
మరోవైపు ప్రకాష్‌తో డీల్ కుదుర్చుకున్న ప్రైవేట్ సెక్యూరిటీ టీమ్ కూడా కట్టియాల్ వచ్చినట్లుగా మరో కథ కూడా ప్యారలాల్‌గా రన్ అవుతుంది. ఆ తర్వాత గౌతమ్‌కు ఆ ఊరి చరిత్రను శక్తి చెప్పే సీన్‌తో ఫ్లాష్‌బ్యాక్‌లోకి కథను టర్న్ చేశారు డైరెక్టర్. ఊరి గొడవలు, జీఎస్ఆర్ చేసిన పరిశోధనల కారణంగా ఊరి పెద్ద అమర్ రాజా తో పాటు అతడి అనుచరులు నరమాంసభక్షకులుగా ఎలా మారారన్నది చూపించారు.
అవన్నీ ఎలాంటి ట్విస్ట్, టర్న్‌లు లేకుండా నత్తనడకన సాగుతాయి. గౌతమ్, ఫర్హాన్ టీమ్ ఒకరికొకరు చివరి ఎపిసోడ్‌లోనే కలుస్తారు. ఫ్యాక్టరీలో వింత మనుషులతో ప్రాణాలతో తెగించి పోరాడి హీరో తన ఫ్యామిలీతో బయటకు వచ్చే సీన్‌తో రొటీన్ క్లైమాక్స్‌తో సిరీస్ ఎండ్ అవుతుంది.
నో లాజిక్స్....
హాలీవుడ్ మూవీ హిల్ హావ్ ఐస్ స్ఫూర్తితో సిరీస్‌ను తెరకెక్కించాలనే దర్శకుడు ఆలోచన పూర్తిగా బెడిసికొట్టింది. ఈ పాయింట్‌ను ఇండియన్ నేటివిటీలోకి మార్చడానికి దర్శకుడు రాసుకున్న కథ పేలవంగా ఉంది. అమర్ రాజా తన కొడుకు శక్తిపై పగను పెంచుకోవడానికి సరైన కారణం కనిపించదు. కట్టియాల్ ఊరి ప్రజలు నరమాంసభక్షకులుగా మారే సీన్స్ సిల్లీగా ఉంటాయి.
వింత ఆకారాలతో గౌతమ్, శక్తి, కరుణాకర్ పోరాడే సీన్స్ కామెడీ ఎక్కువ, సీరియస్‌కు తక్కువ అన్నట్లుగా ఉంటాయి. కార్టూన్ ఎపిసోడ్స్‌ను గుర్తుకుతెస్తాయి. ఫర్హాన్ అండ్ గ్యాంగ్ సీన్స్ ఓపికకు పరీక్ష పెడతాయి. ఎన్ని బుల్లెట్స్ తగిలిన చిన్న చీమ కుట్టినట్లుగా ఫీలయ్యే వింత ఆకారంతో ప్రధాన పాత్రధారులందరూ చేసే క్లైమాక్స్ ఫైట్ ఫన్నీగా ఉంటుంది. గ్రాఫిక్స్, విజువల్ ఎఫెక్ట్స్ గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది.
హిల్ హావ్ ఐస్ కాపీ...
విలన్ చేతిలో ఫర్హాన్ అండ్ గ్యాంగ్ హత్యలకు గురయ్యే సీన్స్ కాస్తంత భయపెడతాయి. అవి మినహా ఎక్కడ సిరీస్(The Village Web Series Review) భయపెట్టదు. విలన్ గ్యాంగ్స్ లుక్, క్యారెక్టరైజేషన్స్ మొత్తం హిల్ హావ్ ఐస్‌ను కాపీ కొట్టాడు. గౌతమ్ కూతురు మాయ తో విలన్ గ్యాంగ్ మెంబర్ రిలేషన్ షిప్ సీన్ ఆ సినిమాను గుర్తుకుతెస్తుంది.
ఆర్య సైడ్ క్యారెక్టర్...
ఆర్య ఈ సిరీస్‌కు హీరో అయినా సైడ్ క్యారెక్టర్‌లానే కనిపిస్తాడు. అతడి పాత్రకు పెద్దగా ఇంపార్టెన్స్ లేదు.యాక్టింగ్ పరంగా అతడు చేయడానికి కూడా సిరీస్‌లో ఏం లేనట్లుగా అనిపిస్తుంది. ఆర్య కంటే ఆడుకాలం నరేన్‌కు ఎక్కడ టైమ్ స్క్రీన్‌పై కనిపిస్తాడు.
రియల్ లైఫ్ కపుల్ జాన్ కొక్కేన్, పూజా రామచంద్రన్ యాక్షన్ ప్రధాన పాత్రల్లో నటించారు. . ప్రైవేట్ సెక్యూరిటీ టీమ్ ఛీఫ్‌గా జాన్ కొక్కేన్, అతడి టీమ్‌మేట్ గా పూజా రామచంద్రన్ కనిపిస్తారు. వారి పాత్రలు బిల్డప్ ఎక్కువ బిజినెస్ తక్కువ అన్నట్లుగా సాగుతాయి. వీఎన్ సన్నీ విలనిజం కొంత వరకు మెప్పిస్తుంది. ఆర్య పెయిర్‌గా నటించిన దివ్య పిల్లై ఓ గెస్ట్ రోల్ మాదిరిగానే కనిపిస్తుంది.
The Village Web Series Review - బలమైన ఎమోషన్స్ మిస్...
ది విలేజ్ హాలీవుడ్ ఫ్రీమేక్ సిరీస్ పూర్తిగా నిరాశపరుస్తుంది. మంచి యాక్టర్స్ ఉన్నా బలమైన ఎమోషన్స్‌తో కూడిన కథ లేకపోవడం ఈ సిరీస్‌కు పెద్ద డ్రా బ్యాక్‌గా మారింది. ఆర్యకు డెబ్యూ వెబ్‌సిరీస్‌తో నిరాశే మిగిలింది.
రేటింగ్: 2/5