Movies in Theaters This Week: ఈ వారం బాక్సాఫీస్ బ‌రిలో ఏడు సినిమాలు - తెలుగు, త‌మిళంలో నాగ‌చైత‌న్య‌కు పోటీ లేదుగా-custody to music school telugu movies releasing in theaters this week ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Movies In Theaters This Week: ఈ వారం బాక్సాఫీస్ బ‌రిలో ఏడు సినిమాలు - తెలుగు, త‌మిళంలో నాగ‌చైత‌న్య‌కు పోటీ లేదుగా

Movies in Theaters This Week: ఈ వారం బాక్సాఫీస్ బ‌రిలో ఏడు సినిమాలు - తెలుగు, త‌మిళంలో నాగ‌చైత‌న్య‌కు పోటీ లేదుగా

Nelki Naresh Kumar HT Telugu
May 08, 2023 08:53 AM IST

Movies in Theaters This Week: ఈ వారం థియేట‌ర్ల ద్వారా ఏడు సినిమాలు తెలుగు ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్నాయి. ఆ సినిమాలు ఏవంటే...

నాగ‌చైత‌న్య
నాగ‌చైత‌న్య

Movies in Theaters This Week: ఈ వారం టాలీవుడ్ బాక్సాఫీస్ బ‌రిలో ఏడు సినిమాలు నిల‌వ‌బోతున్నాయి. యాక్ష‌న్‌, లేడీ ఓరియెంటెడ్‌, కామెడీతో పాటు ఢిప‌రెంట్ కాన్సెప్ట్‌ల‌తో కూడిన సినిమాలు తెలుగు ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్నాయి. వీటిలో అంద‌రి దృష్టి నాగ‌చైత‌న్య క‌స్ట‌డీపైనే ఉంది. ఓ నిజాయితీప‌రుడైన పోలీస్ కానిస్టేబుల్ క‌థ‌తో యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ క‌థాంశంతో రూపొందుతోన్న క‌స్ట‌డీ మూవీకి వెంక‌ట్‌ప్ర‌భు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్నాడు. తెలుగుతో పాటు త‌మిళంలో ఒకే రోజు ఈ సినిమా రిలీజ్ కానుంది.

చైతూ కోలీవుడ్ ఎంట్రీ...

ఈ సినిమాతోనే నాగ‌చైత‌న్య కోలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వ‌బోతున్నాడు. తెలుగు, త‌మిళ భాష‌ల్లో క‌లిపి మే 12న రిలీజ్ అవుతోన్న సినిమాల్లో ఇదే భారీ బ‌డ్జెట్ మూవీ కావ‌డం గ‌మ‌నార్హం. చిన్న సినిమాలు, లేడీ ఓరియెంటెడ్ మూవీస్ మాత్ర‌మే రిలీజ్ కానున్న నేప‌థ్యంలో నాగ‌చైత‌న్య‌కు రెండు చోట్ల నుంచి పెద్ద‌గా పోటీ ఉండే అవ‌కాశ‌మే లేద‌ని సినీ వ‌ర్గాలు పేర్కొంటున్నాయి.

క‌స్ట‌డీ సినిమాలో నాగ‌చైత‌న్య‌కు జోడీగా కృతిశెట్టి హీరోయిన్‌గా న‌టిస్తోంది. అర‌వింద్ స్వామి విల‌న్‌గా న‌టిస్తోన్న ఈ సినిమాలో ప్రియ‌మ‌ణి, శ‌ర‌త్‌కుమార్ కీల‌క పాత్ర‌ల‌ను పోషిస్తోన్నారు.

శ్రియా మ్యూజిక్ స్కూల్‌

క‌స్ట‌డీతో పాటు మే 12న శ్రియా మ్యూజిక్ స్కూల్ సినిమా రిలీజ్ కానుంది. మ్యూజిక‌ల్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందుతోన్న ఈ సినిమాకు పాపారావు బియ్యాల ద‌ర్శ‌క‌నిర్మాత‌. శ‌ర్మాన్ జోషి , ప్ర‌కాష్ రాజ్ ప్ర‌ధాన పాత్ర‌ల‌ను పోషిస్తోన్నారు. గ‌త కొన్నేళ్లుగా తెలుగులో స‌రైన హిట్‌లేని శ్రియా ఈ మూవీపై చాలా ఆశ‌ల‌ను పెట్టుకున్న‌ది.

అలాగే సునీల్ భువ‌న‌విజ‌య‌మ్ మూవీ కూడా ఈ వార‌మే థియేట‌ర్ల‌లోకి రాబోతున్న‌ది. కామెడీ థ్రిల్ల‌ర్‌గా రూపొందుతోన్న ఈ మూవీకి య‌ల‌మంద చ‌ర‌ణ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్నాడు. ఈ సినిమాలో వెన్నెల‌కిషోర్‌, శ్రీనివాస‌రెడ్డి ముఖ్య పాత్ర‌ల‌ను పోషిస్తోన్నారు.

నాలుగు చిన్న సినిమాలు...

అలాగే ఐశ్వ‌ర్య‌రాజేష్ ఫ‌ర్హానా, ది స్టోరీ ఆఫ్ ఏ బ్యూటీఫుల్ గ‌ర్ల్‌, పిజ్జా -3 ది మ‌మ్మీ. టీ బ్రేక్ వంటి చిన్న సినిమాలు ఈ వారం థియేట‌ర్ల‌లో సంద‌డి చేయ‌బోతున్నాయి. వీటిలో ఏది బాక్సాఫీస్ వ‌ద్ద నిల‌బ‌డుతుంద‌ని టాలీవుడ్ ప్రేక్ష‌కుల్లో ఆస‌క్తిక‌రంగా మారింది.

IPL_Entry_Point