Ramabanam vs Ugram Collections: ఉగ్రం వర్సెస్ రామబాణం - ఫస్ట్ డే బాక్సాఫీస్ విన్నర్ ఎవరంటే
Ramabanam vs Ugram Collections: గోపీచంద్ రామబాణంతో పాటు అల్లరి నరేష్ ఉగ్రం సినిమాలకు ఫస్ట్ డే వచ్చిన కలెక్షన్స్ ఎంతంటే...
Ramabanam vs Ugram Collections: ఈ శుక్రవారం అల్లరి నరేష్ ఉగ్రంతో పాటు గోపీచంద్ రామబాణం సినిమాలు ప్రేక్షకుల ముందుకొచ్చాయి. ఈ బాక్సాఫీస్ పోరులో కలెక్షన్స్ పరంగా అల్లరి నరేష్ సినిమా కంటే గోపీచంద్ మూవీ ఫస్ట్ డే హయ్యెస్ట్ కలెక్షన్స్ రాబట్టింది. అల్లరి నరేష్ ఉగ్రం సినిమా తొలి రోజు వరల్డ్ వైడ్‌గా కోటి యాభై లక్షల గ్రాస్, 74 వరకు షేర్‌ను రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతోన్నాయి.
నైజాంలో అత్యధికంగా 24 లక్షల వరకు ఉగ్రం సినిమా కలెక్షన్స్ దక్కించుకున్నట్లు తెలిసింది. మరోవైపు గోపీచంద్ రామబాణం మూవీకి తొలి రోజు రెండు కోట్ల యాభై లక్షల వరకు గ్రాస్, కోటి ముప్పై లక్షలకుపైగా షేర్ వచ్చినట్లు ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. నైజాంలో 48 లక్షలు, సీడెల్‌లో 22 లక్షలకుపైగా గోపీచంద్ మూవీ కలెక్షన్స్ దక్కించుకున్నట్లు సమాచారం.
ప్రీ రిలీజ్ బిజినెస్....
రామబాణం ప్రీ రిలీజ్ బిజినెస్ దాదాపు 15 కోట్ల వరకు జరిగినట్లు సమాచారం. ఫస్ట్ డే కలెక్షన్స్ చూస్తుంటే ఈ సినిమా సేఫ్ అవ్వడం కష్టమేనని టాలీవుడ్ వర్గాలు చెబుతోన్నాయి. మరోవైపు ఉగ్రం సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చినా ఆశించిన స్థాయిలో కలెక్షన్స్ రాకపోవడం చిత్ర వర్గాలను కలవరపెడుతోంది.
రామబాణం ఫస్ట్ షో నుంచే నెగెటివ్ టాక్‌ను సొంతం చేసుకున్నది. కథ, కథనాలతో పాటు గోపీచంద్ యాక్టింగ్‌పై విమర్శలొస్తున్నాయి. అయినా మాస్ ప్రేక్షకుల అభిరుచులకు దగ్గరగా ఉన్న కథ కావడంతో ఫస్ట్ డే ఉగ్రం కంటే గోపీచంద్ మూవీ ఎక్కువగా కలెక్షన్స్ రాబట్టిందని అంటున్నారు.
సక్సెస్ కాంబినేషన్స్...
ఉగ్రం సినిమాకు విజయ్ కనకమేడల దర్శకత్వం వహించాడు. నాంది తర్వాత అల్లరి నరేష్, విజయ్ కనకమేడల కాంబినేషన్‌లో రూపొందిన సినిమా ఇది. ఇందులో మిస్సింగ్ కేసుల చిక్కుముడులను విప్పే సీరియస్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో అల్లరి నరేష్ కనిపించాడు.
యాక్షన్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రామబాణం సినిమాను దర్శకుడు శ్రీవాస్ తెరకెక్కించారు. తన కుటుంబానికి ఎదురైన సమస్యలను ఓ మాఫియా డాన్ ఎలా పరిష్కరించాడన్నదేఈ సినిమా కథ. ఈ సినిమాలో విక్కీ భాయ్ అనే మాస్ క్యారెక్టర్‌లో గోపీచంద్ నటించాడు.