Naga Chaitanya Next Movie: మ‌జిలీ కాంబో వ‌న్స్‌మోర్‌- నాగ‌చైత‌న్య 23వ‌ మూవీకి డైరెక్ట‌ర్ ఫిక్స్‌-naga chaitanya to join hands with director shiva nirvana once again ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Naga Chaitanya Next Movie: మ‌జిలీ కాంబో వ‌న్స్‌మోర్‌- నాగ‌చైత‌న్య 23వ‌ మూవీకి డైరెక్ట‌ర్ ఫిక్స్‌

Naga Chaitanya Next Movie: మ‌జిలీ కాంబో వ‌న్స్‌మోర్‌- నాగ‌చైత‌న్య 23వ‌ మూవీకి డైరెక్ట‌ర్ ఫిక్స్‌

Nelki Naresh Kumar HT Telugu
Apr 30, 2023 02:54 PM IST

Naga Chaitanya Next Movie: క‌స్ట‌డీ త‌ర్వాత నాగ‌చైత‌న్య నెక్స్ట్ సినిమా సెట్ అయిన‌ట్లు తెలిసింది. త‌న‌కు బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్ ఇచ్చిన ద‌ర్శ‌కుడితో నాగ‌చైత‌న్య మ‌రో సినిమా చేయ‌బోతున్న‌ట్లు తెలిసింది. ఆ ద‌ర్శ‌కుడు ఎవ‌రంటే...

నాగ‌చైత‌న్య
నాగ‌చైత‌న్య

Naga Chaitanya Next Movie: క‌స్ట‌డీ త‌ర్వాత నాగ‌చైత‌న్య చేయ‌బోయే త‌దుప‌రి సినిమా ఏది? ఈ మూవీ డైరెక్ట‌ర్ ఎవ‌ర‌న్న‌ది అక్కినేని అభిమానుల్లో ఆస‌క్తిక‌రంగా మారింది. తాజాగా ఈ మూవీపై ఓ క్లారిటీ వ‌చ్చిన‌ట్లు తెలుస్తోంది.

నాగ‌చైత‌న్య నెక్స్ట్ మూవీకి శివ‌నిర్వాణ ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌బోతున్న‌ట్లు తెలిసింది. గ‌తంలో వీరిద్ద‌రి కాంబినేష‌న్‌లో వ‌చ్చిన మ‌జిలీ సినిమా క‌మ‌ర్షియ‌ల్ స‌క్సెస్‌గా నిలిచింది. ఈ సూప‌ర్‌హిట్ మూవీ త‌ర్వాత నాగ‌చైత‌న్య‌, శివ‌నిర్వాణ కాంబినేష‌న్ మ‌రోసారి సెట్ అయిన‌ట్లు వార్త‌లు వినిపిస్తోన్నాయి. మ‌జిలీ సినిమాలో నాగ‌చైత‌న్య‌, స‌మంత హీరోహీరోయిన్లుగా న‌టించారు.

విడాకులు తీసుకోవ‌డానికి ముందు వీరిద్ద‌రు క‌లిసి చేసిన సినిమా ఇది. డిఫ‌రెంట్ ల‌వ్‌స్టోరీగా రూపొందిన ఈ మూవీలో నాగ‌చైత‌న్య‌, స‌మంత కెమిస్ట్రీ, యాక్టింగ్ అభిమానుల‌ను ఆక‌ట్టుకున్నాయి. దాదాపు 20 కోట్ల బ‌డ్జెట్‌తో రూపొందిన ఈ మూవీ 60 కోట్ల‌కుపైగా క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టి నిర్మాత‌ల‌కు మూడింత‌ల లాభాల్ని తెచ్చిపెట్టింది. మ‌జిలీతో త‌న‌కు బ్లాక్‌బ‌స్ట‌ర్‌స‌క్సెస్ ఇచ్చిన శివ‌నిర్వాణ‌తో నాగ‌చైత‌న్య త‌న 23వ సినిమా చేయ‌బోతున్న‌ట్లు స‌మాచారం.

శివ‌నిర్వాణ గ‌త సినిమాల త‌ర‌హాలోనే ఫ్యామిలీ ఎమోష‌న్స్‌, ల‌వ్, ఫ‌న్ అంశాల‌ క‌ల‌బోత‌గా ఈ సినిమా ఉండ‌నున్న‌ట్లు చెబుతోన్నారు. త్వ‌ర‌లోనే నాగ‌చైత‌న్య‌, శివ‌నిర్వాణ‌ మూవీపై అఫీషియ‌ల్ అనౌన్స్‌మెంట్ వ‌చ్చే అవ‌కాశం ఉన్న‌ట్లు తెలిసింది. ప్ర‌స్తుతం నాగ‌చైత‌న్య క‌స్ట‌డీ మూవీలో న‌టిస్తోన్నాడు.

వెంక‌ట్‌ప్ర‌భు ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ బైలింగ్వ‌ల్ మూవీ మే 12న రిలీజ్ కానుంది. ఈ సినిమాతోనే నాగ‌చైత‌న్య కోలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వ‌బోతున్నాడు. . మ‌రోవైపు ఖుషి సినిమాతో శివ‌నిర్వాణ బిజీగా ఉన్నాడు. విజ‌య్ దేవ‌ర‌కొండ‌, స‌మంత జంట‌గా న‌టిస్తోన్న ఈ మూవీ సెప్టెంబ‌ర్‌లో రిలీజ్ కానుంది

IPL_Entry_Point