Naga Chaitanya on Custody: క‌స్ట‌డీని తెలుగులో తీసి త‌మిళంలోకి డ‌బ్ చేస్తున్నారా? - క్లారిటీ ఇచ్చిన చైతూ-naga chaitanya says custody is a proper bilingual movie ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Naga Chaitanya Says Custody Is A Proper Bilingual Movie

Naga Chaitanya on Custody: క‌స్ట‌డీని తెలుగులో తీసి త‌మిళంలోకి డ‌బ్ చేస్తున్నారా? - క్లారిటీ ఇచ్చిన చైతూ

Nelki Naresh Kumar HT Telugu
May 02, 2023 12:16 PM IST

Naga Chaitanya on Custody: క‌స్ట‌డీ సినిమాతో మే 12న ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్నాడు అక్కినేని హీరో నాగ‌చైత‌న్య‌. ఈ సినిమా తెలుగులో తెర‌కెక్కించి త‌మిళంలోకి డ‌బ్ చేయ‌బోతున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. ఈ పుకార్ల‌పై నాగ‌చైత‌న్య క్లారిటీ ఇచ్చాడు.

నాగ‌చైత‌న్య‌
నాగ‌చైత‌న్య‌

Naga Chaitanya on Custody: నాగ‌చైత‌న్య హీరోగా న‌టించిన క‌స్ట‌డీ మూవీ మే 12న రిలీజ్ కానుంది. వెంక‌ట్ ప్ర‌భు ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఈ మూవీ తెలుగుతో పాటు అదే రోజు త‌మిళంలోనూ విడుద‌ల‌కాబోతున్న‌ది. ఈ సినిమాతోనే నాగ‌చైత‌న్య కోలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వ‌బోతున్నాడు. కాగా క‌స్ట‌డీ సినిమాను తెలుగులో మాత్ర‌మే షూట్ చేశార‌ని, త‌మిళంలోకి డ‌బ్ చేసి రిలీజ్ చేస్తోన్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది.

ఈ పుకార్ల‌పై క‌స్ట‌డీ ప్ర‌మోష‌న్స్‌లో నాగ‌చైత‌న్య స్పందించాడు. తెలుగులో ఈ సినిమాను తీసి త‌మిళంలోకి డ‌బ్ చేస్తోన్న వార్త‌ల్లో నిజం లేద‌ని అన్నాడు. ప్రాప‌ర్ బైలింగ్వ‌ల్ మూవీ ఇద‌ని, రెండు భాష‌ల ప్రేక్ష‌కుల‌కు అభిరుచుల‌కు త‌గ్గ క‌థ‌తో ఒకేసారి ద‌ర్శ‌కుడు వెంక‌ట్ ప్ర‌భు తెలుగు, త‌మిళ భాష‌ల్లో తెర‌కెక్కించాడ‌ని నాగ‌చైత‌న్య అన్నాడు.

ఈ సినిమాలో నిజం కోసం పోరాడే నిజాయితీప‌రుడైన‌ పోలీస్ ఆఫీస‌ర్ పాత్ర‌లో నాగ‌చైత‌న్య న‌టిస్తోన్నాడు. అత‌డికి జోడీగా కృతిశెట్టి హీరోయిన్‌గా న‌టిస్తోంది.

క‌స్ట‌డీలో విల‌న్‌గా సీనియ‌ర్ హీరో అర‌వింద్ స్వామి క‌నిపించ‌బోతుండ‌గా ప్రియ‌మ‌ణి, శ‌ర‌త్‌కుమార్ కీల‌క పాత్ర‌ల‌ను పోషిస్తోన్నారు. ఈ సినిమాతోనే ద‌ర్శ‌కుడిగా వెంక‌ట్ ప్ర‌భు తెలుగులోకి అరంగేట్రం చేస్తోన్నాడు.

క‌స్ట‌డీ సినిమాకు ఇళ‌య‌రాజాతోపాటు ఆయ‌న త‌న‌యుడు యువ‌న్ శంక‌ర్ రాజా సంగీతాన్ని అందిస్తోన్నారు. ఈ సినిమా ట్రైల‌ర్‌ను మే 5న రిలీజ్ చేయ‌బోతున్నారు.

IPL_Entry_Point