Krithi Shetty First Look in Custody: బంగార్రాజు తర్వాత నాగచైతన్య, కృతిశెట్టి జంటగా నటిస్తోన్న సినిమా కస్టడీ. బైలింగ్వల్‌గా తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో రూపొందుతోన్న ఈ సినిమాకు వెంకట్ ప్రభు దర్శకత్వం వహిస్తున్నాడు. బుధవారం కృతిశెట్టి ఫస్ట్‌లుక్‌ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది.
కస్టడీ సినిమాలో రేవతి అనే పాత్రలో కృతిశెట్టి కనిపించబోతున్నట్లు పేర్కొన్నారు. ఈ ఫస్ట్ లుక్ పోస్టర్‌లో జైలు ఊచల వెనుక కృతిశెట్టి కనిపించడం ఆసక్తిని పంచుతోంది. ఈ సినిమాలో ఆమె ఖైదీ పాత్రలో నటించనున్నట్లు తెలుస్తోంది. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న కస్టడీ సినిమాలో నాగచైతన్య పోలీస్ అధికారిగా నటిస్తున్నారు. సిల్వర్ స్క్రీన్‌పై ఫస్ట్ టైమ్ పోలీస్ ఆఫీసర్‌గా నాగచైతన్య నటిస్తోన్న సినిమా ఇదే కావడం గమనార్హం.
కస్టడీ సినిమాలో అరవింద స్వామి విలన్‌గా నటిస్తున్నాడు. అతడితో పాటు ప్రియమణి, శరత్‌కుమార్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాకు ఇళయరాజాతో పాటు అతడి తనయుడు యువన్ శంకర్ రాజా సంయుక్తంగా సంగీతాన్ని అందిస్తుండటం గమనార్హం. కస్టడీ సినిమా మే 12న తెలుగుతోపాటు తమిళ భాషల్లో రిలీజ్ కానుంది.
కాగా గత ఏడాది నాలుగు సినిమాల్లో నటించింది కృతిశెట్టి. అందులో బంగార్రాజు మినహా మిగిలిన సినిమాలు విజయాల్ని సాధించలేకపోయాయి. ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి, ది వారియర్, మాచర్ల నియోజకవర్గం పరాజయాల్ని చవిచూశాయి. మరోవైపు ప్రస్తుతం నాగచైతన్య కస్టడీతో పాటు విక్రమ్ కె కుమార్‌తో దూత అనే వెబ్‌సిరీస్ చేస్తున్నాడు.