తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Dhamaka Trp Rating: ధమాకా మూవీకి టీవీలో అదిరిపోయే టీఆర్పీ రేటింగ్

Dhamaka TRP Rating: ధమాకా మూవీకి టీవీలో అదిరిపోయే టీఆర్పీ రేటింగ్

Hari Prasad S HT Telugu

06 April 2023, 21:53 IST

    • Dhamaka TRP Rating: ధమాకా మూవీకి టీవీలో అదిరిపోయే టీఆర్పీ రేటింగ్ రావడం విశేషం. ఓటీటీల హవా నడుస్తున్న ఈ కాలంలో టీవీలో ఓ సినిమాకు మంచి టీఆర్పీ రేటింగ్ చాలా అరుదుగా మాత్రమే వస్తోంది.
ధమాకా మూవీలో రవితేజ, శ్రీలీల
ధమాకా మూవీలో రవితేజ, శ్రీలీల

ధమాకా మూవీలో రవితేజ, శ్రీలీల

Dhamaka TRP Rating: ఇప్పుడంతా ఓటీటీల హంగామానే కదా. కరోనా పుణ్యమాని నేరుగా ఓటీటీల్లోనూ సినిమాలు రిలీజైన, రిలీజవుతున్న పరిస్థితి చూస్తున్నాం. ఒకవేళ నేరుగా కాకపోయినా.. థియేట్రికల్ రిలీజ్ తర్వాత నెల రోజుల్లోపే ఓటీటీల్లోకి వచ్చేస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో టీవీ ఛానెల్స్ లో వచ్చే వరకూ ఓ సినిమా కోసం ప్రేక్షకులు వేచి చూడాల్సిన అవసరం చాలా వరకూ రావడం లేదు.

ట్రెండింగ్ వార్తలు

Brahmamudi May 4th Episode: బ్రహ్మముడి- రాజ్ బిడ్డ తల్లి పేరు మాయ- నిజం రాబట్టిన కావ్య- అత్త దగ్గర కోటి కొట్టేసిన స్వప్న

Karthika deepam 2 today: కార్తీకదీపం 2 సీరియల్..దీప, కార్తీక్ కి అక్రమ సంబంధం అంట గట్టిన నరసింహ..ప్లేటు ఫిరాయించిన అనసూయ

Aavesham OTT: అనుకున్న‌దానికంటే ముందుగానే ఓటీటీలోకి ఫ‌హాద్ ఫాజిల్ వంద కోట్ల మూవీ - స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

OTT: ఓటీటీలో 25 లక్షల మంది మెచ్చిన సినిమా.. సీక్వెల్ కోసం వెయిటింగ్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

దీంతో ఎంత పెద్ద సినిమా అయినా టీవీల్లో సాధారణ టీఆర్పీ రేటింగ్స్ తో సరిపెట్టుకుంటున్నాయి. అయితే రవితేజకు ఒక రకంగా మళ్లీ ఊపిరి పోసిన ధమాకా మూవీ మాత్రం టీవీలోనూ దుమ్ము రేపింది. ఈ సినిమా చాలా రోజుల కిందటే నెట్‌ఫ్లిక్స్ లోకి వచ్చింది. అయితే తాజాగా టెలివిజన్ ప్రీమియర్ రాగా.. దానికి ఏకంగా 10.08 టీఆర్పీ రేటింగ్ రావడం విశేషం.

ఈ మధ్య చాలా వరకూ సినిమాలు 10లోపు టీఆర్పీ రేటింగ్స్ మాత్రమే సాధిస్తున్నాయి. అయితే ఈ మాస్ ఎంటర్‌టైనర్ మూవీకి మాత్రం ప్రేక్షకుల బ్రహ్మరథం పట్టారు. బాక్సాఫీస్ దగ్గర ధమాకా మూవీ రూ.100 కోట్లకుపైగా వసూలు చేసింది. తర్వాత నెట్‌ఫ్లిక్స్ లోనూ చాలా మందే చూశారు. అయినా మార్చి 26న స్టార్ మాలో వచ్చిన ధమాకా.. మంచి టీఆర్పీని సొంతం చేసుకోవడం విశేషం.

త్రినాథ రావు నక్కిన డైరెక్ట్ చేసిన ధమాకా మూవీ రవితేజ కెరీర్లోనే అత్యధిక వసూళ్లు సాధించిన సినిమా. అంతకుముందు హ్యాట్రిక్ ఫ్లాపులతో ఢీలా పడిన మాస్ మహారాజాకు మళ్లీ కొత్త ఉత్సాహాన్నిచ్చిన సినిమా ఇది. మంచి కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్న ఈ మూవీని ప్రేక్షకుల ఆదరించారు. ఇందులో శ్రీలీల ఫిమేల్ లీడ్ గా నటించింది. ఆమె కూడా ఈ మూవీ సక్సెస్ లో కీలకపాత్ర పోషించింది.

ఇక ఇప్పుడు రవితేజ రావణాసుర మూవీతో వస్తున్నాడు. ఈ సినిమా శుక్రవారం (ఏప్రిల్ 7) రిలీజ్ కాబోతోంది. ఈ మూవీపై కూడా మాస్ మహారాజా భారీ ఆశలే పెట్టుకున్నాడు. రావణాసుర తర్వాత టైగర్ నాగేశ్వరరావు మూవీ కూడా లైన్ లో ఉంది.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.