Dhamaka 100 Crore Club: వంద కోట్ల క్లబ్‌లో ధమాకా.. మాస్ మహారాజా కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లు
Dhamaka 100 Crore Club: మాస్ మహారాజా రవితేజ నటించిన ధమాకా చిత్రం అరుదైన ఘనత సాధించింది. ఈ సినిమా వంద కోట్ల క్లబ్‌లో చేరిపోయింది. డిసెంబరు 23న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకోవడమే కాకుండా వసూళ్ల వర్షాన్ని కురిపించింది.
Dhamaka 100 Crore Club: హిట్స్, ఫ్లాపులతో సంబంధం లేకుండా వరుస పెట్టి సినిమాలు చేస్తూ దూసుకెళ్తున్నారు మాస్ మహారాజా రవితేజ. ఆయన నటించిన తాజా చిత్రం ధమాకా. శ్రీలీల హీరోయిన్‌గా నటించిన ఈ సినిమా గత నెలలో విడుదలై పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. ముఖ్యంగా మాస్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుంది. రవితేజ మాస్ యాక్షన్‌తో పాటు కామెడీ టైమింగ్‌కు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. రెగ్యూలర్, కమర్షియల్ చిత్రాలు ఇకపై ఆడవు అనే వారి నోళ్లు మూస్తూ మాస్ యాక్షన్ చిత్రంతో అదిరిపోయే విజయాన్ని సొంతం చేసుకున్నారు. తాజాగా ఈ చిత్రం అరుదైన ఘనత సొంతం చేసుకుంది. ధమాకా వంద కోట్ల క్లబ్‌లో చేరింది.
రొటీన్ స్టోరీ లైనే అయినప్పటికీ రవితేజ తనదైన పర్ఫార్మెన్స్‌తో సినిమా విజయంలో కీలక పాత్ర పోషించారు. బాక్సాఫీస్ వద్ద రూ.100 కోట్లతో వసూళ్ల వర్షం కురిసింది. మాస్ మహారాజా కెరీర్‌లో వంద కోట్ల క్లబ్‌లో చేరిన మొదటి చిత్రంగా ఇది రికార్డు సృష్టించింది. గతేడాది రవితేజ నటించిన మూడు చిత్రాలు విడుదల కాగా.. ఇది మినహా మిగిలిన చిత్రాలు పెద్దగా ఆకట్టుకోలేదు. ధమాకా మాత్రం అద్భుతమైన వసూళ్లతో క్రాక్ తర్వాత రవితేజకు ఆ రేంజ్ హిట్ లభించింది.
క్రిస్మస్ కానుకగా విడుదలైన ధమాకా చిత్రానికి ఇంకా కలెక్షన్ల జోరు తగ్గలేదు. సంక్రాంతికి ఇంకో వారం రోజుల సమయం ఉండటంతో ఈ వసూళ్లు ఇంకా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. సంక్రాంతికి వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య చిత్రాలు రానుండటంతో ఆ లోపు బాక్సాఫీస్ వద్ద మరిన్ని వసూళ్లు సాధించేలా కనిపిస్తోంది.
పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తోన్న ధమాకా సినిమాకు నిర్మాతగా టీజీ విశ్వ ప్రసాద్, సహ నిర్మాతగా వివేక్ కూచిబొట్ల వ్యవహరించారు. త్రినాథరావు నక్కిన దర్శకత్వం వహించారు. ప్రసన్న కుమార్ బెజవాడ ఈ చిత్రానికి కథ, మాటలు అందిస్తున్నారు. భీమ్స్ సెసిరొలియో సంగీతాన్ని సమకూర్చగా.. కార్తీక్ ఘట్టమనేని కెమెరామెన్‌గా పనిచేశాడు. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా డిసెంబరు 23న ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది.
సంబంధిత కథనం