Ravi Teja on Sree Leela: ఇండియన్‌ సినిమాలో శ్రీలీల ఓ రేంజ్‌కు వెళ్తుంది: రవితేజ-ravi teja on sree leela says she will be the next big thing in indian cinema industry ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ravi Teja On Sree Leela: ఇండియన్‌ సినిమాలో శ్రీలీల ఓ రేంజ్‌కు వెళ్తుంది: రవితేజ

Ravi Teja on Sree Leela: ఇండియన్‌ సినిమాలో శ్రీలీల ఓ రేంజ్‌కు వెళ్తుంది: రవితేజ

Hari Prasad S HT Telugu
Dec 30, 2022 11:00 AM IST

Ravi Teja on Sree Leela: ఇండియన్‌ సినిమాలో శ్రీలీల ఓ రేంజ్‌కు వెళ్తుందని అన్నాడు మాస్‌ మహారాజా రవితేజ. ధమాకా మూవీ సక్సెస్‌ మీట్‌లో ఆమెపై ప్రశంసలు కురిపించాడు.

ధమాకా సక్సెస్ మీట్ లో శ్రీలీల, రవితేజ
ధమాకా సక్సెస్ మీట్ లో శ్రీలీల, రవితేజ

Ravi Teja on Sree Leela: మాస్‌ మహారాజా రవితేజ, అందాల నటి శ్రీలీల జంటగా నటించిన సినిమా ధమాకా. చాలా రోజుల తర్వాత రవితేజకు ఈ సినిమా ద్వారా పెద్ద హిట్‌ దక్కింది. క్రాక్‌ తర్వాత మధ్యలో రెండు సినిమాలు బోల్తా కొట్టడంతో ఢీలా పడిన ఈ ఎనర్జటిక్‌ స్టార్‌.. ధమాకాతో మళ్లీ ఊపు మీదున్నాడు. ఈ సినిమా ఊహించిన దాని కంటే పెద్ద సక్సెస్‌ సాధించింది.

తొలి వారంలోనే కలెక్షన్ల వర్షం కురిపించింది. దీంతో ఈ సినిమా సక్సెస్‌ మీట్‌ను గురువారం (డిసెంబర్‌ 29) ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకకు ధమాకా సినిమా యూనిట్‌తోపాటు దర్శకుడు రాఘవేంద్ర రావు, హరీస్‌శంకర్‌, నటుడు తేజ సజ్జ అతిథులుగా వచ్చారు. ఈ సందర్భంగా రవితేజ మాట్లాడుతూ.. ఈ సినిమా సక్సెస్‌కు కారణమైన అందరికీ పేరు పేరునా కృతజ్ఞతలు చెప్పాడు.

ఇక ఈ మూవీలో హీరోయిన్‌గా నటించిన శ్రీలీలపై అయితే రవితేజ ప్రశంసల వర్షం కురిపించాడు. అందంతోపాటు నటన, డ్యాన్స్‌లలోనూ ఇరగదీసే శ్రీలీల ఇండియన్‌ సినిమాలోనే పెద్ద స్టార్‌ అవుతుందని అతడు చెప్పడం విశేషం.

"శ్రీలీలా చాలా టాలెంట్‌ ఉన్న నటి. ఆమె చాలా అందంగా ఉంటుంది. పాజిటివ్‌గా ఉండే వ్యక్తి. ఆమె డ్యాన్స్‌లు అద్భుతం. తెలుగులోనే కాదు ఆమె ఇండియన్‌ సినిమాలోనే పెద్ద స్టార్‌ అవుతుంది. నా మాటలు గుర్తు పెట్టుకోండి" అని రవితేజ అన్నాడు. ఇక డైరెక్టర్‌ త్రినాథరావుకు కూడా అతడు థ్యాంక్స్‌ చెప్పాడు.

"ధమాకా అనే బస్సుకు త్రినాథరావు డ్రైవర్‌ అయితే నేను కండక్టర్‌ని. ఇక నుంచి వరుస సినిమాలతో నేను మిమ్మల్ని అలరించాలని అనుకుంటున్నా" అని రవితేజ అన్నాడు. ధమాకా మూవీ బాక్సాఫీస్‌ దగ్గర దూసుకెళ్తోంది. తొలి రోజు రోజుల్లోనే ఏకంగా రూ.56 కోట్ల కలెక్షన్లతో దుమ్ము రేపింది.

IPL_Entry_Point