Dhamaka 10 Days Collections: 100 కోట్ల వైపు దూసుకెళ్తున్న ధమాకా.. పది రోజుల కలెక్షన్లు ఎన్నంటే..?-dhamaka 10 days collections near 90 crores ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Dhamaka 10 Days Collections: 100 కోట్ల వైపు దూసుకెళ్తున్న ధమాకా.. పది రోజుల కలెక్షన్లు ఎన్నంటే..?

Dhamaka 10 Days Collections: 100 కోట్ల వైపు దూసుకెళ్తున్న ధమాకా.. పది రోజుల కలెక్షన్లు ఎన్నంటే..?

Hari Prasad S HT Telugu
Jan 02, 2023 12:20 PM IST

Dhamaka 10 Days Collections: 100 కోట్ల వైపు దూసుకెళ్తోంది ధమాకా మూవీ. మాస్‌ మహారాజా రవితేజ నటించిన ఈ మాస్‌ మూవీ పది రోజులైనా ఇప్పటికీ బాక్సాఫీస్‌ దగ్గర వెనక్కి తగ్గడం లేదు.

రూ.100 కోట్ల క్లబ్ వైపు దూసుకెళ్తున్న ధమాకా
రూ.100 కోట్ల క్లబ్ వైపు దూసుకెళ్తున్న ధమాకా

Dhamaka 10 Days Collections: చాలా రోజుల తర్వాత మాస్‌ మహారాజా రవితేజకు ఓ మంచి హిట్‌ దక్కింది. ధమాకా అతని ఫ్యాన్స్‌కు పిచ్చిపిచ్చిగా నచ్చేసింది. మాస్ హిట్‌ అంటే ఎలా ఉంటుందో ఇప్పుడు వాళ్లు చూపిస్తున్నారు. బాక్సాఫీస్ దగ్గర ఏమాత్రం తగ్గకుండా దూసుకెళ్తున్న ఈ మూవీ రూ.100 కోట్లవైపు వేగంగా పరుగులు పెడుతోంది.

తాజాగా మేకర్స్‌ 10 రోజుల కలెక్షన్ల వివరాలు వెల్లడించారు. ఈ సినిమా ఇప్పటి వరకూ ప్రపంచవ్యాప్తంగా రూ.89 కోట్లు వసూలు చేయడం విశేషం. తొలి వారంలోనే కాదు.. సినిమా రెండో వారంలోనూ వసూళ్లు బాగానే ఉన్నాయి. రెండో వీకెండ్‌, అందులోనూ కొత్త ఏడాది ప్రారంభ రోజు అయిన ఆదివారం (జనవరి 1) ఈ సినిమాకు మంచి కలెక్షన్లు వచ్చాయి.

ఈ సినిమాలోని మాస్‌ సాంగ్స్‌కు మంచి రెస్పాన్స్‌ వస్తోంది. న్యూఇయర్‌ పార్టీల్లోనూ చాలా చోట్ల ఈ మూవీ పాటలే వినిపించాయి. రవితేజను మాస్‌ అవతారంలో చూడాలనుకుంటున్న ఫ్యాన్స్‌కు చాలా రోజుల తర్వాత ఆ అవకాశం దక్కింది. ఇప్పటి వరకూ రూ.89 కోట్లు రాబట్టగా ఇదే స్పీడులో వసూళ్లు వస్తే త్వరలోనే రూ.100 కోట్ల క్లబ్‌లో చేరడం ఖాయంగా కనిపిస్తోంది.

అమెరికాలోనూ 5 లక్షల డాలర్లు వసూలు చేసింది ధమాకా. ఏపీ, తెలంగాణల్లో అయితే ఈ సినిమా భారీ వసూళ్లు రాబడుతోంది. ఇండియా మొత్తంగా చూసినా అవతార్‌ ది వే ఆఫ్‌ వాటర్‌, సర్కస్‌ మూవీల తర్వాత అత్యధిక వసూళ్లు సాధించిన మూడో సినిమాగా ధమాకా నిలవడం విశేషం. ఈ సినిమాలో రవితేజ పక్కన నటించిన శ్రీలీల అందం, ఆమె డ్యాన్స్‌లకు కూడా ఫ్యాన్స్‌ ఫిదా అవుతున్నారు. త్రినాథరావు నక్కిన ఈ సినిమాను డైరెక్ట్‌ చేశారు.

IPL_Entry_Point

టాపిక్