Dhamaka Movie Review: రవితేజ 'ధమాకా' మూవీ రివ్యూ.. హిట్టా.. ఫట్టా..?-ravi teja and sreeleela s dhamaka telugu movie review directed by trinadha rao nakkina ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Dhamaka Movie Review: రవితేజ 'ధమాకా' మూవీ రివ్యూ.. హిట్టా.. ఫట్టా..?

Dhamaka Movie Review: రవితేజ 'ధమాకా' మూవీ రివ్యూ.. హిట్టా.. ఫట్టా..?

Anand Sai HT Telugu
Dec 23, 2022 12:38 PM IST

Ravi Teja's Dhamaka Movie Review: మాస్ మహారాజా రవితేజ నటించిన ధమాకా మూవీ కోసం ఆయన ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూశారు. ఈసారి హిట్ పడాలని కోరుకున్నారు. ఇంతకీ సినిమా ఎలా ఉంది?

రవితేజ ధమాకా మూవీ రివ్యూ
రవితేజ ధమాకా మూవీ రివ్యూ (twitter)

మాస్ మహారాజా రవితేజ, శ్రీలీల జంటగా నటించిన చిత్రం 'ధమాకా'.. డబుల్ ఇంపాక్ట్ ట్యాగ్ లైన్. త్రినాథరావు నక్కిన దర్శకత్వం వహించిన ఈ సినిమాపై రవితేజ చాలా ఆశలు పెట్టుకున్నారు. క్రాక్ మూవీతో సూపర్ హిట్ కొట్టిన రవితేజ.. ఖిలాడి, రామారావు ఆన్ డ్యూటీ చిత్రాలు ఆవిరిచేశాయి. ఈసారి ఎలాగైనా.. హిట్ పడాలని అభిమానులు సైతం బలంగా కోరుకున్నారు. మరి ఫ్యాన్స్ అంచనాలకు రీచ్ అయ్యారా? ఆయన ఖాతాలో 'ధమాకా' హిట్ పడినట్టేనా? సినిమా ఎలా ఉంది?

నటీనటులు

రవితేజ, శ్రీలీల, జయరామ్, సచిన్ ఖేడేకర్, రావు రమేశ్, తనికేళ్ల భరణీ, చిరాగ్ జానీ, అలీ, ప్రవీణ్, హైపర్ ఆది, పవిత్ర లోకేశ్, తులసీస రాజశ్రీ నాయర్ తదితరులు. కార్తీక్ ఘట్టమనేని సినిమాటోగ్రఫీ, భీమ్స్ సంగీతం సమకూర్చారు. సినిమాకు కథ, స్క్రీన్ ప్లే, మాటలు ప్రసన్న కుమార్ అందించగా.. త్రినాథరావు నక్కిన దర్శకత్వం వహించారు. అభిషేక్ అగర్వాల్, టీజీ విశ్వప్రసాద్ నిర్మించారు.

కథ

'ధమాకా' సినిమాలో రవితేజ రెండు పాత్రల్లో కనిపిస్తాడు. ఈ రెండు పాత్రల చూట్టే కథ నడుస్తూ ఉంటుంది. ఒక పాత్రలో మధ్యతరగతి కుటుంబంలో నివసించే స్వామిగా ఉంటాడు. మరో పాత్రలో ఆనంద్ చక్రవర్తి(రవి తేజ) అనే మిలీనియర్ పాత్రలోనూ కనిపిస్తాడు. అతడి తండ్రి చక్రవర్తి (సచిన్ ఖేడేఖర్). వీళ్లకు చెందిన పీపుల్స్ మార్ట్ అనే.. కంపెనీని జేపీ(జయరామ్) స్వాధీనం చేసుకోవాలని అనుకుంటాడు. అయితే ఇదే కంపెనీకి సీఈవో కావాలని మరో వ్యక్తి కూడా ఎదురు చూస్తూ ఉంటాడు.

ఇదే సమయంలో స్వామి(రవి తేజను) తన చెల్లెలి ఫ్రెండ్ అయిన (పావని) శ్రీలీలను చూస్తాడు. ప్రేమిస్తున్నానని చెబుతాడు. మరోవైపు ఆమె తండ్రి రావు రమేశ్.. స్వామి(రవి తేజ)లా కనిపించే ఆనంద్ చక్రవర్తి(రవి తేజ)ని చూపించి పెళ్లి చేసుకోవాలని చెబుతాడు. ఇద్దరిలా కనిపించే రవి తేజ ఒక్కడేనా? పీపుల్స్ మార్ట్ కంపెనీని కాపాడుకుంటాడా? శ్రీలీల ఎవరిని ప్రేమిస్తుంది? పీపుల్స్ మార్ట్ ను స్వాధీనం చేసుకోవాలని చూసిన మరో వ్యక్తి ఎవరు? కథలో ఉన్న ట్వీస్టులేంటి.. అనే విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

ఎలా ఉంది?

ఇక సినిమా మాస్ కథ కావడంతో రవి తేజ అదరగొట్టేశాడు. సినిమాలో ఆయన ఎనర్జీ కనిపిస్తుంది. రవి తేజ వన్ మ్యాన్ షోనే ఉంటుంది. శ్రీలీల యాక్టింగ్ ఆకట్టుకుంటుంది. ఆమె వేసిన డ్యాన్స్ ఫిదా అయిపోతారు. రవితేజకు పోటీ ఇచ్చింది. మాస్ కు కావాల్సిన సాంగ్ కూడా మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ ఇచ్చేశాడు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా ఒకే అనిపిస్తుంది. ఇతర పాత్రల్లోని నటులు సైతం చక్కగా నటించారు. కొన్ని సీన్లలో కామెడీ పండింది. రావు రమేశ్, హైపర్ ఆది కామెడీలో కొన్ని పంచ్ లు పేలతాయి. సినిమాటోగ్రఫీ బాగుంది, భీమ్స్ మ్యూజిక్ సైతం ఆకట్టుకుంటుంది. ప్రసన్న కుమార్ బెజవాడ రాసిన కొన్ని డైలాగ్స్ బాగున్నాయి.

కానీ సినిమా మాత్రం రోటిన్ కథ. కొన్ని సన్నివేశాలు గెస్ చేసేలా ఉంటాయి. ఫస్ట్ హాఫ్ లో కామెడీ కనిపిస్తుంది. సెకండ్ హాఫ్ లో సీరియస్ లోకి వెళ్తుంది. రవి తేజ ద్విపాత్ర అభినయం కొన్నిచోట్ల గందరగోళం అనిపిస్తుంది. రొటీన్ గా కథ వెళ్తుంది. రెగ్యూలర్ ఫార్ములాతోనే సినిమాను నడింపిచేశారు. కొన్ని సినిమా స్పూఫ్ లు కూడా ఇందులో చూడొచ్చు. ఇంద్ర స్పూఫ్ వర్కవుట్ అయింది. ప్రేక్షకులు ఎంజాయ్ చేశారు. రవి తేజను ఇష్టపడే వారికి సినిమా నచ్చుతుంది. కథలో కొత్తదనం లేదు.. ఎలాంటి అంచనాలు లేకుండా వెళ్తే.. సినిమాను ఎంజాయ్ చేయోచ్చు.

ప్లస్ పాయింట్స్: రవి తేజ యాక్టింగ్, ఇతర న‌టీన‌టులు, మ్యూజిక్, సినిమాటోగ్రఫీ

మైన‌స్ పాయింట్స్ : రొటీన్ క‌థ‌, కొన్ని చోట్ల కామెడీ డైలాగ్స్ పేలకపోవడం, కొంత ల్యాగ్ సన్నివేశాలు

రేటింగ్ : 2.75/5

IPL_Entry_Point