తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ravanasura Run Time: రవితేజ రావణాసుర రన్ టైమ్ రివీల్

Ravanasura Run Time: రవితేజ రావణాసుర రన్ టైమ్ రివీల్

01 April 2023, 7:58 IST

  • Ravanasura Run Time: రావ‌ణాసుర సినిమాతో ఏప్రిల్ 7న ప్రేక్ష‌కుల‌ ముందుకు రాబోతున్నాడు ర‌వితేజ‌. ఈసినిమాతో హ్యాట్రిక్ స‌క్సెస్‌పై క‌న్నేశాడు. రావ‌ణాసుర ర‌న్ టైమ్ ఎంతంటే...

ర‌వితేజ‌
ర‌వితేజ‌

ర‌వితేజ‌

Ravanasura Run Time: ధ‌మాకా, వాల్తేర్ వీర‌య్య స‌క్సెస్‌ల‌తో జోరుమీదున్నాడు ర‌వితేజ‌ (Raviteja). రావ‌ణాసుర‌తో హ్యాట్రిక్ విజ‌యంపై గురిపెట్టాడు. యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందిన ఈ సినిమా ఏప్రిల్ 7న వ‌ర‌ల్డ్ వైడ్‌గా రిలీజ్ కానుంది. ఈ సినిమాకు సుధీర్‌వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. రావ‌ణాసుర సెన్సార్ ప‌నులు శుక్ర‌వారం కంప్లీట్ అయ్యాయి.

ట్రెండింగ్ వార్తలు

Romeo OTT Release Date: విజయ్ ఆంటోనీ ‘రోమియో’ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఖరారు.. ఏ ప్లాట్‍ఫామ్‍లోకి వస్తుందంటే..

Manjummel Boys OTT Release: మరికొన్ని గంటల్లో ఓటీటీలోకి మంజుమ్మల్ బాయ్స్: స్ట్రీమింగ్ వివరాలివే

Heeramandi OTT: 1920లో కరోనా వైరస్.. టీఆర్ఎస్: వెబ్ సిరీస్‍లో సంజయ్ లీలా భన్సాలీ పొరపాట్లు

Sundar C: దేశం గర్వించే చిత్రం అవుతుంది.. తెలుగు సినిమాపై తమిళ డైరెక్టర్ సుందర్ కామెంట్స్

ఈ సినిమాకు సెన్సార్ బోర్డ్ ఏ స‌ర్టిఫికేట్ ఇవ్వ‌డం గ‌మ‌నార్హం. ర‌క్త‌పాతం, హింస ఎక్కువ‌గా ఉన్న క‌థ కావ‌డంతోనే ఏ స‌ర్టిఫికేట్ ఇచ్చిన‌ట్లు స‌మాచారం. అంతే కాకుండా సెన్సార్ బోర్డ్ సినిమాలో ఆరు క‌ట్స్ చెప్పిన‌ట్లు స‌మాచారం. ఈ సినిమా ర‌న్ టైమ్ 2 గంట‌ల 21 నిమిషాల 56 సెకండ్స్‌గా ఫిక్స్ చేశారు. లెంగ్త్ ప‌రంగా ధ‌మాకా కంటే రావ‌ణాసుర పెద్ద సినిమా కావ‌డం గ‌మ‌నార్హం.

రావ‌ణాసుర‌లో క్రిమిన‌ల్ లాయ‌ర్‌గా నెగెటివ్ షేడ్స్‌తో కూడిన క్యారెక్ట‌ర్‌లో ర‌వితేజ క‌నిపించ‌బోతున్న‌ట్లు స‌మాచారం. ఇందులో ర‌వితేజ‌కు జోడీగా ఐదుగురు హీరోయిన్లు న‌టిస్తోన్నారు. . ఈ పాత్ర‌ల్లో అను ఇమ్మాన్యుయేల్‌(Anu Emmanuel), మేఘా ఆకాష్, ఫ‌రియా అబ్దుల్లా, ద‌క్షా న‌గార్క‌ర్ తో పాటు పూజిత పొన్నాడ క‌నిపించ‌బోతున్నారు. కీల‌క పాత్ర‌లో సుశాంత్ న‌టిస్తోన్నాడు.

రావ‌ణాసుర‌లో హీరోగా న‌టిస్తూనే ఈ సినిమా నిర్మాణంలో ర‌వితేజ భాగ‌స్వామిగా వ్య‌వ‌హ‌రించాడు. అర్జున్ రెడ్డి ఫేమ్ హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ రామేశ్వ‌ర్ సంగీతాన్ని అందించాడు.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.