తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Brahmastra Most Googled Indian Film Of 2022: ఆర్‌ఆర్‌ఆర్‌, కేజీఎఫ్‌ 2, కాంతారాలను మించిపోయిన బ్రహ్మాస్త్ర

Brahmastra most Googled Indian film of 2022: ఆర్‌ఆర్‌ఆర్‌, కేజీఎఫ్‌ 2, కాంతారాలను మించిపోయిన బ్రహ్మాస్త్ర

HT Telugu Desk HT Telugu

07 December 2022, 15:28 IST

    • Brahmastra most Googled Indian film of 2022: ఆర్‌ఆర్‌ఆర్‌, కేజీఎఫ్‌ 2, కాంతారాలను మించిపోయింది బ్రహ్మాస్త్ర. ఈ ఏడాది గూగుల్‌ సెర్చ్‌లో ఎక్కువ మంది వెతికిన సినిమాగా నిలిచింది.
బ్రహ్మాస్త్ర
బ్రహ్మాస్త్ర

బ్రహ్మాస్త్ర

Brahmastra most Googled Indian film of 2022: ఇండియన్‌ సినిమాకు 2022 బాగా కలిసి వచ్చిందనే చెప్పాలి. భాషలకు అతీతంగా ఈ ఏడాది ఎన్నో గొప్ప కమర్షియల్‌ మూవీస్‌ ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. రాజమౌళి ఆర్ఆర్‌ఆర్‌తోపాటు కేజీఎఫ్‌ 2, కాంతారాలాంటి సినిమాలు సంచలనం సృష్టించాయి. అయితే ఈ ఏడాది గూగుల్‌ సెర్చ్‌లో ఎక్కువ మంది వెతికిన సినిమా మాత్రం వీటిలో ఒకటి కాదు.

ట్రెండింగ్ వార్తలు

Prithviraj Sukumaran: ‘సలార్’పై ఇంట్రెస్టింగ్ విషయం చెప్పిన పృథ్విరాజ్ సుకుమారన్.. ఎగ్జైట్ అవుతున్న ఫ్యాన్స్

Janhvi Kapoor: తిరుపతిలో పహారియాతో జాన్వీ కపూర్ పెళ్లి అంటూ రూమర్.. స్పందించిన హీరోయిన్

Rajamouli: అలాంటి సినిమా తీయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నా.. చేస్తా: రాజమౌళి.. ఆర్ఆర్ఆర్‌పై ఆ ప్రశ్నకు నో కామెంట్

Netflix OTT top movies: నెట్‍ఫ్లిక్స్‌లో టాప్‍కు దూసుకొచ్చేసిన హారర్ థ్రిల్లర్ సినిమా.. రెండో ప్లేస్‍లో కామెడీ మూవీ

ఈ మూడు సినిమాలను వెనక్కి నెట్టి బ్రహ్మాస్త్ర టాప్‌లో నిలిచింది. ఆ మూడు సినిమాలతో పోలిస్తే కమర్షియల్‌గా అంత సక్సెస్‌ కాలేకపోయినా.. మూవీస్‌ సెర్చ్‌ లిస్ట్‌లో మాత్రం పైన ఉండటం విశేషం. రణ్‌బీర్‌ కపూర్‌, ఆలియా భట్‌ నటించిన బ్రహ్మాస్త్ర పార్ట్‌ వన్‌ - శివ మూవీ ఈ ఏడాది విపరీతమైన బజ్‌ క్రియేట్‌ చేసింది. సుమారు ఐదేళ్ల పాటు షూటింగ్‌ జరుపుకొని ఈ ఏడాది రిలీజ్ కావడంతో ఎక్కువ మంది దీని గురించి తెలుసుకోవడానికి ఆసక్తి చూపించారు.

2022లో కేజీఎఫ్‌ 2, ఆర్‌ఆర్‌ఆర్‌, కాంతారా, ది కశ్మీర్‌ ఫైల్స్‌లాంటి సినిమాలు కమర్షియల్‌గా అతిపెద్ద విజయాలు సాధించాయి. ఇండియన్‌ సినిమా హిస్టరీలో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాల జాబితాలో కేజీఎఫ్‌ 2, ఆర్‌ఆర్‌ఆర్‌లాంటి మూవీస్‌ నిలిచాయి. అయితే సెర్చ్‌లో మాత్రం వీటిని వెనక్కి నెట్టి బ్రహ్మాస్త్ర నిలవడం విశేషం.

రూ.300 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా బాక్సాఫీస్‌ దగ్గర రూ.400 కోట్లకుపైగా వసూలు చేసింది. బ్రహ్మాస్త్రలో రణ్‌బీర్‌ కపూర్‌, ఆలియా, అమితాబ్ బచ్చన్‌, నాగార్జున, మౌనీరాయ్‌లాంటి వాళ్లు నటించారు. సెర్చ్‌ లిస్ట్‌లో బ్రహ్మాస్త్ర తర్వాత కేజీఎఫ్‌ 2, ది కశ్మీర్‌ ఫైల్స్‌, ఆర్‌ఆర్‌ఆర్‌, కాంతారా ఉన్నాయి.

టాప్‌ 5 మూవీస్‌లో మూడు సౌత్ నుంచే కావడం మరో విశేషం. ఈ ఏడాది అత్యధిక వసూళ్లు సాధించిన కేజీఎఫ్‌ 2 సెర్చ్‌ లిస్ట్‌లో మాత్రం రెండోస్థానంతో సరిపెట్టుకుంది. టాప్‌ 10లో మరో తెలుగు సినిమా పుష్ప: ది రైజ్‌ కూడా ఉంది. ఈ సినిమా ఆరో స్థానంలో నిలిచింది. మొత్తంగా చూస్తే మాత్రం టాప్‌ టెన్‌లో ఆరు సౌత్‌ సినిమాలు కాగా.. నాలుగు మాత్రమే బాలీవుడ్‌ సినిమాలు ఉన్నాయి. బాలీవుడ్‌ నుంచి బ్రహ్మాస్త్రతోపాటు ది కశ్మీర్‌ ఫైల్స్‌, లాల్‌ సింగ్‌ చడ్డా, దృశ్యం 2 మాత్రమే ఉన్నాయి.

టాప్‌ 10 లిస్ట్‌ ఇదే

బ్రహ్మాస్త్ర

కేజీఎఫ్‌ 2

ది కశ్మీర్‌ ఫైల్స్‌

ఆర్‌ఆర్‌ఆర్‌

కాంతారా

పుష్ప: ది రైజ్‌

విక్రమ్‌

లాల్‌ సింగ్‌ చడ్డా

దృశ్యం 2థోర్‌: లవ్‌ అండ్‌ థండర్‌

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.